Switch to English

ఏపీ వైసీపీ నేతలకు కోవిడ్ వస్తే, హైద్రాబాద్ పరిగెడుతున్నారెందుకు.!

91,427FansLike
56,276FollowersFollow

అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్ళలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉద్ధరించేశామని వైసీపీ చెప్పుకుంటోంది. కరోనా నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైద్రాబాద్‌కే పరిమితమైపోయారన్న వైసీపీ విమర్శల సంగతి సరే సరి. మరి, వైసీపీ నేతలు ఏం చేస్తున్నారు.? కరోనా సోకితే వెంటనే హైద్రాబాద్‌కి ఎందుకు పరిగెడుతున్నారు.?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగంపై బోల్డంత ఖర్చు చేస్తున్నామని చెప్పుకుంటోంది. ఆసుపత్రుల రూపు రేఖలు మార్చేశామంటోంది. ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యుల లభ్యతను పెంచేశామంటోంది. ఆరోగ్యశ్రీ అంటోంది.. ఇంకోటేదో హడావిడి చేస్తోంది. అయినాగానీ, వైసీపీ నేతలకే ఆంధ్రప్రదేశ్‌లో అందుతున్న వైద్యంపై నమ్మకం వుండడంలేదు.

తాజాగా మంత్రి కొడాలి నానికి కోవిడ్ సోకింది. వెంటనే ఆయన హైద్రాబాద్‌కి పయనమయ్యారు.. హైద్రాబాద్‌లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో ఆయన చేరిపోయారు. ‘కోవిడ్ పట్ల భయపడాల్సిన పనిలేదు.. ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ సర్వసన్నద్ధంగా వుంది.. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొంటాం..’ అంటూ ఏపీ ప్రభుత్వం ఘంటాపథంగా చెబుతున్న వేళ, సొంత పార్టీ నేతలే.. వైసీపీ ప్రభుత్వం చెబుతున్న మాటల్ని విశ్వసించలేని పరిస్థితి ఎందుకు వస్తోందో ఏమో.!

అనారోగ్యం సంభవించినప్పుడు ఎవరైనా ఎక్కడైనా వైద్య చికిత్స పొందవచ్చుగాక. ఇందుకు వైసీపీ నేతలేమీ మినహాయింపు కాదు. ప్రాణమ్మీదకు వస్తే ఎవరైనా ఒకటే. ప్రాణం కంటే విలువైనది ఏదీ లేదు. ఈ విషయంలో వైసీపీ నేతల్ని విమర్శించడానికేమీ లేదు.. వారెక్కడ వైద్య చికిత్స పొందినాసరే.

కానీ, వైసీపీ నేతలు.. రాష్ట్రంలో వైద్య సౌకర్యాలపై చేస్తున్న ప్రచారానికీ, అక్కడ వాస్తవ పరిస్థితులకీ పొందన వుండడంలేదన్నదే అసలు చర్చ. పబ్లిసిటీ పీక్స్‌లో వుందంటే, మేటర్ పరమ వీక్‌గా వుందనే అర్థం కదా.? అని వైసీపీ నేతలు కరోనా సోకగానే హైద్రాబాద్ పయనమవుతున్న తీరు చూసి నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

కీలక బాధ్యతల్లో వున్నవారే ఇలా చేస్తే, సాధారణ ప్రజానీకానికి దిక్కెవరు.? రాష్ట్రంలో వైద్య సౌకర్యాలపై ప్రజలకు భరోసా కల్పించేదెవరు.?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

బిగ్‌ బాస్ 6 అభినయ శ్రీ గురించి ఆసక్తికర విషయాలు

తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 లో తొమ్మిదవ కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన అభినయ శ్రీ కనీసం ఐదారు వారాలు అయినా ఉంటుందని చాలా...

‘నవాబ్’ మూవీ కోసం 12 ఎకరాల్లో డంప్ యార్డ్ సెట్

ముఖేష్ గుప్తా, అనన్య నాగళ్ల హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా నవాబ్. ఈ చిత్రంలో రామ రాజ్, మురళీ శర్మ, రాహుల్ దేవ్, శ్రవణ్ రాఘవేంద్ర,...

‘లెహరాయి’ నుండి “బేబీ ఒసేయ్ బేబీ” పాట విడుదల

బెక్కం వేణుగోపాల్ సమర్పణలో ఎస్ ఎల్ ఎస్ మూవీస్ నిర్మాణ సంస్ణ లో రంజిత్, సౌమ్య మీనన్ హీరో హీరోయిన్స్ గా, ధ‌ర్మ‌పురి ఫేం గగన్...

అందం కోసం బుట్టబొమ్మ సర్జరీపై క్లారిటీ

హీరోయిన్ పూజా హెగ్డే తన అందాన్ని పెంచుకోవడం కోసం ఇటీవల ముక్కు సర్జరీ చేయించుకుంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన విషయం...

బాబోయ్‌ రష్మిక మరీ అంత పెంచేసిందా?

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుసగా బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. సౌత్ లో కొన్ని ఆఫర్స్ ని ఈమె కాదన్నట్లుగా...

రాజకీయం

మునుగోడు పంచాయితీ.! అన్నీ జాతీయ పార్టీలేనా.?

తెలంగాణలోని మునుగోడు నియోజకవర్గానికి ఉప ఎన్నిక ఎప్పుడో ఖాయమైపోయింది. ఇప్పుడు ఉప ఎన్నిక నగారా కూడా మోగేసింది. నవంబర్ మొదటి వారంలో ఫలితం కూడా తేలిపోతుంది. కాంగ్రెస్, బీజేపీ తరఫున అభ్యర్థులు ఖరారైపోయారు....

అమరావతి రైతుల పాదయాత్రపై వైసీపీ ఉక్కుపాదం: ఉత్తరాంధ్ర వరకూ వెళ్ళదా.?

అమరావతి రైతుల పాదయాత్రపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉక్కు పాదం మోపనుందా.? అటు ప్రభుత్వం తరఫున, ఇటు పార్టీ తరఫున ఆటంకాలు సృష్టించేందుకు వ్యూహాలు సిద్ధమవుతున్నాయా.? ప్రభుత్వం తరఫున, పార్టీ తరఫున నానా...

గులాబీ రాజకీయం.! జాతీయ తెలుగు పార్టీ దిశగా.!

ఇంతలోనే ఎంత మార్పు.? నిజానికి, ఈ మార్పు మంచిదే.! తెలుగు తల్లి ఎవనికి తల్లి.? అని ప్రశ్నించిన తెలంగాణ రాష్ట్ర సమితి, ఇప్పుడు ‘తెలుగు పార్టీ, జాతీయ రాజకీయాల్లో సత్తా చాటబోతోంది..’ అని...

అమరావతి రైతుల పాదయాత్ర: మంత్రుల బెదిరింపులు.! జనం బేఖాతర్.!

రాజధాని అమరావతి విషయంలో మంత్రులు బెదిరింపులకు దిగుతున్నారు. జనాన్ని రెచ్చగొడుతున్నారు. అమరావతి నుంచి అరసవెల్లికి జరుగుతున్న మహా పాదయాత్రను అడ్డుకునేందుకు ప్రభుత్వం స్థాయిలో, పార్టీ స్థాయిలో ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. అవి సఫలం...

కేసీయార్ స్కెచ్.! ఆంధ్రప్రదేశ్‌లోనూ టీఆర్ఎస్ పోటీ.?

‘ఆంధ్రప్రదేశ్‌లోనూ తెలంగాణ రాష్ట్ర సమితి పోటీ చేయాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు..’ అని పలు సందర్భాల్లో గులాబీ పార్టీ నేతలు వ్యాఖ్యానించడం చూశాం. ఆ లిస్టులో తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్...

ఎక్కువ చదివినవి

తన తల్లి అంటే మహేష్ కు ఎంత ఇష్టమో…

సూపర్ స్టార్ మహేష్ బాబు తన తల్లి ఇందిరా దేవి మృతి పట్ల తీవ్ర ద్రిగ్బంతి చెందుతున్నారు. మహేష్ తన తల్లి ఇందిరమ్మ ఎంత అటాచ్డ్ అన్నది చాలా మందికి తెలుసు. పలు...

నూట డెబ్భయ్ ఐదుకి 175.! కొట్టేస్తే పోలా.?

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి 2019 ఎన్నికల్లో 151 అసెంబ్లీ సీట్లు వస్తాయని అంతకు ముందు ఎవరైనా ఊహించారా.? అనూహ్యమైన పరిణామం అది. ఈసారి మొత్తంగా నూట డెబ్భయ్ ఐదు నియోజకవర్గాలకుగాను...

వీరమల్లు వర్క్‌ షాప్‌.. ఫ్యాన్స్‌ ఫుల్‌ హ్యాపీ

పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా రోజులుగా హరిహర వీరమల్లు సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. క్రిష్ దర్శకత్వంలో ప్రారంభమైన ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు మధ్యలో నిలిచి పోవడంతో అభిమానుల్లో ఆందోళన...

‘హరిహర వీర మల్లు’ ప్రీ షెడ్యూల్ వర్క్ షాప్

విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు ప్రేక్షకులను మెప్పించగల విజయవంతమైన చిత్రాలను రూపొందించడంతో దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దిట్ట. 'కంచె', 'గౌతమీపుత్ర శాతకర్ణి' వంటి చిరస్మరణీయమైన మరియు జాతీయ పురస్కారాలు గెలుచుకున్న చిత్రాలను ఆయన...

మహేష్ బాబు సినిమాలో మోహన్ బాబు?

సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మహేష్ 28వ చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెల్సిందే. ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే మొదలవ్వగా అప్పుడే ఒక షెడ్యూల్ కూడా పూర్తయింది....