కిరణ్ అబ్బవరం హీరోగా రుక్సర్ థిల్లాన్, కెతి దేవిసన్ హీరోయిన్స్ గా విశ్వ కరుణ్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా దిల్ రూబా. ఈ సినిమా రిలీజ్ సందర్భంగా మరోసారి మీడియాతో ముచ్చటించారు చిత్ర యూనిట్. దిల్ రూబా సినిమా మొదటి 30 నిమిషాల తర్వాత అసలు కథలోకి వెళ్తాం.. ఈ సినిమాలో ప్రేమ ఒక్కటే కాదు స్నేహం, ఫాదర్ సన్, డాటర్ రిలేషన్ ఉంటాయని అన్నారు కిరణ్ అబ్బవరం. అన్ని ఎమోషన్స్ ఉన్న సినిమా ఇది.. ఎక్స్ లవర్ మళ్లీ ప్రేమికుడి జీవితంలోకి వస్తే అతని ప్రెజెంట్ లవ్ ని కలిపే ప్రయత్నం చేయడమే దిల్ రూబా లో ఉన్న కొత్త పాయింట్. మాజీ ప్రేమికుడు శత్రువులా చూడాల్సిన పనిలేదని చెప్పే సినిమా అని అన్నారు కిరణ్ అబ్బవరం.
ఎలాంటి ఇబ్బంది కరమైన డైలాగ్స్ ఉండవని.. ఈ సినిమాలో నటించాక నటుడిగా ఇంకాస్త పరిణితి సాధించానని అన్నారు కిరణ్ అబ్బవరం. ఈ సినిమాతో డైరెక్టర్ కు మంచి పేరొస్తుంది. సినిమా కోసం అతను రాసిన డైలాగ్స్ పూరీ గారిని గుర్తు చేస్తాయని అన్నారు కిరణ్ అబ్బవరం. క సినిమా సక్సెస్ ని ప్రెడిక్ట్ చేయొచ్చు దిల్ రూబా మ్యాజిక్ మూమెంట్స్ మీద వెళ్లే సినిమా.. ఈ సినిమాకు కనెక్ట్ అయితే ఊహించని రేంజ్ లో రిజల్ట్ ఉందని అన్నారు.
డైరెక్టర్ విశ్వ కరణ్ కూడా సినిమా మీద చాలా నమ్మకంగా ఉన్నారు. మనుషుల మధ్య తగ్గిపోతున్న విలువలు, బంధాల గురించి వార్తల్లో చూస్తున్నాం అవి చూశాకే దిల్ రూబా లాంటి కథ రాయాలని అనిపించిందని అన్నారు విశ్వ కరుణ్. క్యారెక్టర్ కోసం బతికే వ్యక్తి హీరో. డైలాగ్స్ కు మంచి పేరు వస్తుంది. కథ డిమాండ్ మేరకే ఆ డైలాగ్స్ రాశాను. కిరణ్ గారిని ఈ సినిమాలో క్తొతగా చూస్తారు. సినిమాకు మీరిచ్చే రిజల్ట్ కోసం ఎదురుచూస్తున్నా అని అన్నారు డైరెక్టర్ విశ్వ కరుణ్.