తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేసింది. ఇప్పట్లో సీట్ల పెంపు ఆలోచన ఏదీ లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టంచేశారు. దీనిపై కేంద్ర న్యాయశాఖదే తుది నిర్ణయమని పేర్కొన్నారు. నిజానికి ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోనే రెండు రాష్ట్రాల్లో సీట్ల పెంపు గురించి ప్రస్తావించారు. అప్పట్లో హడావుడిగా చివరి నిమిషంలో ఈ క్లాజ్ పెట్టారు.
దీంతో తెలుగు రాష్ట్రాల్లో అప్పుడు అధికారంలో ఉన్న టీఆర్ఎస్, టీడీపీ దీని ద్వారా లబ్ధి పొందాలని భావించాయి. ప్రతిపక్ష నేతలను ఎడాపెడా పార్టీలో చేర్చుకుని వారికి ఎమ్మెల్యే టికెట్ ఆఫర్ చేశాయి. త్వరలో అసెంబ్లీ సీట్ల పెంపు ఖాయమని, అలా పెరిగే స్థానాల్లో అవకాశం కల్పిస్తామని కేసీఆర్, చంద్రబాబు ఆయా నేతలకు హామీ ఇచ్చారు. అయితే, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఈ విషయాన్ని పక్కన పడేసింది. దీంతో ఇటు కేసీఆర్, అటు చంద్రబాబు సీట్ల పెంపు విషయంలో బీజేపీపై ఒత్తిడి చేశారు. అయినప్పటికీ కాషాయ పార్టీ పట్టించుకోలేదు.
ఐదేళ్లూ గడిచిపోయి ఎన్నికలు వచ్చేశాయి. తెలంగాణలో మరోసారి టీఆర్ఎస్ అధికారంలోకి రాగా, ఏపీలో టీడీపీ ఘోర పరాజయం పాలైంది. వైసీపీ అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతోంది. ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ల సమయం ఉన్నందున సీట్ల పెంపు అంశానికి ఇప్పుడు అంత ప్రాధాన్యత లేదు. దీని గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోవడంలేదు కూడా. ఎందుకంటే.. ఇప్పటికిప్పుడు అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంచుతూ నిర్ణయం తీసుకున్నప్పటికీ, వచ్చే ఎన్నికల వరకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. అందువల్లే సీట్ల పెంపు ఇప్పట్లో లేదంటూ కిషన్ రెడ్డి ప్రకటించినా.. ఎవరూ అంతగా పట్టించుకోలేదు.
901599 563276I just could not go away your web site before suggesting that I really enjoyed the usual info a person supply to your guests? Is going to be back ceaselessly in order to inspect new posts. 639173
955819 185207Hey! Excellent post! Please do tell us when we can see a follow up! 409049
168336 222511Some truly excellent articles on this internet web site , thankyou for contribution. 139573
637270 649544Good weblog! Only difficulty is im running Firefox on Debian, and the web site is seeking a bit.. weird! Maybe you could want to test it to see for yourself. 868857
470782 512016This style is steller! You surely know how to maintain a reader entertained. Between your wit and your videos, I was almost moved to start my own weblog (nicely, almostHaHa!) Fantastic job. I actually enjoyed what you had to say, and far more than that, how you presented it. Too cool! 628632