హైదరాబాద్ కు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మళ్లీ పార్టీ మారబోతున్నాడు. ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్న ఈయన బీజేపీలో జాయిన్ అవ్వడం కన్ఫర్మ్ అయ్యింది. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ తరపున ఎంపీగా పోటీ చేసి ఓటమి చవి చూసిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి చాలా రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నాడు. ఈ సమయంలో ఆయన్ను రేవంత్ రెడ్డి బుజ్జగించేందుకు ప్రయత్నాలు చేశాడు. కాని రాష్ట్రంలో కాంగ్రెస్ చచ్చి పోయింది.
రేవంత్ రెడ్డికి ముందే పీసీసీ పదవి ఇచ్చి ఉంటే పార్టీ కి భవిష్యత్తు ఉండేది అన్నట్లుగా కొండా అభిప్రాయం వ్యక్తం చేశారు. బీజేపీలో చేరబోతున్నది పార్టీల కోసం పదవుల కోసం కాదు అన్నట్లుగా ఆయన క్లారిటీ ఇచ్చాడు. బీజేపీలో ఒక కార్యకర్తగా జాయిన్ అవ్వబోతున్నాను.. పార్టీ అధినాయకత్వం ఏ బాధ్యత ఇస్తే ఆ బాధ్యత నెరవేర్చుతూ బీజేపీ లో కొనసాగుతాను అన్నాడు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పాలన దారుణంగా తయారయ్యింది. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ కి తప్పకుండా ప్రజలు బుద్ది చెప్తారనే నమ్మకం ఉందన్నారు.
546339 443914This is the very first time I frequented your web page and to thispoint? I surprised with the analysis you made to create this actual put up amazing. 622027