Switch to English

మీడియా కథనాలపై కోమటిరెడ్డి భావోద్వేగం

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,172FansLike
57,764FollowersFollow

ఒక టీవీ చానెల్‌లో తనపై, మహిళా ఐఏఎస్ అధికారిపై వచ్చిన కథనాలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర భావోద్వేగంతో స్పందించారు. వ్యక్తిగత జీవితాన్ని, కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ప్రచారం తనను తీవ్రంగా బాధించిందని ఆయన అన్నారు. తనకు ఉన్న ఒక్క కొడుకుని కోల్పోయిన బాధ ఇప్పటికీ తీరలేదని, ఆ కొడుకు పేరు మీద ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించానని, ఇప్పటికీ అవి కొనసాగుతున్నాయని చెప్పారు.

నన్ను ఏమైనా అనండి, నాపై ఏదైనా రాయండి కానీ మహిళా అధికారులపై ఇష్టమొచ్చినట్లు రాసి వారి వ్యక్తిగత జీవితాలను ఇబ్బంది పెట్టడం చాలా బాధాకరమని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. ఐఏఎస్ అధికారులను బదిలీ చేసే అధికారం పూర్తిగా ముఖ్యమంత్రికే ఉంటుందని స్పష్టం చేశారు. ఎంతో కష్టపడితే కానీ ఐఏఎస్ అధికారులు కాలేరని, వారి ప్రతిష్ఠను దెబ్బతీసేలా రాయడం సరికాదని ఆయన అన్నారు.

ఈ వ్యవహారంలో నిజానిజాలు త్వరలోనే వెలుగులోకి వస్తాయని మంత్రి చెప్పారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాలని ముఖ్యమంత్రిని కోరుతున్నానని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం కోసం మంత్రి పదవినే త్యాగం చేసిన సందర్భాలు తన జీవితంలో ఉన్నాయని, అద్దె ఇంట్లో ఉంటూ ప్రజలకు సేవ చేశానని గుర్తు చేశారు. తన కొడుకుని కోల్పోయిన రోజే తాను సగం చనిపోయినట్టేనని భావోద్వేగంగా చెప్పారు.

దయచేసి నన్ను, నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టవద్దని మీడియాను కోరిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అయినా ఏది పడితే అదే రాస్తే పై ఉన్న దేవుడు అన్నీ చూసుకుంటాడని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

సినిమా

విజయ్–రష్మిక పెళ్లి వివరాలు లీక్? కుటుంబాలకు తలనొప్పి

హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్న వివాహ వేడుకలకు సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో లీక్ అవుతుండటం కలకలం రేపుతోంది. పెళ్లి తేదీ, వేదిక,...

Dil Raju: దిల్ రాజు కామెంట్స్ వైరల్..! ఎవరిని ఉద్దేశించి ఆ...

Dil Raju: ‘నేటి రోజుల్లో నిర్మాతకు విలువలేద’ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీశాయి. ఎవరిని ఉద్దేశించి ఆయన...

మే 1న పిల్లల కోసం ‘సమ్మర్ హాలిడేస్’.. థియేటర్లలోకి రాబోతున్న కొత్త...

కథా బలమున్న చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ధీరజ్ మొగిలినేని, తన బ్యానర్ ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై కొత్త చిత్రాన్ని...

విజయ్–రష్మిక పెళ్లి తేదీ ఖరారు.. ఫిబ్రవరి 26 ముహూర్తానికి ప్రత్యేకత

టాలీవుడ్‌లో మోస్ట్ రూమర్డ్ కపుల్‌గా పేరొందిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహం త్వరలో జరగనున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఫిబ్రవరి 26న...

హే బల్‌వంత్‌పై భారీ అంచనాలు.. సుహాస్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ అవుతుందన్న...

బన్నీవాస్, వంశీ నందిపాటి సక్సెస్ కాంబినేషన్ నుంచి వస్తున్న ఫుల్‌లెంగ్త్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్ ‘హే బల్‌వంత్’ ఫిబ్రవరి 20న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది....

రాజకీయం

హిందూపురం బాలిక కేసులో కీలక మలుపు: ఇన్‌స్టాగ్రామ్ ట్రాప్, ఇద్దరు నిందితులు అరెస్ట్

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలంలో మూడు రోజుల క్రితం బయటపడిన మైనర్ బాలిక కిడ్నాప్, అత్యాచారం కేసులో కీలక వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు గోవర్ధన్...

Breaking News: బొత్సపై హెరిటేజ్ లీగల్ నోటీసు..

అమరావతి: తిరుమల లడ్డు నెయ్యి వ్యవహారంలో తన ప్రతిష్టకు భంగం కలిగించేలా తప్పుడు ఆరోపణలు చేశారంటూ హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్...  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు...

నారా లోకేష్ మీద దుష్ప్రచారం.! పరువు పోగొట్టుకున్న వైఎస్సార్సీపీ.!

కోటి రూపాయల ప్రజాధనాన్ని నారా లోకేష్ దుర్వినియోగం చేసిందంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన దుష్ప్రచారం, ఆ పార్టీ పరువుని బజార్న పడేసింది. ఇటీవల కొలంబోలో ఇండియా - పాకిస్తాన్ జట్ల మధ్య...

ఫలితాల దిశగా కూటమి ప్రభుత్వ సమర్ధ నీటి నిర్వహణ కార్యక్రమాలు

కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సమర్థ నీటి నిర్వహణ కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా మంచి ఫలితాలు ఇస్తున్నాయి. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాల్లో కీలకమైన నీటి భద్రత దిశగా రాయలసీమలోని అన్నమయ్య జిల్లా గట్టి...

కూటమిలో స్నేహ బంధాలు బలపడుతున్నాయి: లోకేష్ ఆత్మీయ విందు సమావేశాలు

కూటమి పార్టీల మధ్య సమన్వయం, స్నేహ బంధాలు మరింత బలపడేలా విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పార్లమెంటు సెగ్మెంట్ల వారీగా ప్రజాప్రతినిధులతో ఆత్మీయ విందు సమావేశాలను కొనసాగిస్తున్నారు. మంగళవారం రాత్రి...

ఎక్కువ చదివినవి

తిరుమల లడ్డూ కల్తీ ఆరోపణలపై విశాఖలో సాధు పరిషత్ ఆందోళన

ఈరోజు విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ ఆధ్వర్యంలో తిరుమల దేవదేవుని లడ్డూలో కల్తీ జరిగిందన్న ఆరోపణలపై నిరసన కార్యక్రమం నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానాలు తయారు చేసే ప్రసాదమైన లడ్డూ పవిత్రతపై అనుమానాలు...

విజయాలకు బాధ్యత తోడైతే….

అల్లు అర్జున్ — ఈ రోజు ఈ పేరు ఒక సెన్సేషన్. మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఈ పేరు ఒక బ్రాండ్ అయ్యింది. కానీ ఇటీవలి కాలంలో ఈ పేరు సినిమాల...

బడ్జెట్‌తో స్వర్ణాంధ్ర 2047 దిశగా 360° అభివృద్ధికి బలమైన పునాది వేసాం: పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్‌ను స్వర్ణాంధ్ర 2047 లక్ష్యానికి తీసుకెళ్లే దిశగా 2026–27 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్రానికి 360 డిగ్రీల సమగ్ర అభివృద్ధికి బలమైన పునాది వేస్తుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

కర్మ రుణం అంటే ఏమిటి? మీ కష్టాలకు ఇదే కారణమా? పరిష్కార మార్గాలు ఇవే

మీ జీవితంలో పదే పదే నష్టాలు ఎదురవుతున్నాయా, చేపట్టిన పనుల్లో అనుకోని జాప్యాలు జరుగుతున్నాయా, సంబంధాల్లో ఒత్తిళ్లు పెరుగుతున్నాయా లేదా ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయా అంటే దీనిని కేవలం దురదృష్టంగా పక్కన పెట్టకూడదని...

ఇంట్లో విందుతో బంధం బలపడింది

విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పార్లమెంటు నియోజకవర్గాల వారీగా కూటమి ప్రజాప్రతినిధులను కుటుంబ సభ్యులతో కలిసి తన ఇంటికి ఆహ్వానించి ఆత్మీయంగా కలుసుకునే సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. ఉండవల్లి...