నితిన్ రాబిన్ హుడ్ సినిమాలో హీరోయిన్ శ్రీలీల అన్నారు కానీ నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ చూస్తే అందరు కెతిక శర్మ అనుకోక తప్పదు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో వెంకీ కుడుముల డైరెక్షన్ లో తెరకెక్కిన రాబిన్ హుడ్ సినిమాలో నితిన్ హీరోగా నటించగా శ్రీలీల ఫిమేల్ లీడ్ గా నటించింది. సినిమాలో అది దా సర్ ప్రైజు సాంగ్ లో కెతిక స్పెషల్ పర్ఫార్మెన్స్ చేసింది. ఈంధ్యనే రిలీజైన ఈ సాంగ్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
ఐతే ఆదివారం జరిగిన రాబిన్ హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శ్రీలీల కన్నా కెతిక గ్లామర్ షో ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేసింది. ఇద్దరు హీరోయిన్స్ సినిమాలో ఉంటే ఈవెంట్ లో ఇద్దరు పక్కపక్కనే ఉంటారు. కానీ రాబిన్ హుడ్ ఈవెంట్ లో శ్రీలీల ఒక పక్క, కెతిక శర్మ మరోపక్క నిలబడ్డారు.
ఇక మైత్రి నిర్మాత రవి శంకర్ పుష్ప లో స్పెషల్ సాంగ్ ఉ అంటావా పాటకి ముందు కెతిక శర్మనే అనుకున్నామని చెప్పారు. ఆ సినిమాకు కుదరలేదు అందుకే రాబిన్ హుడ్ కి తీసుకున్నామని చెప్పారు. రాబిన్ హుడ్ సినిమాలో కెతిక శర్మ చేసిన అది దా సర్ ప్రైజు సాంగ్ ఇప్పటికే ట్రెండింగ్ లో ఉంది. సినిమాలో ఆ సాంగ్ ఎంత స్పెషల్ గా ఉంటుంది అన్నది చూడాలి. ఏది ఏవైనా రాబిన్ హుడ్ ఈవెంట్ లో గ్లామర్ మెరుపులతో కెతిక శర్మ ఆడియన్స్ మనసు కొల్లగొట్టిందని చెప్పడంలో సందేహం లేదు.