మాస్ మహారాజా రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఫ్యాన్స్ కు అప్డేట్ ల పండగ వచ్చిందనే చెప్పాలి. రవితేజ వరసగా సినిమాలను లైన్లో పెట్టడంతో వాటి అప్డేట్స్ అన్నీ ఈరోజు వచ్చాయి. అందులో ముందుగా చెప్పుకోవాల్సింది ఖిలాడీ గురించి. రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ ఖిలాడీ చేసాడు. ఫిబ్రవరి 11న విడుదలవుతోంది.
ఈ సందర్భంగా ఈరోజు ఫుల్ కిక్ అనే సాంగ్ ను విడుదల చేసారు. పేరుకి తగ్గట్లుగానే ఈ సాంగ్ ఫుల్ కిక్ తో ఉంది. థియేటర్స్ లో రవితేజ ఫ్యాన్స్ కు ఊపు తీసుకొచ్చే సాంగ్ ఇది. దేవి శ్రీ ప్రసాద్ అదిరిపోయే మాస్ బీట్ ఇచ్చాడు.
శ్రీమణి ఈ పాటకు లిరిక్స్ రాయగా దేవి శ్రీ ప్రసాద్ తమ్ముడు సాగర్, మమతా హుషారుగా పాడారు. హవీష్ ప్రొడక్షన్స్ – ఎ స్టూడియోస్ బ్యానర్స్ పై సత్యనారాయణ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
746897 393352Spot on with this write-up, I truly suppose this site needs a lot a lot more consideration. probably be once a lot more to learn way far more, thanks for that info. 179042
I enjoy reading your websites. Kudos! [url=http://dalf.cafe24.com/s_bbs/bbs/board.php?bo_table=boa_1&wr_id=3413]ribapak facilement accessible[/url]