Kiran Abbavaram: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా “క”. భారీ పీరియాడిక్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా ఆసక్తి రేపుతోంది. మ్యూజిక్ ప్రమోషన్స్ లో భాగంగా సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల చేయడానికి సిద్ధమవుతోంది చిత్ర యూనిట్. సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నారు. నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్.
చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీగా సినిమా నిర్మిస్తున్నారు. సినిమాకు దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ దర్శకత్వం వహిస్తున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్, థ్రిల్లర్ అంశాలతో సినిమా తెరకెక్కిస్తున్నారు. ఆమధ్య విడుదల చేసిన సినిమా థీమ్ టీజర్ తో సినిమాపై అంచనాలు పెరిగాయి.
కిరణ్ అబ్బవరం ఇప్పటివరకూ నటించిన సినిమాలకు భిన్నంగా సినిమా చాలా గ్రాండియర్ గా తెరకెక్కుతోంది. సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తిచేసి తెలుగుతోపాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు.