“పుష్ప -2” హిట్ తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ, టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటిలో ఏది ముందు ఖాయమవుతుందన్న చర్చ ఎప్పటినుంచో అభిమానుల్లో ఉంది. అయితే ఈ ఈ ప్రశ్నకి సమాధానం దాదాపు దొరికేసినట్టే. త్రివిక్రమ్ షెడ్యూల్ కుదరని కారణంగా ముందు అట్లీతో సినిమానే పట్టాలకే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.
ఈ సినిమాలో హీరోయిన్ కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ పేరును పరిశీలించినట్లు సమాచారం. గతేడాది జూనియర్ ఎన్టీఆర్ సరసన “దేవర”లో మెప్పించిన జాన్వీ..ప్రస్తుతం స్టార్ హీరో రామ్ చరణ్- బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న సినిమాలో నటిస్తున్నారు.
సాధారణంగా అట్లీ సినిమాల్లో హీరోయిన్ల పాత్రలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. “రాజా రాణి”,”బిగిల్”, ” జవాన్” సినిమాల్లో నయనతార పాత్ర, “తెరి” సినిమాలో సమంత పాత్ర అలా డిజైన్ చేసినవే. ఇప్పుడిప్పుడే టాలీవుడ్ లో అడుగుపెడుతున్న జాన్వీ కి అట్లీ సినిమాలో హీరోయిన్ పాత్ర మంచి అవకాశమనే చెప్పాలి. ఇక ఈ సినిమా షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.