Switch to English

ప్రతిపక్ష హోదా అడగడం కన్నా జగన్.. అసెంబ్లీకి రావాలి: తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి హితవు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,197FansLike
57,764FollowersFollow

అమరావతి: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుతో తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుక్రవారం కీలకంగా భేటీ అయ్యారు. దాదాపు గంటన్నర పాటు సాగిన ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాల అభివృద్ధి, పరస్పర సహకారం, రాజకీయ పరిణామాలు వంటి అనేక అంశాలు చర్చించుకున్నట్లు కోమటిరెడ్డి మీడియాకు వెల్లడించారు.

కోమటిరెడ్డి మాట్లాడుతూ, చంద్రబాబు పాలన ఎప్పుడూ అభివృద్ధి దిశలోనే సాగిందని అభినందించారు. తనను ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినందుకు చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారని, అరకు కాఫీతో పాటు వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని అందజేసి ఆశీర్వదించారని చెప్పారు. “నాకు చంద్రబాబుతో 30 ఏళ్ల పరిచయం ఉంది. ఆయన విజన్‌ పట్ల నాకు ఎప్పటి నుంచో గౌరవం ఉంది. హైదరాబాద్‌ హైటెక్‌సిటీ నేడు ప్రపంచ స్థాయి ఐటీ హబ్‌గా నిలవడంలో చంద్రబాబు విజన్‌ కారణమనే విషయం అందరికీ తెలిసిందే” అని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ సమ్మిట్ కి రావాలి అని చంద్రబాబు ని కోరాము. సమ్మిట్ కు రావడం పట్ల చంద్రబాబు సానుకూలంగా స్పందించారు.

మన రాష్ట్రాలకు పరస్పర ప్రయోజనాలు చేకూరేలా బందరు పోర్ట్ ప్రాజెక్ట్‌ వంటి విషయాలపై కూడా చర్చించామని వెల్లడించారు. తెలంగాణలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ఏర్పాటు జరుగుతోందని, ఇలాంటి కార్యక్రమాలకు రెండు రాష్ట్రాల అనుభవాలు ఉపయోగపడతాయని తెలిపారు.

చంద్రబాబు అరెస్ట్‌ను మరోసారి తీవ్రంగా ఖండించిన కోమటిరెడ్డి, ఆ సమయంలో KTR చేసిన వ్యాఖ్యలు సరైనవి కావని వ్యాఖ్యానించారు. “కాళేశ్వరంపై వచ్చిన అవినీతి ఆరోపణలకు సమాధానం చెప్పలేకపోయారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీే బలంగా ఉంటుంది. ఇక ప్రజలు గత ప్రభుత్వాన్ని మరిచిపోవాలి” అని వ్యాఖ్యానించారు.

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్ విషయంలో కూడా కోమటిరెడ్డి స్పష్టమైన అభిప్రాయం వెల్లడించారు. “ప్రతిపక్ష హోదా కంటే ప్రజా సమస్యల కోసం అసెంబ్లీకి రావడం ముఖ్యము. హోదా లేకపోతే అసెంబ్లీలోకి రాము అన్న జగన్ వ్యాఖ్య అసంబద్ధం. ప్రజల మధ్య నిలబడాలి, పోరాడాలి” అని ఆయన అన్నారు.

తెలంగాణ లాగా ఆంధ్రప్రదేశ్ కూడా వేగంగా అభివృద్ధి చెందాలని కోరుకున్న కోమటిరెడ్డి, తెలుగు రాష్ట్రాలు కలిసి ముందుకు సాగితే రెండు రాష్ట్రాలకూ ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. భవిష్యత్తు కార్యక్రమాలపై కూడా చంద్రబాబుతో మంచి చర్చ జరిగిందని తెలిపారు.

సినిమా

CHIRANJEEVI: ముంగిట్లో సంక్రాంతి ముగిసింది.. ధియేటర్లో ‘చిరంజీవి’ పండగ ముగియలేదు

CHIRANJEEVI: సంక్రాంతి పండగొచ్చింది.. ప్రజలను ఊళ్ళకు రప్పించింది.. కుటుంబాల్లో ఆనందాలు నింపింది.. సంబరాలు చేసింది..! వారం రోజుల సంతోషాలు, ఆనందాలు పండగ వెళ్ళిపోవడంతో పండగ సంతోషాలు...

మెగాస్టార్ మళ్లీ రికార్డుల మోత… ‘మన శంకర వరప్రసాద్ గారు’తో చిరు...

సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన స్థాయిని నిరూపించుకున్నారు. ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకున్న ఆయన,...

ఎన్టీఆర్‌ పోలికలే కారణమా? నందమూరి కుటుంబంలో జూనియర్ ఎన్టీఆర్‌కి చోటు దక్కిన...

జూనియర్ ఎన్టీఆర్… తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకమైన పేరు. నటన, డైలాగ్ డెలివరీ, డాన్స్, స్క్రీన్ ప్రెజెన్స్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు. అయితే...

మీనాక్షి చౌదరి మనసులో ఉన్నది ఇతడేనా? ఫస్ట్ క్రష్‌, పెళ్లి డ్రీమ్‌…...

టాలీవుడ్‌లో వరుస హిట్లతో దూసుకెళ్తున్న హీరోయిన్ మీనాక్షి చౌదరి మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. సినిమాల విజయం ఒకవైపు, వ్యక్తిగత విషయాలపై ఆమె చేసిన వ్యాఖ్యలు...

సంక్రాంతి బాక్సాఫీస్ హీట్… జనవరి 17న ఎవరి దూకుడు ఎంత?

సంక్రాంతి సీజన్‌లో విడుదలైన సినిమాల మధ్య బాక్సాఫీస్ పోరు రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతోంది. జనవరి 17 నాటికి థియేటర్లలో సందడి చేస్తున్న సినిమాల కలెక్షన్లు ట్రేడ్...

రాజకీయం

కోటరీ కుంపటి.! వైసీపీకి విసారెడ్డి ఉచిత సలహా ఉపయోగపడేనా.?

వెనిజులా అంశాన్ని తీసుకొచ్చి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఉచిత సలహా ఇచ్చారు వైసీపీ మాజీ నేత, మాజీ ఎంపీ విజయ సాయి రెడ్డి. దాంతో, సహజంగానే వైసీపీలో కొంతమందికి బాగా కాలింది. ఆ...

“YSR పేరుతో నన్ను టార్గెట్ చేస్తున్నారు”: రాధాకృష్ణ వ్యాఖ్యలపై భట్టి విక్రమార్క ఫైర్

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మీడియా – ప్రభుత్వం మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రముఖ జర్నలిస్టు, ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ రాసిన కాలమ్‌పై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఘాటుగా స్పందించడంతో ఈ...

రాజకీయ వేడి రాజుకుంది.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఘాటు విమర్శలు

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తాజాగా జరిగిన సభలో సీఎం చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ,...

టీడీపీని ముంచింది TRS – సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ పతనానికి కాంగ్రెస్ కారణం కాదని, అప్పటి TRS పార్టీ మరియు కేసీఆర్ రాజకీయాలే కారణమని స్పష్టంగా చెప్పారు.  టిడిపి ని  ముంచింది...

చంటి బిడ్డతోనే ట్రాఫిక్ క్లియర్ చేసిన పోలీస్‌… నారా లోకేశ్ ప్రశంసల వెల్లువ

కాకినాడ–సామర్లకోట రహదారిపై జరిగిన ఓ ఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ప్రశంసలు పొందుతోంది. రంగంపేట పోలీస్ స్టేషన్‌కు చెందిన మహిళా కానిస్టేబుల్ చూపిన సేవా మనసును మంత్రి నారా లోకేశ్ ప్రత్యేకంగా ప్రశంసించారు. డ్యూటీలో...

ఎక్కువ చదివినవి

వైసీపీ సంక్రాంతి సంబరాలు… వైఎస్ జగన్ గారు ఎక్కడ?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు తమ తమ నియోజకవర్గాల్లో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రజలతో మమేకమవుతూ పండుగ వాతావరణాన్ని పంచుకోవడం రాజకీయ నాయకుల పరంగా సహజమే. ఈ నేపథ్యంలో...

ఎన్టీవీ క్షమాపణతో వ్యవహారం ముగిసినట్టేనా?

ఎన్టీవీ ఛానల్ ఇటీవల ప్రసారం చేసిన ఒక వార్తా కథనం తీవ్ర దుమారం రేపింది. ఓ మంత్రి, ఐఏఎస్ అధికారులకు సంబంధించిన వివాహేతర బంధాలపై వ్యాఖ్యానించినట్టుగా వచ్చిన ఆ కథనం తీవ్ర అభ్యంతరాలకు...

మాట నిలబెట్టుకున్న సీఎం… ఉద్యోగుల ఖాతాల్లో నగదు

సంక్రాంతి పండుగను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు నిజమైన పండుగలా మార్చింది కూటమి ప్రభుత్వం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు, ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలను ఒకేసారి విడుదల...

బడ్జెట్ బ్రేక్‌తో బ్రేక్ పడిన NBK111?

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ NBK111 ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ఈ సినిమా, అనూహ్యంగా తాత్కాలిక విరామంలోకి వెళ్లినట్లు ఫిల్మ్ నగర్...

ఫిల్మ్‌నగర్‌లో ఎన్టీఆర్ వర్ధంతి.. ఘన నివాళులు, స్మృతుల స్మరణ

విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారకరామారావు 30వ వర్ధంతి సందర్భంగా ఫిల్మ్‌నగర్‌లోని ఆయన విగ్రహం వద్ద ఘనంగా నివాళులర్పించారు. నందమూరి కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై ఎన్టీఆర్‌కు పూలమాలలు...