వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ కొండా. బయోగ్రఫీలు తెరకెక్కించడంలో వర్మ శైలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరి రాజకీయంగా ఎంతో పేరెన్నిక కన్న కొండా మురళి జీవితం ఆధారంగా తెరకెక్కించిన కొండా ఎలా ఉందో చూద్దామా?
కథ:
వరంగల్ బ్యాక్ డ్రాప్ లో సెట్ అయిన కథ ఇది. అసలు కొండా మురళి ఎవరు తన నేపధ్యమేంటి? స్వతహాగా దూకుడు స్వభావం కలిగిన కొండా మురళి పేదల పక్షాన ఎలా నిలిచాడు? వరంగల్ లో బలహీన వర్గాల అభ్యున్నతి కొరకు కొండా మురళి, అతని భార్య సురేఖ ఎలా కష్టపడ్డారు? అన్నది చిత్ర కథాంశం.
నటీనటులు:
త్రిగున్ ఏ, కొండా మురళి పాత్రలో సరిగ్గా సరిపోయాడు. తన మ్యానరిజమ్స్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ పెర్ఫెక్ట్ గా కుదిరాయి. సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ లో తన ఇంటెన్స్ నటనతో మెప్పించాడు త్రిగున్ ఏ.
హీరోయిన్ ఇరా మోర్ కొన్ని కీలకమైన సన్నివేశాల్లో తన నటనతో సర్ప్రైజ్ చేస్తుంది. గతంలో గ్లామరస్ నటనతోనే మెప్పించిన మోర్, ఈసారి నటనకు ప్రాధాన్యమున్న పాత్రలో కూడా ఇంప్రెస్ చేస్తుంది. కమెడియన్ పృథ్వీ ఈ చిత్రంలో నెగటివ్ పాత్రలో ఓకే అనిపిస్తాడు. అలాగే ఎల్బీ శ్రీరామ్, తులసి వంటి వారు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేసారు.
సాంకేతిక నిపుణులు:
బయోగ్రఫీలు తెరకెక్కించడంలో వర్మ నేర్పు గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన పనిలేదు. మరోసారి కొండాతో అది నిరూపించాడు వర్మ. 90లలో జరిగిన యదార్ధ సంఘటనల ఆధారంగా కథ చెప్పడానికి ప్రయత్నించాడు.
డిఎస్ఆర్ బాలాజీ తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో మెప్పించే ప్రయత్నం చేసాడు. మనీష్ ఠాకూర్ రన్ టైమ్ ను పెర్ఫెక్ట్ గా ఉంచడంలో విజయం సాధించాడు. మల్హర్ భట్ జోషి సినిమాటోగ్రఫీ వర్క్ ఆకట్టుకుంటుంది. లిమిటెడ్ బడ్జెట్ లో తెరకెక్కించిన ఈ చిత్ర నిర్మాణ విలువలు ఓకే.
పాజిటివ్ పాయింట్స్:
- పెర్ఫార్మన్స్ లు
- వర్మ సహజ శైలి
నెగటివ్ పాయింట్స్:
- వర్మ రొటీన్ టెంప్లేట్ లోనే మొత్తం సాగడం
- కమర్షియల్ విలువలు లేకపోవడం
చివరిగా:
వరంగల్ కు చెందిన కొండా మురళి, సురేఖ దంపతుల జీవితానికి సంబంధించిన కథ కొండా. వర్మ సహజసిద్ధంగా ఈ చిత్రాన్ని తీయడానికి ప్రయత్నించాడు. అయితే కమర్షియల్ విలువలు లేకపోవడం వంటివి మైనస్ గా నిలుస్తాయి.
తెలుగు బులెటిన్ రేటింగ్: 2/5