టాలీవుడ్లో నూరు శాతం సక్సెస్ రేటు ఉన్న దర్శకుల్లో రాజమౌళి తర్వాత కొరటాల శివ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దర్శకుడు కొరటాల శివ ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నీ కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. కొన్ని ఇండస్ట్రీ హిట్‌గా కూడా నిలిచాయి. అయితే జనతా గ్యారేజ్ మాత్రం ఒక మోస్తరుగానే ఆడినది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ పెట్టుకున్న నమ్మకంను పూర్తి స్థాయిలో కొరటాల శివ నిలుపుకోలేక పోయాడు. అందుకే మరోసారి ఎన్టీఆర్‌తో సినిమా చేయాలని కొరటాల భావిస్తున్నాడట.
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం ఆచార్యను కొరటాల తెరకెక్కిస్తున్నాడు. ఆ చిత్రం షూటింగ్ సగానికి పైగా పూర్తి అయినట్లుగా తెలుస్తోంది. కరోనా కల్లోలం లేకుంటే ప్రస్తుతం షూటింగ్‌తో బిజీ బిజీగా ఉండేవాడు. మే లేదా జూన్‌లో సినిమా షూటింగ్‌ను పూర్తి చేసేలా కొరటాల ప్లాన్ చేశాడట. చిరంజీవి సినిమా కోసం ఏకంగా రెండు సంవత్సరాల పాటు కొరటాల వెయిట్ చేయాల్సి వచ్చింది. అందుకే ఆచార్య చిత్రం తర్వాత ఏమాత్రం ఆలస్యం చేయవద్దని ఈయన భావిస్తున్నాడట.
ఆచార్య చిత్రం విడుదల అవ్వడమే ఆలస్యం వెంటనే కొత్త సినిమాను పట్టాలెక్కించేలా చర్చలు జరుపుతున్నాడు. ఆ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లోనే విడుదల చేయాలని కొరటాల శివ భావిస్తున్నాడట. ఇక కొరటాల శివ తదుపరి చిత్రాన్ని ఎన్టీఆర్ తో చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ సినిమా ఉంటుందని అంటున్నారు. అయితే ఆ సినిమా విషయంలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అదుకే ఈ కొరటాల శివ లైన్లోకి వెళ్తున్నట్లుగా ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అతి త్వరలోనే ఈ విషయమై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
678378 85548This web internet site may be a walk-through for all with the details you wanted in regards to this and didnt know who to question. Glimpse here, and youll definitely discover it. 497323
34341 89114Very good job on this write-up! I really like how you presented your facts and how you produced it intriguing and effortless to recognize. Thank you. 511432
957553 494626Wow ~ Good stuff ~ Come and check out MY ?? 34359
938514 867855informatii interesante si utile postate pe blogul dumneavoastra. dar ca si o paranteza , ce parere aveti de inchirierea apartamente vacanta ?. 769223