భారత్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఆస్ట్రేలియాలో ఎదరైన చేదు అనుభవంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. కోహ్లీ బస చేసిన హోటల్ రూమ్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమే ఇందుకు కారణం. కింగ్ కోహ్లీ హోటల్ రూమ్ అని రాసున్న వీడియోను ఇన్ స్టాలో పోస్ట్ చేస్తూ..
‘అభిమానులు తమ ఆరాధ్య క్రికెటర్ ను చూసి ఆనందిస్తారు. ఈ విషయం నాకూ తెలుసు. అయితే.. ఏకంగా నేనుండే రూమ్ వీడియో తీసి పోస్ట్ చేయడమేంటి..? ఇది అభిమానం అనిపించుకోదు. నా గదిలో నాకు ప్రైవసీ లేకపోతే.. ఇంకెక్కడ నాకు స్వేచ్ఛ ఉంటుంది. ఈ వీడియో చూసి షాక్ అయ్యాను. ఇటువంటి అభిమానాన్ని మూర్ఖత్వంతో కూడింది. దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ నేను స్వాగతించను. ఇది నా ప్రైవసీకి కలిగిన భంగం. ఎవరినీ వినోద వస్తువుగా చూడొద్దు. ప్రతిఒక్కరి ప్రైవసీకీ గౌరవం ఇవ్వండి’ అని రాసుకొచ్చాడు. ఈ అంశంపై కోహ్లీ భార్య అనుష్క శెట్టి కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది.
https://www.instagram.com/reel/CkXVWI6g7Ff/?igshid=YmMyMTA2M2Y=