దీపావళి కానుకగా విడుదలైన ‘ఖైదీ’ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ సూపర్ పాజిటివ్ మౌత్ టాక్ తెచ్చుకోవడంతో మొదటి వారం కలెక్షన్స్ దుమ్ములేపింది. 10 ఏళ్ళ జైలు శిక్ష తర్వాత తన కూతురుని కలుసుకోవాలనే టైంలో ఒక రాత్రి జరిగే కథే ఇది. మొదటి 6 రోజుల్లానే 7వ రోజు కూడా పెద్దగా డ్రాప్ కాకుండా మంచి కలెక్షన్స్ రాబట్టుకొని అధికారికంగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద లాభాల బాటలో అడుగుపెట్టింది.
సెకండ్ వీకెండ్ ఈ సినిమాకి మేజర్ ప్లస్ అవ్వనుంది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో మొదటి వారంలో ‘ఖైదీ’ సినిమా 4.91 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. ఆంధ్ర – తెలంగాణలో సుమారు 4.5 కోట్లకి ఈ సినిమాని కొనుగోలు చేశారు.
ఏరియాల వారీగా ‘ఖైదీ’ 7 రోజుల కలెక్షన్స్ వివరాలు..
నైజాం – 1.93 కోట్లు
సీడెడ్ – 81.1 లక్షలు
గుంటూరు – 31.3 లక్షలు
ఉత్తరాంధ్ర – 62.2 లక్షలు
తూర్పు గోదావరి – 33.8 లక్షలు
పశ్చిమ గోదావరి – 26.5 లక్షలు
కృష్ణా – 40.2 లక్షలు
నెల్లూరు – 21.9 లక్షలు
7 డేస్ మొత్తం షేర్ – 4.91 కోట్లు
