అల్లు అర్జున్ సంక్రాంతికి ‘అల వైకుంఠపురంలో’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్‌ను దక్కించుకున్నాడు. తదుపరి చిత్రాన్ని సుకుమార్ దర్శకత్వంలో చేయబోతున్న విషయం తెల్సిందే. సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తూనే బన్నీ మెగాస్టార్ చిరంజీవి సినిమాలో కూడా నటించాలని కోరుకుంటున్నట్లుగా సమాచారం అందుతోంది. సినీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ మేరకు మెగా 152 చిత్రంలో కీలక పాత్ర కోసం తనను తీసుకోవాలంటూ దర్శకుడు కొరటాల శివకు బన్నీ ఇండైరెక్ట్‌గా సిగ్నల్స్ ఇచ్చాడట.
బన్నీతో గతంలో కొరటాల శివ చేయాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల అది వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు బన్నీ మామ చిరంజీవి సినిమాలో నటించాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. కాని కొరటాల మాత్రం ఆచార్యలోని ఆ పాత్ర కోసం రామ్ చరణ్ లేదా మహేష్ బాబును మాత్రమే అనుకుంటున్నాడట. మహేష్‌బాబు కాదంటే రామ్ చరణ్ తో కాస్త ఆలస్యం అయినా చేయించాలని భావిస్తున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
మహేష్‌బాబు ప్రస్తుతం కొత్త కథలు వింటున్నాడు. సరి లేరు నీకెవ్వరు చిత్రం తర్వాత మహేష్‌బాబు రెగ్యులర్ కథలతో సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ప్రయోగాలకు పోకుండా కమర్షియల్ సినిమాలు చేయాలనే ఉద్దేశ్యంతో వంశీ పైడిపల్లి సినిమాను కాదన్నాడు. కొరటాల శివ గతంలో మహేష్‌కు హిట్స్ ఇచ్చాడు కనుక ఆయన దర్శకత్వంలో చిరు మూవీలో నటించేందుకు ఓకే చెప్పే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. బన్నీకి మాత్రం చిరు మూవీలో నటించాలనే కోరిక చాలా ఉన్నట్లుగా ఆయన సన్నిహితుల ద్వారా తెలుస్తోంది.
228161 518337This can indicate that a watch has spent some or all of its life in the tropics and was not serviced as regularly as it should have been. 841081
32514 141910Absolutely composed content material , Truly enjoyed examining . 286692
781788 402999Its wonderful as your other posts : D, appreciate it for putting up. 102751