కొరటాల శివ నుండి ఆచార్య ద్వారా ఊహించని డిజాస్టర్ వచ్చింది. ఈ సినిమాకు వచ్చిన లాస్ లు దాదాపుగా 80 కోట్ల మేర ఉంటాయని తెలుస్తోంది. నిజానికి ఆచార్య చిత్ర ప్రొడక్షన్ 70 కోట్ల రూపాయలు ఖర్చయింది. చిరంజీవి, రామ్ చరణ్, కొరటాల శివ రెమ్యునరేషన్ లు కాకుండా అయిన మొత్తమిది. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించగా ప్రొడక్షన్ అయ్యాక బిజినెస్ మొత్తాన్ని శివ హ్యాండోవర్ చేసుకున్నాడు.
మ్యాట్నీ వారికి 80 కోట్ల రూపాయలు ముట్టజెప్పి ఈ చిత్ర డిస్ట్రిబ్యూషన్ ను కూడా హ్యాండిల్ చేసాడు. కొన్ని చోట్ల ఔట్రైట్ గా అమ్మేసి, కొన్ని చోట్ల సొంతంగా రిలీజ్ చేసుకున్నాడు. చిరంజీవి, రామ్ చరణ్ లకు కలిపి 70 కోట్ల పారితోషికాన్ని ఇచ్చాడు.
అయితే విడుదలయ్యాక ఆచార్య డిజాస్టర్ గా నిలిచింది. ఈ చిత్రం కేవలం 50 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేసింది. ఈ చిత్రానికి పెట్టిన పెట్టుబడి, డిస్ట్రిబ్యూటర్లకు తిరిగిచ్చిన మొత్తం ఇలా అన్నీ చూసుకుంటే కొరటాల శివకు దాదాపు 100 కోట్ల రూపాయల నష్టం వచ్చినట్లు తెలుస్తోంది.