Switch to English

ఖిలాడి మూవీ రివ్యూ

Critic Rating
( 1.50 )
User Rating
( 1.50 )

No votes so far! Be the first to rate this post.

Movie ఖిలాడి
Star Cast రవి తేజ, మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి,
Director రమేష్ వర్మ
Producer సత్యనారాయణ కోనేరు
Music దేవీ శ్రీ ప్రసాద్
Run Time 2hr 34 Mins
Release ఫిబ్రవరి 11, 2022

క్రాక్ తో హిట్ అందుకుని ఫామ్ లోకి వచ్చిన రవితేజ ఆ తర్వాత వరసగా చిత్రాలను లైన్లో పెట్టిన విషయం తెల్సిందే. ఖిలాడీ గతేడాదే విడుదల కావాల్సి ఉన్నా కరోనా కారణంగా వాయిదా పడి, ఈరోజు విడుదలైంది. రమేష్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం.

కథ:

పది వేల కోట్ల డబ్బు మిస్ అయిన కేసులో భాగంగా సీబీఐ అధికారి అర్జున్ భరద్వాజ (అర్జున్), మోహన్ గాంధీ (రవితేజ)ను టార్గెట్ చేస్తుంటాడు. అసలు సీబీఐ గాంధీ వెనకాల ఎందుకు పడుతుంది? గాంధీకి ఆ పది వేల కోట్ల రూపాయలకు ఉన్న సంబంధం ఏంటి? మనీ లాండరింగ్ లో గాంధీ హస్తం ఉందా? తదితర విషయాలకు సమాధానాలు పెద్ద తెరపై దొరుకుతాయి.

పెర్ఫార్మన్స్:

రవితేజ ఈ చిత్రానికి కచ్చితంగా మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఎప్పటిలానే తన ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్, టిపికల్ డైలాగ్ డెలివరీతో రవితేజ మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తాడు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో రవితేజ పెర్ఫార్మన్స్ సూపర్బ్.

సీబీఐ అధికారిగా అర్జున్ కు ప్రాధాన్యమున్న పాత్ర దక్కింది. రవితేజ, అర్జున్ మధ్య సన్నివేశాలు ఆడియన్స్ ను మెప్పిస్తాయి. అనసూయకు కేవలం గ్లామర్ షో కు మాత్రమే పరిమితమైంది. మురళి శర్మ, వెన్నెల కిషోర్ వంటి టాలెంటెడ్ నటులు ఉన్నా కానీ వారిని సరిగా ఉపయోగించుకోలేదు అనిపిస్తుంది.

ఇక హీరోయిన్లు మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి కూడా స్కిన్ షో కు మాత్రమే పరిమితమయ్యారు. వారి పాత్రలకు తీరూ తెన్నూ లేదు.

సాంకేతిక నిపుణులు:

దర్శకుడు రమేష్ వర్మ టేకింగ్ పూర్తిగా గాడి తప్పింది. సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ అవుట్ పుట్, అవుట్ డేటడ్ గా అనిపిస్తుంది. టైటిల్ సాంగ్ ఒక్కటి పక్కన పెడితే ఇక మరేదీ కూడా ఆకట్టుకోదు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదే విధంగా రొటీన్ గా సాగింది.

సినిమాటోగ్రఫీ మాత్రం టాప్ స్థాయిలో అనిపిస్తుంది. సినిమా అంతా కూడా రిచ్ టెక్స్చర్ కనిపిస్తుంది. ఎడిటింగ్ అంత ఆకట్టుకోదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమా స్థాయికి మించి ఖర్చు చేసారు అనిపిస్తుంది.

పాజిటివ్ పాయింట్స్:

  • రవితేజ
  • హీరోయిన్స్ గ్లామర్

నెగటివ్ పాయింట్స్:

  • దర్శకుడు
  • స్క్రీన్ ప్లే
  • మ్యూజిక్

విశ్లేషణ:

థ్రిల్లర్ అని చెప్పుకునే ఖిలాడీ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కాదు కదా ఎంటర్టైనింగ్ ఎపిసోడ్స్ కూడా లేవు. సినిమా రేసిగా సాగుతుంది కానీ ఒక్క సీన్ లో కూడా లాజిక్ అన్నది కనిపించదు. మొత్తంగా చూసుకుంటే ఖిలాడీ కచ్చితంగా నిరుత్సాహపరుస్తుంది.

తెలుగు బులెటిన్ రేటింగ్: 1.5/5

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: మాస్ కు కేరాఫ్ అడ్రెస్ గా...

కమర్షియల్ అంశాలు ఎక్కువగా ఉండే మాస్ కథాంశాల్ని చిరంజీవి ఎక్కువగా చేశారు. పాత్రను అన్వయం చేసుకుని తనదైన శైలిలో నటించి హీరోగా చిరంజీవి ఎలివేట్ అయిన...

కార్తికేయ 2 మూవీ రివ్యూ: డీసెంట్ థ్రిల్లర్

నిఖిల్, చందూ మొండేటి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం కార్తికేయ 2. కొన్నేళ్ల క్రితం వచ్చిన బ్లాక్ బస్టర్ కార్తికేయకు కొనసాగింపుగా ఈ చిత్రం వచ్చింది....

డబ్బింగ్ కార్యక్రమాలు మొదలుపెట్టిన బేబీ

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటిస్తోన్న తాజా చిత్రం బేబీ. యూట్యూబ్ ద్వారా ఫేమ్ సంపాదించుకున్న వైష్ణవి చైతన్య ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుండగా,...

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: చిరంజీవి నటనకు కీర్తి కిరీటం ‘ఆపద్భాంధవుడు

మెగాస్టార్ ఇమేజ్ తో చిరంజీవి చేసిన సినిమాలన్నీ 90శాతం కమర్షియల్ అంశాలు ఉన్న సినిమాలే. ఖైదీ తర్వాత వచ్చిన విపరీతమైన మాస్ ఇమేజ్ తో ఫ్యాన్స్,...

మాచెర్ల నియోజకవర్గం రివ్యూ

నితిన్, కృతి శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మాచెర్ల నియోజకవర్గం. ఎడిటర్ గా పేరు తెచ్చుకున్న ఎస్ ఆర్ శేఖర్ ఈ చిత్రాన్ని డైరెక్ట్...

రాజకీయం

కొత్త సమస్య.. ఆ నదిపై ప్రాజెక్టు వద్దని ఏపీ సీఎంకు తమిళనాడు సీఎం లేఖ

ఏపీ-తమిళనాడు సరిహద్దులో కుశస్థలి అంతర్రాష్ట్ర నదిపై జలాశయాల నిర్మాణం చేపట్టొద్దని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని తమిళనాడు సీఎం స్టాలిన్ ఓ లేఖలో కోరారు. ‘కుశస్థలి నదిపై ఏపీ ప్రభుత్వం 2చోట్ల...

ఎలక్షన్ ఫీవర్.! అసెంబ్లీ నియోజకవర్గానికి 30 కోట్లు ఖర్చు మాత్రమేనా.?

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా ఎన్నికలంటే అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారిపోయిందన్నది నిర్వివాదాంశం. అసెంబ్లీ నియోజకవర్గానికే 150 కోట్ల పైన ఖర్చు చేసిన ప్రబుద్ధులున్నారు రాజకీయాల్లో.. అంటూ 2019 ఎన్నికల సమయంలో ప్రచారం...

వైఎస్ విజయమ్మకి రోడ్డు ప్రమాదం.! వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ అనుమానం.!

కారు టైర్లు పేలిపోవడం అనేది జరగకూడని విషయమేమీ కాదు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతుంటుంది. కార్ల టైర్లను సరిగ్గా మెయిన్‌టెయిన్ చేయకపోవడం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతుంటాయని నిపుణులు చెబుతుంటారు. మామూలు వ్యక్తుల...

రేవంత్ రెడ్డి వర్సెస్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.!

ఎవరో తిడితే, ఇంకెవరో క్షమాపణ చెప్పాలట.! ఇదెక్కడి పంచాయితీ.? ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్ళగొట్టబడాలనే ఆలోచనతో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వున్నట్టున్నారు. లేకపోతే, అద్దంకి దయాకర్ తన మీద చేసిన...

ఛీరెడ్డి బూతులు.! ‘బూతుల శాఖ’ దక్కుతుందా.?

బూతులు తిట్టారు, నానా యాగీ చేశారు.. చివరికి కొడాలి నాని పరిస్థితి ఏమయ్యింది.? మంత్రి పదవి ఊడింది.! ఇది చూసైనా, వైసీపీలో చాలామందికి బుద్ధి రావాలి కదా.? కానీ, అంతకు మించి ఎగిరెగిరి...

ఎక్కువ చదివినవి

నిస్సిగ్గు రాజకీయ నగ్నత్వం: కులాల కుంపటి తెరపైకి.!

‘బొత్తిగా సిగ్గొదిలేశారు.. అన్న మాట ప్రస్తావించకుండా వుండలేమేమో.. రాష్ట్రంలో రాజకీయాలు అంత ఛండాలంగా తయారయ్యాయ్..’ ఇదీ ఓ ప్రజాస్వామ్యవాది ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ భ్రష్టత్వంపై వ్యక్తం చేసిన అభిప్రాయం.! హిందూపురం ఎంపీ, వైసీపీ నేత గోరంట్ల...

తిరుమలలో భక్తుల రద్దీ.. 6కి.మీ మేర క్యూలైన్లు.. దర్శనానికి 2రోజుల సమయం

వరుస సెలవుల నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. దీంతో తిరుమలలో క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడుతోంది. 6కి.మీ మేర క్యూలైన్లు ఉన్నాయి. ప్రస్తుతం క్యూలైన్ రింగ్ రోడ్డు దాటింది. శ్రీవారి దర్శనానికి...

డీజే టిల్లు2లో ఈ మల్లు బ్యూటీ?

సిద్ధూ జొన్నలగడ్డ నటించిన డీజే టిల్లు ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చాలా లిమిటెడ్ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ చిత్రం సూపర్బ్ రిజల్ట్ ను అందుకుంది. ఈ...

తొలి వారాంతంలోనే 25 కోట్లు కొల్లగొట్టిన సీతా రామమ్

దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో రష్మిక మందన్న ప్రత్యేక పాత్రలో నటించిన చిత్రం సీతా రామమ్. ఈ సినిమా గత వారాంతం విడుదలై అద్భుతమైన రివ్యూలు తెచ్చుకున్న విషయం తెల్సిందే....

చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో జన సైనికుల రక్తదానం

''రక్తం దొరకని కారణంగా ఎవరికీ ప్రాణాపాయం ఉండకూడదు" అన్న మెగాస్టార్ చిరంజీవి ఆశయానికి అనుగుణంగా ఎందరో అభిమానులు ప్రతీరోజు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కు వచ్చి రక్తదానం చేస్తున్నారు.. త్వరలో మెగాస్టార్ జన్మదినం...