Switch to English

Kesineni Nani: కేశినేనికి టీడీపీ పొగ.! ఇంకా మంట పుట్టలేదంటున్న ఎంపీ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,472FansLike
57,764FollowersFollow

తెలుగుదేశం పార్టీలో ఎంపీ కేశినేని నాని వ్యవహారం చిత్ర విచిత్రంగా కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఆయన తెలుగుదేశం పార్టీలోనే వున్నారట. తెలుగుదేశం పార్టీ మారే ఆలోచన కూడా ఆయనకి లేదట. కానీ, తెలుగుదేశం పార్టీతో కలిసి వుండటంలేదు.

నియోజకవర్గ అభివృద్ధి కోసం స్థానిక ప్రజా ప్రతినిథులతో కలిసి పని చేస్తారట. స్థానిక ప్రజా ప్రతినిథులంటే ఎక్కువగా వైసీపీ నేతలే వున్నారు మరి.! 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిందే ముగ్గురు ఎంపీలు. అందులో కేశినేని నాని ఒకరు.

పార్టీకి సంబంధించి ఢిల్లీ స్థాయిలో కీలక పదవిని కేశినేని ఆశించారు, భంగపడ్డారు. అప్పటినుంచీ పార్టీ కార్యక్రమాల్లో అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో కేశినేని నాని కుమార్తె పోటీ చేస్తే, ఆమె గ్రూపుకి వ్యతిరేకంగా స్థానిక టీడీపీ నాయకత్వం పనిచేసిందన్న విమర్శలున్నాయి.

తాజాగా, టీడీపీ ఇన్‌ఛార్జిల నియామకం జరగడంపై కేశినేని నాని ఘాటు విమర్శలు చేశారు. ఇన్‌ఛార్జిల్ని గొట్టంగాళ్ళతో పోల్చిన కేశినేని నాని, ‘పార్టీ నాకు పొగ పెడుతోందని మీరే అంటున్నారు.. పొమ్మన లేక పొగ పెడుతున్న మాట నిజమే అయితే.. నాకూ మంట పుట్టాలి కదా. వేడి 46 నుంచి 48 డిగ్రీల మధ్యనే వుంది. 100 డిగ్రీలకు మండితే అప్పడు చూపిస్తా నేనేంటో..’ అంటూ కేశినేని నాని వ్యాఖ్యానించడం గమనార్హం.

‘పార్టీ నుంచి టిక్కెట్ దొరికితే సరే సరి. దొరక్కపోతే, ఇండిపెండెంట్‌గా అయినా పోటీ చేసి గెలవగల సత్తా నాకుంది.. అదే మాటకు కట్టుబడి వున్నాను. మళ్ళీ మళ్ళీ అదే మాట చెబుతున్నాను..’ అని కేశినేని ధీమా వ్యక్తం చేశారు.

కేశినేని వ్యాఖ్యలపై బెజవాడ తెలుగు తమ్ముళ్ళు గుస్సా అవుతున్నారు. బొండా ఉమ, బుద్ధా వెంకన్న తదితరులు కేశినేని నాని వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. కేశినేని నాని సోదరుడు చిన్ని కూడా అన్నకు రాజకీయంగా వెన్నుపోటు పొడిచేందుకు సిద్ధంగా వున్న సంగతి తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jithender Reddy: ‘జితేందర్ రెడ్డి’ నుంచి మంగ్లీ పాట.. “లచ్చిమక్క” విడుదల

Jithender Reddy: బాహుబలి, మిర్చి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె హీరోగా నటించిన సినిమా ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy). విరించి వర్మ...

Chiranjeevi: CCTలో 100వసారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ.. అభినందించిన చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 26ఏళ్ల క్రితం (1998 అక్టోబర్ 2) ప్రారంభించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో నేడు అద్భుతమే జరిగింది. ‘రక్తదానం చేయండి.. ప్రజల ప్రాణాలు...

Nara Rohit: నారా రోహిత్ @20 ‘సుందరకాండ’.. ఫస్ట్ లుక్, రిలీజ్...

Nara Rohit: నారా రోహిత్ (Nara Rohit) హీరోగా నటిస్తున్న 20వ సినిమా ‘సుందరకాండ’. శ్రీరామనవమి పండగ సందర్భంగా చిత్ర బృందం టైటిల్ రివీల్ చేస్తూ...

Kannappa: ‘కన్నప్ప’లో బాలీవుడ్ స్టార్ హీరో.. స్వాగతం పలికిన టీమ్

Kannappa: మంచు విష్ణు (Manchu Vishnu) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘కన్నప్ప’ (Kannappa). విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న సినిమాకు ముఖేశ్ కుమార్...

Jr.Ntr: ఎన్టీఆర్ తో ఊర్వశి రౌతేలా సెల్ఫీ..! సారీ చెప్పిన నటి.....

Jr.Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr.Ntr) బాలీవుడ్ (Bollywood) లోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ తో కలిసి వార్-2 (War 2)...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

బి-ఫామ్స్ అందిస్తూ.. ప్రమాణం చేయించిన పవన్ కళ్యాణ్.!

రాజకీయాల్లో ఇదొక కొత్త ఒరవడి.. అనడం అతిశయోక్తి కాదేమో.! జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఇద్దరు లోక్ సభ అభ్యర్థులకు (తనతో కలుపుకుని) జనసేన అధినేత...

అవినాష్ వర్సెస్ సునీత.! కడపలో వైసీపీ ఖేల్ ఖతం.!

సీబీఐ ఛార్జిషీట్‌లో పేర్కొన్న అంశాల్నే ప్రస్తావిస్తున్నారు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి.! 2019 ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగితే, సీబీఐ విచారణ కోసం...

ఎక్కువ చదివినవి

Love Guru: ‘లవ్ గురు’ చూడండి.. ఫ్యామిలీ ట్రిప్ వెళ్లండి..! చిత్ర యూనిట్ ఆఫర్

Love Guru: విజయ్ ఆంటోనీ (Vijay Anthony)- మృణాళిని రవి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన "లవ్ గురు" (Love Guru) సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రేక్షకులకు బంపర్...

Chiranjeevi: CCTలో 100వసారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ.. అభినందించిన చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 26ఏళ్ల క్రితం (1998 అక్టోబర్ 2) ప్రారంభించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో నేడు అద్భుతమే జరిగింది. ‘రక్తదానం చేయండి.. ప్రజల ప్రాణాలు నిలపండి..’ అని నాడు చిరంజీవి ఇచ్చిన...

Chandrababu: చంద్రబాబుపై రాళ్ల దాడి.. గాజువాకలో గందరగోళం

Chandrababu Naidu: ఎన్నికల నేపథ్యంలో గాజువాకలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu Naidu) చేపట్టిన ప్రజాగళం సభలో కలకలం రేగింది.  చంద్రబాబు ప్రసంగిస్తూండగా అగంతకులు కొందరు ఆయనపై రాళ్లు విసిరారు. దీంతో...

పవన్ కళ్యాణ్ పై రాయితో దాడి

ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన 'వారాహి' యాత్రలో స్వల్ప అపశృతి చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా తెనాలిలో పవన్ ప్రసంగిస్తుండగా.. గుర్తుతెలియని దుండగుడు ఆయనపై రాయి విసిరాడు. రాయి...

‘గులక రాయి’ ఘటనలో సమాచారమిస్తే రెండు లక్షల బహుమతి.!

ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ, రెండు లక్షల రూపాయల నజరానా ప్రకటించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరంలో జరిగిన దాడికి సంబంధించి సరైన సమాచారం ఇచ్చినవారికి ఈ...