Switch to English

బిగ్‌ క్వశ్చన్‌: కోడెల శివప్రాద్‌ మరణం.. ఎవరిది నేరం.?

టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి, 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌ తొలి అసెంబ్లీ స్పీకర్‌, దివంగత కోడెల శివప్రసాద్‌ జయంతి నేడు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆయనకు ఘన నివాళి అర్పించాయి. ఆయన సేవల్ని గుర్తు చేసుకున్నాయి. ఇదిలా వుంటే, కోడెల శివప్రసాద్‌ బలవన్మరణానికి పాల్పడి నెలలు గడుస్తున్నా ఇప్పటికీ, ఆయన ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో ఇప్పటికీ వెల్లడి కాలేదు. కోడెల శివప్రసాద్‌ మీద ‘దొంగ’ అనే ముద్ర వేసింది వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రభుత్వం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విడిపోయాక, ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు కొన్నాళ్ళు హైద్రాబాద్‌లోనే జరిగాయి. ఆ తర్వాత అమరావతికి అసెంబ్లీ తరలి వెళ్ళే క్రమంలో అసెంబ్లీ ఫర్నిచర్‌ కొంత, అప్పటి స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ ఇంటికి వెళ్ళడమే వివాదానికి కారణం.

అది అప్పటి తన క్యాంప్‌ ఆఫీస్‌కి వెళ్ళింది తప్ప, ఇంటికి కాదంటూ వాదించారు కోడెల శివప్రసాద్‌. ఫర్నిచర్‌ని తీసుకెళ్ళాల్సిందిగా ప్రభుత్వానికి లేఖ రాసినా పట్టించుకోలేదని వాపోయారాయన. ఫర్నిచర్‌ వద్దనుకుంటే, దానికి సంబంధించిన మొత్తాన్ని చెల్లిస్తానని కూడా అన్నారు. అయినాగానీ వివాదం చల్లారలేదు. మరోపక్క, సొంత పార్టీలో కోడెల పట్ల వ్యతిరేకత పెరిగింది. నిజానికి, ఎన్నికలకు ముందే టీడీపీలో కోడెల వ్యతిరేక వర్గం తన సత్తా చాటింది. ఈ క్రమంలోనే ఆయనకు టిక్కెట్‌ ఇవ్వడానికీ తొలుత టీడీపీ అధినేత చంద్రబాబు నిరాకరించారు. కుటుంబ సభ్యులు, కోడెల పేరు చెప్పి అడ్డగోలు వసూళ్ళకు పాల్పడ్డారనే విమర్శల సంగతి సరే సరి. ఇలా కోడెలపై ముప్పేటదాడి జరిగిన మాట వాస్తవం. సొంత పార్టీ నుంచీ, రాజకీయ ప్రత్యర్థుల నుంచీ వెల్లువెత్తిన సవాళ్ళను ఆయన అధిగమించలేకపోయారు. కోడెల మరణం తర్వాత, ఆయన చుట్టూ టీడీపీ ఎంత రాజకీయం చేసిందో, చేస్తోందో చూస్తున్నాం.

ఈ పాపంలో వైసీపీకి కూడా ఎంతో కొంత భాగం వుందన్నది నిర్వివాదాంశం. ‘దొంగ.. దొంగ..’ అంటూ వైసీపీ నేతలు, కోడెలపై చేసిన విమర్శలు ఆయన్ని మానసికంగా కుంగదీశాయి. తన, పర.. అన్న తేడా లేకుండా అందరూ తనను దోషిని చేయడాన్ని కోడెల జీర్ణించుకోలేకపోయారు. అలా ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు. అయితే, స్వతహాగా ‘మొండిఘటం’ అయిన కోడెల ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారన్నది ఇప్పటికీ మిస్టరీనే.

సినిమా

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

కమల్‌తో వ్యవహారంపై క్లారిటీ ఇచ్చింది

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ సుదీర్ఘ కాలం పాటు నటి గౌతమితో సహజీవనం సాగించిన విషయం తెల్సిందే. ఆమెతో కొన్ని కారణాల వల్ల విడిపోయిన కమల్‌...

ముందు ఎఫ్ 3.. ఆ తర్వాతే ఏదైనా

దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పుడు టాప్ లీగ్ లోకి చేరిపోయాడు. చేసినవి 5 సినిమాలు అయితే ఐదు కూడా సూపర్ డూపర్ హిట్లు అయ్యాయి. ఒకదాన్ని...

ఈ హీరోయిన్ కు కూడా లైంగిక వేధింపులు తప్పలేదట

లైంగిక వేధింపులు అనేది అన్ని చోట్లా ఉంది. కాకపోతే సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య ఈ విషయం ఎక్కువగా చర్చకు వస్తోంది. ఇదివరకు ఈ విషయంపై...

సాయి తేజ్ ‘నో పెళ్లి’ కాన్సెప్ట్ కి రానా, వరుణ్ తేజ్...

దాదాపు రెండున్నర నెల తర్వాత టాలీవుడ్ లో మళ్ళీ ప్రమోషన్స్ హడావిడి స్లోగా మొదలవుతోంది. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న 'సోలో...

రాజకీయం

సగటు భక్తుడి ఆవేదన: వెంకన్న జోలికి వెళ్ళొద్దు ప్లీజ్‌.!

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా టీటీడీ పాలక మండలి అనగానే రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా మారిపోయిందన్నది ఓపెన్‌ సీక్రెట్‌. ఇదే విమర్శ గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో విన్నాం.. ఆ తర్వాత...

టీటీడీ వివాదంపై జగన్ కి విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సూచనలు.!

టీటీడీ భక్తులు ఇచ్చిన భూములు విక్రయించాలి అని నోటీసులు జారీ చేసినప్పటి నుంచీ ఆ విషయంపై నానా రచ్చ నడుస్తోంది. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తున్నారు. కానీ టీటీడీ...

జనసేనానీ.. ఈ డోస్‌ సరిపోదు సుమీ.!

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఈ మధ్య సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా వుంటున్నారు. అయితే, ఎక్కువగా రీ-ట్వీట్లు చేస్తున్నారనే విమర్శలూ పవన్‌ కళ్యాణ్‌ మీద లేకపోలేదనుకోండి.. అది వేరే విషయం. బీజేపీ...

శ్రీశైలంలో కోట్లు స్వాహా చేసిన అక్రమార్కులు

అవినీతి అనేది అక్కడ ఇక్కడ అని లేకుండా ఎక్కడ పడితే అక్కడే జరుగుతుంది అనేందుకు మరో ప్రత్యేక్ష ఉదాహరణగా శ్రీశైలం నిలిచింది. ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన అక్కడ కోట్లాది రూపాయల...

జగన్ కీలక నిర్ణయం.. సజ్జలకు పార్టీ బాధ్యతలు?

పార్టీ బాధ్యతల విషయంలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారా? అటు సీఎంగా పాలనా వ్యవహారాలు, ఇటు అధినేతగా పార్టీ కార్యకలాపాలు ఒకేసారి చూడటం కాస్త...

ఎక్కువ చదివినవి

పురోహితుల ‘కరోనా’ కష్టాలపై గళం విప్పిన పవన్‌ కళ్యాణ్‌

కరోనా వైరస్‌ - లాక్‌ డౌన్‌ కారణంగా పౌరోహిత్యంపై తీవ్ర ప్రభావమే పడింది. పౌరోహిత్యం మీదనే ఆధారపడ్డ బ్రాహ్మణ కుటుంబాలు గత రెండు మూడు నెలలుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ‘మమ్మల్ని ప్రభుత్వమే...

రెండోసారి వైరస్.. ప్రమాదకరం కాదా?

ప్రపంచానికి పెను సవాల్ గా పరిణమించిన కరోనా విజృంభణ ఏ మాత్రం తగ్గలేదు. దీని ఉనికి మొదలై ఇప్పటికి ఆరు నెలలు గడిచినా.. ఈ మహమ్మారిని అదుపు చేయడానికి మానవాళి ఇంకా ప్రయత్నాలు...

ఫ్లాష్ న్యూస్: లైవ్ ఇంటర్వ్యూలో భూకంపానికి బెదరని ప్రధాని.!

మనం మాట్లాడుతున్నప్పడు ఏదైనా శబ్దం వస్తేనే విసుగనిపిస్తుంది.. భారీ శబ్దమైతే ఉలిక్కిపాటుకు గురవుతాం. కానీ.. ఇలాంటి వాటిని పెద్దగా పట్టించుకోను అని నిరూపిస్తున్నారు న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్. వెల్లింగ్టన్ లో స్థానికంగా ఓ...

చైనా చిచ్చు.. భారత్ పై నేపాల్ ఓవరాక్షన్

కరోనా వైరస్ కు జన్మస్థానమైన చైనా కంటే, లక్షలాది కేసులతో అతలాకుతలమైన ఇటలీ కంటే భారత్ వల్లే తమకు ముప్పు ఎక్కువగా ఉందంటూ నేపాల్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. చైనా, ఇటలీ నుంచి...

రీమేక్‌ అప్‌డేట్‌ మెగాస్టార్‌ మూవీలో విజయశాంతి

మలయాళ సూపర్‌ హిట్‌ మూవీ లూసీఫర్‌ను తెలుగులో మెగాస్టార్‌ చిరంజీవి రీమేక్‌ చేయబోతున్నట్లుగా చాలా బలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ విషయాన్ని కొట్టి వేయక పోవడంతో నిజమే అయ్యి ఉంటుందని...