Lokesh Kanagaraj: ఖైదీ, విక్రమ్, లియో.. సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు లోకేశ్ కనగరాజ్. బలమైన కథ, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే అయన బలం. ఈ వరుసలో ఎల్ సీయు (లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్) పేరుతో సినిమాలు తీస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. ఈ క్రమంలో తన ఎల్ సీయు సిరీస్ పై కీలక అప్డేట్ ఇచ్చి మరింత హైప్ పెంచారు.
ఓ ఇంటర్వ్యూలో లోకేశ్ మాట్లాడుతూ.. ‘ ఎల్ సీయు వరుసలో సినిమాలు వరుసగా చేయబోతున్నా. వీటిలో పక్క ఎల్ సీయు సినిమా ఖైదీ-2 ఉంటుంది. స్టాండ్ అలోన్ క్యారెక్టర్ తో రోలెక్స్ సినిమా అనంతరం vikram-2 సినిమాతో దాదాపుగా ఎల్ సీయు సినిమాలు పూర్తవుతాయి ‘.
‘ విజయ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీ అవుతున్నారు. కానీ.. ఆయన ఒప్పుకుంటే లియో -2 ఉంటుంది ‘ అని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ అప్డేట్స్ సినీ అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.