టాలీవుడ్‌లో ఇప్పటివరకు చాలా పాన్ ఇండియా సినిమాలు వచ్చి బాక్సాఫీస్ వద్ద తమ సత్తా చాటాయి. కానీ ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయని పాయింట్‌తో ఓ పాన్ ఇండియా మూవీ రాబోతుంది. ‘Nth Hour’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటోంది. లేడీ లయన్ క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ‘Nth Hour’ మూవీలో యంగ్ హీరో విశ్వకార్తికేయ నటిస్తున్నాడు. ఈ హీరో ఇప్పటికే నటించిన అల్లంత దూరాన, ఐపిఎల్ సినిమాలు రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి.
ఇక ఈ సినిమాను ప్రముఖ వ్యాపారవేత్త రాజు గుడిగుంట్ల స్వీయ డైరెక్షన్‌లో తెరకెక్కిస్తుండగా, ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా ఈ చిత్ర మోషన్ పోస్టర్‌ను కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి చేతుల మీదుగా లాంచ్ చేశారు. ఇలాంటి వైవిధ్యమైన సినిమాలకు టాలీవుడ్ పెట్టింది పేరుగా మారిందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ ఈ సినిమాలో నటిస్తున్న నటీనటులకు, టెక్నీషియన్లకు శుభాకాంక్షలు.. ఇలాంటి వైవిధ్యమైన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని.. ఈ Nth Hour సినిమా కూడా ఘన విజయాన్ని సాధిస్తుందని ఆశిస్తున్నా’’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ రాజు గుడిగుంట్ల, హీరో విశ్వకార్తికేయ, లైన్ ప్రొడ్యూసర్ లంకదాసరి ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నాదెండ్ల సురేష్ బాబు, DOP శ్రీవెంకట్ తదితరులు పాల్గొన్నారు.