Switch to English

తూర్పుగోదారి జిల్లాలో ‘అగ్గి’.! అప్పుడూ, ఇప్పుడూ అదే రాజకీయం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,470FansLike
57,764FollowersFollow

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా చాలా చాలా ప్రత్యేకమైనది. ప్రకృతి అందాలకు నెలవు. గౌరవ మర్యాదలకు కేరాఫ్ అడ్రస్. ప్రశాంతమైన జిల్లా.. రాజకీయ చైతన్యం ఎక్కువ. వ్యాపార కార్యకలాపాలకూ కేరాఫ్ అడ్రస్. అలాంటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాపై ఎప్పుడూ ‘రాజకీయ కత్తి’ వేలాడుతూనే వుంటుంది.

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా వున్న సమయంలో, తుని రైలు దహనం ఘటన చోటు చేసుకుంది. అప్పట్లో కాపు ఉద్యమం సెగ రైలుకి అంటుకుందనే ప్రచారం జరిగింది. కానీ, నిజానికి అసలు సెగ అది కాదు. రాజకీయ సెగ రైలుని తగలబెట్టింది.

‘టీడీపీనే ఆ రైలుని తగలబెట్టింది..’ అని అప్పటి ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ‘కాదు కాదు, వైసీపీనే ఈ దుర్మార్గానికి ఒడిగట్టింది..’ అంటూ అప్పటి అధికార పక్షం టీడీపీ ఎదురుదాడికి దిగింది. ఇంతకీ, రైలు తగలబడటానికి తెరవెనుకాల రాజకీయ మంత్రాంగం నడిపిందెవరన్నది మాత్రం ఇప్పటికీ తేలలేదు.

ఆనాటి ఆ కాపు ఉద్యమం అనూహ్యంగా ఆ తర్వాత చల్లారిపోయింది. కాపు యువత లాఠీ దెబ్బల్ని తిన్నారుగానీ, ఆ ఉద్యమం విజయ తీరాలకు చేరలేకపోయింది. ఇప్పుడు మళ్ళీ అదే తూర్పుగోదావరి జిల్లా నుంచి వేరుపడ్డ కోనసీమ జిల్లాలో అగ్గి రాజుకుంది.

మంత్రి విశ్వరూప్, అదికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే సతీష్ ఇళ్ళు నిరసనకారుల మంటల్లో తగలబడిపోయాయి. కోనసీమ ప్రాంతాన్ని జిల్లాగా ఏర్పాటు చేసిన వైఎస్ జగన్ ప్రభుత్వం, ఆ జిల్లా పేరుని కొనసీమగా వుంచకుండా, అంబేద్కర్ పేరు పెట్టడమేంటన్నది నిరసనకారుల ఆందోళనకు కారణం.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదని ఎక్కడా ఇలాంటి ఘటనలు జరగలేదు. రాజధాని లేదనే కోణంలోనూ ఇంత తీవ్రస్థాయిలో ఆందోళనలు జరగలేదు. కేవలం జిల్లా పేరు విషయంలో ఇంత రచ్చ జరగడమా.? అసలు కారణం అది కాదు. తెరవెనుకాల ఏదో పెద్ద కథ వుంది. తూర్పుగోదావరి జిల్లాలోనే రెండు ఘటనలు.. తీవ్రమైన ఘటనలు ఒకటి చంద్రబాబు హయాంలో ఒకటి వైఎస్ జగన్ హయాంలో జరిగాయంటే.. కాస్త లోతైన చర్చే జరగాలి ఈ ఘటనలపై.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

Jithender Reddy: ‘జితేందర్ రెడ్డి’ నుంచి మంగ్లీ పాట.. “లచ్చిమక్క” విడుదల

Jithender Reddy: బాహుబలి, మిర్చి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె హీరోగా నటించిన సినిమా ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy). విరించి వర్మ...

Chiranjeevi: CCTలో 100వసారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ.. అభినందించిన చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 26ఏళ్ల క్రితం (1998 అక్టోబర్ 2) ప్రారంభించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో నేడు అద్భుతమే జరిగింది. ‘రక్తదానం చేయండి.. ప్రజల ప్రాణాలు...

Nara Rohit: నారా రోహిత్ @20 ‘సుందరకాండ’.. ఫస్ట్ లుక్, రిలీజ్...

Nara Rohit: నారా రోహిత్ (Nara Rohit) హీరోగా నటిస్తున్న 20వ సినిమా ‘సుందరకాండ’. శ్రీరామనవమి పండగ సందర్భంగా చిత్ర బృందం టైటిల్ రివీల్ చేస్తూ...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

బి-ఫామ్స్ అందిస్తూ.. ప్రమాణం చేయించిన పవన్ కళ్యాణ్.!

రాజకీయాల్లో ఇదొక కొత్త ఒరవడి.. అనడం అతిశయోక్తి కాదేమో.! జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఇద్దరు లోక్ సభ అభ్యర్థులకు (తనతో కలుపుకుని) జనసేన అధినేత...

అవినాష్ వర్సెస్ సునీత.! కడపలో వైసీపీ ఖేల్ ఖతం.!

సీబీఐ ఛార్జిషీట్‌లో పేర్కొన్న అంశాల్నే ప్రస్తావిస్తున్నారు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి.! 2019 ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగితే, సీబీఐ విచారణ కోసం...

ఎక్కువ చదివినవి

కమెడియన్‌నే..! పొలిటికల్ కమెడియన్‌ని కాదు.!

సినీ నటుడు, రచయిత ‘జబర్దస్త్’ కమెడియన్ హైపర్ ఆది, పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తరఫున ఎన్నికల ప్రచారంలో బిజీగా వున్న సంగతి తెలిసిందే. నెల రోజులపాటు సినిమా...

Chiranjeevi: “చిరు” సాయం.. పాదచారులకు ఇంటి నుంచి రాగి జావ

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi).. ఈ పేరు తెలుగు సినిమాపై చెరగని సంతకం. సినిమాల్లో తన సమ్మోహన నటనతో అలరిస్తున్న ఆయనే.. నిజజీవితంలో సేవా కార్యక్రమాలతో ప్రజలకు సేవలూ అందిస్తున్నారు....

Rashmika: ‘శ్రీవల్లి 2.0 చూస్తారు’.. పుష్ప 2పై రష్మిక కామెంట్స్ వైరల్

Rashmika: ప్రస్తుతం యావత్ భారత సినీ పరిశ్రమ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా పుష్ప 2 (Pushpa 2). అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సంచలన...

Chiranjeevi: CCTలో 100వసారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ.. అభినందించిన చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 26ఏళ్ల క్రితం (1998 అక్టోబర్ 2) ప్రారంభించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో నేడు అద్భుతమే జరిగింది. ‘రక్తదానం చేయండి.. ప్రజల ప్రాణాలు నిలపండి..’ అని నాడు చిరంజీవి ఇచ్చిన...

KTR : బీఆర్‌ఎస్‌ మళ్లీ టీఆర్‌ఎస్‌ గా… కేటీఆర్ మాట

KTR : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించడానికి కేసీఆర్ ఏర్పాటు చేసిన ఉద్యమ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త భారత రాష్ట్ర సమితిగా...