కొమ్మినేని అరెస్ట్.! రెడ్ బుక్ అంటూనే, పోలీసులపై ప్రశంసలు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

93,490FansLike
57,764FollowersFollow

ఆయనో సీనియర్ జర్నలిస్ట్.. కానీ, రాజకీయ నాయకుడిలా రాజకీయ విమర్శలు చేస్తాడేంటి.? ఇదే ప్రశ్న చాలామందిని వేధిస్తోంది.

సాక్షి జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు మీద, ‘అమరావతి మహిళల్ని వేశ్యలుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు’ అంటూ తుళ్ళూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. కొమ్మినేని నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఇంకో సీనియర్ జర్నలిస్ట్, ‘అమరావతి దేవతల రాజధాని కాదు, వేశ్యలకు కేంద్రం’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇదీ అసలు జరిగిన విషయం.

సీనియర్ జర్నలిస్టుగా, చర్చా కార్యక్రమాన్ని నిర్వహించిన వ్యక్తిగా.. అక్కడికక్కడే, ఆ వ్యాఖ్యల్ని ఖండించాల్సి వుంది కొమ్మినేని శ్రీనివాసరావు. నిజానికి, అలాంటి వ్యాఖ్యలు కృష్ణంరాజు అనే జర్నలిస్టుతో వైసీపీ, సాక్షి మీడియా యాజమాన్యం చేయించాయన్నది ప్రధాన ఆరోపణ అనుకోండి.. అది వేరే సంగతి.

కేసులు నమోదయ్యాయి రాష్ట్ర వ్యాప్తంగా.. ఇదే విషయమ్మీద. నమోదైన కేసుల తీవ్రత నేపథ్యంలో, పోలీసులు హైద్రాబాద్‌లో కొమ్మినేని శ్రీనివాసరావుని అదుపులోకి తీసుకున్నారు.

‘పోలీసులు, చాలా మర్యాదగా ప్రవర్తించారు..’ అంటూ కొమ్మినేని శ్రీనివాసరావు, తన అరెస్టు విషయమై సాక్షి జర్నలిస్టుతో మాట్లాడుతూనే చెప్పారు. అంతలోనే, ‘రెడ్ బుక్ రాజ్యాంగం.. చంద్రబాబుకి నా మీద కక్ష..’ అంటూ పరస్పర విభిన్నమైన వ్యాఖ్యలు చేశారు కొమ్మినేని.

రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లో వుంటే, పోలీసులు అరెస్టు సమయంలో నిందితుల మీద ఒకింత అదుపు కోల్పోయి వ్యవహరించాలి. కానీ, అలా జరగలేదు కదా. పోనీ, చంద్రబాబు కక్ష గట్టారు.. అని కొమ్మినేని చెబుతున్నదే నిజమైనా.. పోలీసులు, కొమ్మినేనితో దురుసుగా ప్రవర్తించాలి.

చాలా అంటే, చాలా చాలా మర్యాదగా పోలీసులు తనతో వ్యవహరిస్తున్నారని సాక్షాత్తూ సాక్షి మీడియాతోనే కొమ్మినేని చెప్పారంటే, ప్రభుత్వం సున్నితమైన వ్యవహారాన్ని ఇంకెంత సున్నితంగా డీల్ చేస్తుందో అర్థం చేసుకోవచ్చు.

అరెస్టు అనంతరం కొమ్మినేని శ్రీనివాసరావుని కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సి వుంటుంది. కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది వేరే చర్చ. ఈలోగా వైసీపీ శ్రేణులు, పాతివ్రత్యం ప్రదర్శిస్తున్నాయి సోషల్ మీడియా వేదికగా. వైసీపీ హయాంలో అరెస్టులు ఎంత ఘోరంగా జరిగాయో తెలిసీ, ఇప్పుడు నీతులు చెబుతున్నారు వైసీపీ నేతలు.

అరెస్టు విషయంలో పోలీసులపై ‘మర్యాద పూర్వక’ వ్యాఖ్యలు చేసిన కొమ్మినేని, ముఖ్యమంత్రి చంద్రబాబు మీద రాజకీయ విమర్శలు చేస్తున్నారంటే, కొమ్మినేని అనే వ్యక్తి జర్నలిస్టులా కాకుండా, వైసీపీ నాయకుడిగా మాట్లాడుతున్నారనే కదా అర్థం.?

సినిమా

The Odyssey: ఐమ్యాక్స్ పాప్ కార్న్ బకెట్ చూశారా..? హాట్ కేకుల్లా...

The Odyssey: సినిమా చూసే విధానమే కాదు.. తీసే విధానమూ మారిపోయింది. ఎన్నో ఫార్మాట్స్, కొత్త కొత్త టెక్నిక్స్ తో సినిమాలు తెరకెక్కుతున్నాయి. అటువంటి అద్భుతమైన...

స్కిట్‌పై భావోద్వేగానికి గురైన ఇంద్రజ.. “పిలిచి మరీ అవమానించాలా?”

సీనియర్ నటి ఇంద్రజ ప్రముఖ టీవీ కామెడీ షోలకు జడ్జిగా ప్రేక్షకులకు ఎంతో చేరువయ్యారు. ముఖ్యంగా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాల్లో ఆమె తన...

ఇన్‌సైడ్ స్టోరీ: జూనియర్ ఎన్టీయార్ పొలిటికల్ ఎంట్రీ పై అనవసర రచ్చ!

జూనియర్ ఎన్టీయార్ రాజకీయాల్లోకి వస్తాడా.? లేదా.? ఇదేమీ కొత్త విషయం కాదు. ఎప్పటినుంచో జరుగుతున్న చర్చే. చర్చ కాదు రచ్చ. 2‌‌024 ఎన్నికల సమయంలో కూడా...

RAW NTRపై స్పష్టత.. అధికారిక ప్రకటన విడుదల చేసిన ఎన్టీఆర్ కార్యాలయం

RAW NTR పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఒక సంస్థపై ఎన్టీఆర్ కార్యాలయం కీలక ప్రకటన విడుదల చేసింది. ఆ సంస్థకు నటుడు ఎన్టీఆర్ లేదా ఆయన...

‘నాగబంధం’లో నభా నటేష్ నటనకు ప్రశంసల వెల్లువ

హీరోయిన్ నభా నటేష్ ప్రధాన పాత్రలో నటించిన 'నాగబంధం' సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతూ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందుతోంది. ఈ చిత్రంలో నభా నటేష్...

రాజకీయం

లోకేష్ ఆకస్మిక తనిఖీ.. ప్రభుత్వ పాఠశాలలకు 4 స్టార్ లక్ష్యం!

ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కడప జిల్లా పర్యటనలో భాగంగా ప్రొద్దుటూరు మండలం దొరసానిపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో మౌలిక సదుపాయాలు,...

జనసేనలో పవన్ కళ్యాణ్ వర్గమే ఒక్కటి.. కార్యకర్తలకు అండగా ఉంటాం: నాదెండ్ల మనోహర్

జనసేన పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని, క్షేత్రస్థాయిలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్,...

ఆక్వా రైతులపై ఎవరి హయాంలో భారం..? గణాంకాలతో జగన్‌కు కూటమి కౌంటర్

ఆంధ్రప్రదేశ్‌లో ఆక్వా రంగంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కూటమి ప్రభుత్వం గణాంకాలతో సమాధానం ఇచ్చింది. గత ప్రభుత్వ హయాంలో ఆక్వా రంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొందని, ప్రస్తుతం...

భోగాపురం ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఇక అంతర్జాతీయ విమానాలకు దారి!

ఉత్తరాంధ్ర ప్రజలు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి కీలకమైన ముందడుగు పడింది. కేంద్ర హోంశాఖ భోగాపురం ఎయిర్‌పోర్టును ఇమిగ్రేషన్, విదేశీయుల చట్టం-2025 పరిధిలోకి చేర్చుతూ అధికారిక గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది....

ఇదేం శవ రాజకీయం.? ముద్రగడ చుట్టూ ఇంకా అదే కుట్రలా.?

ముద్రగడ పద్మనాభం.. మాజీ మంత్రి.. కాపు ఉద్యమ నేత. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ముద్రగడ, చికిత్స పొందుతూ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన పార్తీవ దేహాన్ని, స్వగ్రామం కిర్లంపూడికి తరలించారు. తండ్రిని కడసారి...

ఎక్కువ చదివినవి

‘లెనిన్’ సక్సెస్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయనున్న అక్కినేని కుటుంబం.. బిగ్ స్టార్‌తో థ్యాంక్స్ మీట్?

అఖిల్ అక్కినేని హీరోగా తెరకెక్కిన 'లెనిన్' సినిమాకు తొలి రోజు నుంచే మంచి స్పందన లభిస్తోంది. బాక్సాఫీస్ వద్ద కూడా సినిమా ఆశాజనకంగా ప్రారంభం కావడంతో అక్కినేని కుటుంబంలో ఆనందం నెలకొన్నట్లు కనిపిస్తోంది....

సీదిరి అప్పలరాజు కుమారుడి రోడ్డు ప్రమాదం కేసు.. సీసీటీవీతో వెలుగులోకి కొత్త నిజాలు?

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు అరవ్‌కు సంబంధించిన రోడ్డు ప్రమాదం కేసు కొత్త మలుపు తిరిగింది. ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి రావడంతో ఇప్పటివరకు నమోదైన కేసుపై పలు ప్రశ్నలు...

స్కిట్‌పై భావోద్వేగానికి గురైన ఇంద్రజ.. “పిలిచి మరీ అవమానించాలా?”

సీనియర్ నటి ఇంద్రజ ప్రముఖ టీవీ కామెడీ షోలకు జడ్జిగా ప్రేక్షకులకు ఎంతో చేరువయ్యారు. ముఖ్యంగా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాల్లో ఆమె తన సౌమ్య స్వభావంతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు....

ఇన్‌సైడ్ స్టోరీ: జూనియర్ ఎన్టీయార్ పొలిటికల్ ఎంట్రీ పై అనవసర రచ్చ!

జూనియర్ ఎన్టీయార్ రాజకీయాల్లోకి వస్తాడా.? లేదా.? ఇదేమీ కొత్త విషయం కాదు. ఎప్పటినుంచో జరుగుతున్న చర్చే. చర్చ కాదు రచ్చ. 2‌‌024 ఎన్నికల సమయంలో కూడా ఈ రగడ చెలరేగింది. జూనియర్ ఎన్టీయార్...

పవన్ కళ్యాణ్‌ని అరెస్ట్ చేయాల్సిందే.! సుగాలి ప్రీతికి న్యాయం జరగాలని నిలబడి నేరం చేశాడు మరి.!

ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జన సేన పార్టీ అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్‌ని అరెస్ట్ చేయాలని సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతీ దేవి ఆరోపిస్తున్నారు. ఈ మేరకు పోలీసులకు...