కిరణ్ అబ్బవరం.. ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న హీరో. దీపావళికి ముందు దాకా చాలా సినిమాలు తీసినా ఒక్క హిట్ రాలేదు. దానికి తోడు సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ ఎదుర్కున్నాడు. కెరీర్ డైలమాలో పడిపోయింది. అర్జెంటుగా ఒక హిట్ కొడితేనే ఆయన నిలదొక్కుకుంటాడు లేదంటే ఆయన్ను ప్రేక్షకులు కూడా పట్టించుకోరు అనుకుంటన్న టైమ్ లో దీపావళికి క సినిమాతో వచ్చాడు. బొమ్మ బ్లాక్ బస్టర్ అయింది. ఇంకేముంది ఒక్కసారిగా ఇండస్ట్రీ చూపు మొత్తం ఆయన మీదకు వెళ్లింది. పైగా ట్రోలింగ్ మీద ఆయన వ్యక్తం చేసిన ఆవేదన ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసింది.
దీనికి తోడు తమిళ, మలయాళంలో థియేటర్లు దొరకట్లేదని చెప్పడం తెలుగు ప్రేక్షకులను క సినిమాకు నడిపించింది. ఈ సక్సెస్ టైమ్ లో కిరణ్ చేసిన కామెంట్లు ఇప్పుడు ఆయనకు పెద్ద సపోర్టు దొరికేలా చేశాయని అంటున్నారు. ఓ రిపోర్టర్ ప్రశ్నిస్తూ.. మీరు ఏ హీరో ఫ్యాన్ అని అడిగాడు. కిరణ్ ఏ మాత్రం ఆలోచించకుండా తాను పవన్ కల్యాణ్ అభిమానిని అని చెప్పేశాడు. ఇంకేముంది ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. పవర్ స్టార్ ఫ్యాన్స్ మొత్తం ఆయనకు పాజిటివ్ గా కామెంట్లు పెడుతున్నారు. పవన్ వ్యక్తిత్తాన్ని కిరణ్ ఆచిరిస్తున్నాడంటూ ఆయన ఇప్పటి వరకు మాట్లాడుతున్న వాటిని పోస్టులు పెడుతున్నారు.
ఇంకొందరు పవన్ ఫ్యాన్స్ అయితే.. పవనిజం అనేది కిరణ్ లో స్పష్టంగా కనిపిస్తోందని.. ఆయన నిజమైన పవన్ అభిమాని కాబట్టి అతనికి మనం సపోర్టుగా నిలవాలంటూ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేస్తున్నారు. గతంలో హైపర్ ఆది కూడా కిరణ్ అబ్బవరం మరో పవర్ స్టార్ అవుతాడంటూ చెప్పడం కూడా ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. మొత్తంగా కిరణ్ కు పవర్ స్టార్ ఫ్యాన్స్ సపోర్టు దొరికినట్టే అంటున్నారు. ఇది ఆయన రాబోయే సినిమాలకు మార్కెట్ ను కూడా పెంచుతుందని చెబుతున్నారు.