‘క’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కిరణ్ అబ్బవరం తన కొత్త సినిమా దిల్ రూబాతో రాబోతున్నాడు. విశ్వ కరణ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం సరసన రుక్సర్ థిల్లాన్ హీరోయిన్ గా నటిస్తుంది. శివమ్ సెల్యులాయిడ్స్, ఏ యూడ్లీ ఫిలిమ్స్ బ్యానర్ లో రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సారెగమ ఈ సినిమా నిర్మిస్తున్నారు.
రీసెంట్ గా టీజర్ తో సినిమాపై బజ్ పెంచిన దిల్ రూబా సినిమా అసలైతే వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ సినిమాకు బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చేందుకు పోస్ట్ పోన్ చేశారు. ఈ సినిమాకు కొత్త రిలీజ్ డేట్ లాక్ చేశారు మేకర్స్. మార్చి 14న కిరణ్ అబ్బవరం దిల్ రూబా రిలీజ్ లాక్ చేశారు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ తో సినిమా పై అంచనాలు ఏర్పడగా వాటికి ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉంటుందని అంటున్నారు.
‘క’ మూవీతో సూపర్ హిట్ అందుకున్న కిరణ్ అబ్బవరం దిల్ రూబాతో కూడా ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్నారు. ఈ సినిమాకు డానియేల్ విశ్వాక్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా సామ్ సీఎస్ మ్యూజిక్ అందిస్తున్నారు.
యువ హీరోల్లో తనకంటూ ఒక సెపరేట్ స్టైల్ సెట్ చేసుకున్న కిరణ్ అబ్బవరం ‘క’ ముందు వరకు వరుస ఫ్లాపులు ఎదుర్కొన్నాడు. ‘క’ సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కిన కిరణ్ అబ్బవరం రాబోతున్న దిల్ రూబా మీద కూడా సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నట్టు తెలుస్తుంది.
