Switch to English

కిల్‌ ఫేక్‌ న్యూస్‌: విజయ్‌ దేవరకొండ ‘రౌడీ’యిజం.!

ఫేక్‌ న్యూస్‌ని చంపేయాల్సిందే.. వేరే మార్గమే లేదు. ఎందుకంటే, కరోనా వైరస్‌ కంటే ప్రమాదకరమీ ఫేక్‌ న్యూస్‌. ఈ విషయాన్నే రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ తనదైన స్టయిల్లో చెప్పాడు. ఓ మూడు నాలుగు వెబ్‌సైట్లు, పనిగట్టుకుని తనపై దుష్ప్రచారానికి దిగాయంటూ, అందునా ఓ వెబ్‌సైట్‌ గురించి సవివరంగా పేర్కొంటూ ఓ వీడియో విడుదల చేశాడు రౌడీ హీరో.

‘ఈ తరహా చిల్లర రాతల గురించి మాట్లాడటం టైమ్ వేస్ట్‌. కానీ, తప్పుడు వార్తలతో తప్పుడు సంకేతాలు వెళతాయి. అందుకే స్పందించాల్సి వచ్చింది. డొనేషన్స్‌ ఇవ్వాలా.? వద్దా.? అన్నది నా ఇష్టం. నేను ఎప్పుడు చేయాలి.? ఎలా చెయ్యాలి.? అన్నది నాకు తెలుసు..’ అంటూ విజయ్‌ దేవరకొండ తీవ్రస్థాయిలో సదరు వెబ్‌సైట్‌పై విరుచుకుపడ్డాడు.

‘మా సినిమా ఇండస్ట్రీ మీద పడి మీరు బతుకుతున్నారు. మా మీద తప్పుడు వార్తలు రాస్తారు. మళ్ళీ మా సినిమాలకు సంబంధించిన ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయంతో బతుకుతారు. మా వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూసి, అడ్డమైన రాతలూ రాస్తారు..’ అని గట్టిగానే ఓ వెబ్‌సైట్‌పై విరుచుకుపడ్డాడు విజయ్‌ దేవరకొండ.

విజయ్‌ ఇలా స్పందించడానికి బలమైన కారణమే వుంది. ‘ది దేవరకొండ ఫౌండేషన్‌’ పేరుతో, విజయ్‌ దేవరకొండ టీమ్ , కుటుంబానికి వెయ్యి రూపాయల చొప్పున వీలైనంత ఎక్కువమందికి సాయం చేసేందుకు ముందుకొచ్చింది కరోనా వైరస్‌ నేపథ్యంలో. ఆ దిశగా అత్యంత సమర్థవంతంగా దేవరకొండ టీమ్ పనిచేస్తోంది కూడా.

అయితే, ‘ఒక సిటీలో కొంత భాగం చేస్తే సరిపోతుంది.. రెండు రాష్ట్రాల్లోనూ ఎందుకు చేయడం.? పబ్లిసిటీ కోసమా.?’ అని సదరు వెబ్‌సైట్‌ అమాయకంగా ప్రశ్నించింది. ‘ఈ సందర్భంలో నా తాహతుకు మించి సాయం చేయడానికి నేను సిద్ధం. నేను చేస్తున్నదీ అదే. ఈ క్రమంలో సాటి మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీస్‌ కూడా ఎంతో కొంత సాయం చేయడానికి ముందుకొస్తున్నాయి. 2 వేల మందికి కాదు, 2 వేల కుటుంబాలు లక్ష్యంగా పెట్టుకున్నాం. అంతకు మించి చేయడానికి ప్రణాళికలు రచించుకుంటున్నాం.. మీరు వేస్తున్న చిల్లర వేషాల వల్ల, కొందరికైనా అనుమానాలు కలిగితే, కొన్ని కుటుంబాలైనా సాయానికి దూరమవుతాయి. అదీ నా ఆవేదన’ అని అన్నాడు విజయ్‌.

కరోనా క్రైసిస్‌ నేపథ్యంలో తెలుగు సినీ పరిశ్రమ ఓ ఫండ్‌ ఏర్పాటు చేసింది.. కరోనా క్రైసిస్‌ ఛారిటీ పేరుతో, సినీ కార్మికులకు నిత్యావసర వస్తువులను అందిస్తున్నారు. మెగాస్టార్‌ చిరంజీవి నేతృత్వంలో నడుస్తోందిది. ఈ విషయాన్నీ విజయ్‌ ప్రస్తావిస్తూ, ‘నేను టాలీవుడ్‌కి సమాంతరంగా ఇంకో వ్యవస్థను నడుపుతున్నానంటూ తప్పుడు వార్తలు ఆ వెబ్‌సైట్‌ ప్రచారంలోకి తెచ్చింది. కానీ, తెలుగు సినీ పరిశ్రమలో నేనూ ఓ భాగం. మా చిరంజీవిగారు స్థాపించారు కరోనా క్రైసిస్‌ ఛారిటీ. మేం కూడా దాన్ని స్పూర్తిగా తీసుకున్నాం..’ అని విజయ్‌ వివరించాడు.

దాదాపు 20 నిమిషాల నిడివిగల వీడియోలో, విజయ్‌ ప్రస్తుత వెబ్‌ మీడియా పోకడలపై విమర్శలు చేస్తూనే, ‘జెన్యూన్‌గా చాలా వెబ్‌సైట్లు పనిచేస్తున్నాయి. అందులో చాలామంది పనిచేస్తున్నారు. వారందరికీ క్షమాపణ చెబుతున్నాను.. వారెవర్నీ కించపర్చే ఉద్దేశ్యం నాకు లేదు..’ అని విజయ్‌ పేర్కొనడం గమనార్హం.

‘రివ్యూల పేరుతో బ్లాక్‌మెయిల్‌కి పాల్పడుతున్నారు. ఆ ముగ్గురు నలుగురు కలిసి సిండికేట్‌గా మారి, సినిమాల్ని చంపేస్తున్నారు..’ అని విజయ్‌ దేవరకొండ సంచలన ఆరోపణలు చేశాడు. విజయ్ దేవరకొండని ‘రౌడీ’గా అభివర్ణిస్తారు ఆయన అభిమానులు.. ఇక్కడ రౌడీ.. అంటే, అందులో రౌడీయిజం వేరు. అది అతని ఆటిట్యూడ్.. ముక్కుసూటితనం. కిల్ ఫేక్ న్యూస్ విషయంలో విజయ్ దేవరకొండ ‘రౌడీ’యిజానికి హేట్సాఫ్ చెప్పాల్సిందే.

అదే సమయంలో, విజయ్ దేవరకొండ తలపెట్టిన మహాయజ్నం ‘మిడిల్ క్లాస్ ఫండ్’ మరింత ఎక్కువమందికి ఉపశమనం అందించాలని ఆశిద్దాం.

సినిమా

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

కమల్‌తో వ్యవహారంపై క్లారిటీ ఇచ్చింది

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ సుదీర్ఘ కాలం పాటు నటి గౌతమితో సహజీవనం సాగించిన విషయం తెల్సిందే. ఆమెతో కొన్ని కారణాల వల్ల విడిపోయిన కమల్‌...

ముందు ఎఫ్ 3.. ఆ తర్వాతే ఏదైనా

దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పుడు టాప్ లీగ్ లోకి చేరిపోయాడు. చేసినవి 5 సినిమాలు అయితే ఐదు కూడా సూపర్ డూపర్ హిట్లు అయ్యాయి. ఒకదాన్ని...

ఈ హీరోయిన్ కు కూడా లైంగిక వేధింపులు తప్పలేదట

లైంగిక వేధింపులు అనేది అన్ని చోట్లా ఉంది. కాకపోతే సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య ఈ విషయం ఎక్కువగా చర్చకు వస్తోంది. ఇదివరకు ఈ విషయంపై...

సాయి తేజ్ ‘నో పెళ్లి’ కాన్సెప్ట్ కి రానా, వరుణ్ తేజ్...

దాదాపు రెండున్నర నెల తర్వాత టాలీవుడ్ లో మళ్ళీ ప్రమోషన్స్ హడావిడి స్లోగా మొదలవుతోంది. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న 'సోలో...

రాజకీయం

సగటు భక్తుడి ఆవేదన: వెంకన్న జోలికి వెళ్ళొద్దు ప్లీజ్‌.!

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా టీటీడీ పాలక మండలి అనగానే రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా మారిపోయిందన్నది ఓపెన్‌ సీక్రెట్‌. ఇదే విమర్శ గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో విన్నాం.. ఆ తర్వాత...

టీటీడీ వివాదంపై జగన్ కి విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సూచనలు.!

టీటీడీ భక్తులు ఇచ్చిన భూములు విక్రయించాలి అని నోటీసులు జారీ చేసినప్పటి నుంచీ ఆ విషయంపై నానా రచ్చ నడుస్తోంది. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తున్నారు. కానీ టీటీడీ...

జనసేనానీ.. ఈ డోస్‌ సరిపోదు సుమీ.!

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఈ మధ్య సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా వుంటున్నారు. అయితే, ఎక్కువగా రీ-ట్వీట్లు చేస్తున్నారనే విమర్శలూ పవన్‌ కళ్యాణ్‌ మీద లేకపోలేదనుకోండి.. అది వేరే విషయం. బీజేపీ...

శ్రీశైలంలో కోట్లు స్వాహా చేసిన అక్రమార్కులు

అవినీతి అనేది అక్కడ ఇక్కడ అని లేకుండా ఎక్కడ పడితే అక్కడే జరుగుతుంది అనేందుకు మరో ప్రత్యేక్ష ఉదాహరణగా శ్రీశైలం నిలిచింది. ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన అక్కడ కోట్లాది రూపాయల...

జగన్ కీలక నిర్ణయం.. సజ్జలకు పార్టీ బాధ్యతలు?

పార్టీ బాధ్యతల విషయంలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారా? అటు సీఎంగా పాలనా వ్యవహారాలు, ఇటు అధినేతగా పార్టీ కార్యకలాపాలు ఒకేసారి చూడటం కాస్త...

ఎక్కువ చదివినవి

వైసీపీ నేతల కరోనా పైత్యం: జగన్‌ సారూ.. మీకర్థమవుతోందా.?

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పలువురు నేతలు కరోనా లాక్‌డౌన్‌ నిబంధనల్ని ఉల్లంఘించి విచ్చలవిడిగా వ్యవహరించిన తీరుపై గత కొంతకాలంగా విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం విదితమే. ఇద్దరు మహిళా ప్రజా ప్రతినిథులు తమ...

5 మీటర్ల దూరంలో తెగిపడ్డ తల

మెదక్ జిల్లాలో దారుణం యాక్సిడెంట్ జరిగింది. ఈ యాక్సిడెంట్ లో దుర్గయ్య తల తెగి 5 మీటర్ల దూరంలో పడటం స్థానికంగా కలకలం రేపింది. పెద్ద శంకరం పేట మండలం ఉత్తలూరు గ్రామానికి...

ఫ్లాష్ న్యూస్: ఆఫ్రికా నుండి ఇండియాకు చేరిన మిడుతల దండు

మొన్నటి వరకు ఆఫ్రికా దేశాలను అల్లాడించి అతలాకుతలం చేసిన మిడతల దండు పాకిస్తాన్ మీదుగా ఇండియా చేరింది. ప్రస్తుతం ఉత్తర భారతంలో ఈ మిడతల దండు రైతుల పాలిట రాక్షసులుగా మారాయి. పంట...

ఫ్లాష్ న్యూస్: లారీ క్యాబిన్‌లో ఉరి వేసుకున్న డ్రైవర్‌

నెలన్నర రోజుల తర్వాత ఎట్టకేలకు లారీలు రోడ్డు ఎక్కాయి. ఈ సమయంలో ఆర్థికంగా డ్రైవర్లు చితికి పోయారు. వారి జీవితం ఆందోళనకరంగా మారింది. ఎంతో మంది ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవతున్నారు. ఆ...

ఇప్పుడా భారమంతా జక్కన్నపైనే

షూటింగ్ లు ఆగిపోయి దాదాపు రెండు నెలలు దాటింది. సినిమా మీదే ఆధారపడి జీవించే దాదాపు 12 వేల మందికి ఇప్పుడు పూట గడవడం కూడా కష్టంగానే ఉంటోంది. అందుకే చిరంజీవి, నాగార్జున...