ఎం.ఎం. కీరవాణి మ్యూజిక్ కంపోజ్ చేశాడంటే పాటలు ఎంత వినసొంపుగా ఉంటాయనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పాన్ ఇండియా సినిమాలకు మ్యూజిక్ రూపొందిస్తున్న ఆయన.. ఇప్పుడు పవన్ కల్యాణ్ కోసం అడగకపోయినా ఓ అద్భుమైన మ్యూజిక్ ను కంపోజ్ చేశాడు. అయితే అది కేవలం పవన్ కల్యాణ్ కోసమే కాదు.. సంగీతాన్ని ఆదరించే ప్రతి ఒక్కరికి అది నచ్చుతుందని చెప్పుకోవాలి. ఇప్పుడు తిరుపతి లడ్డూ కల్తీ జరిగిందని.. దానికి ప్రాయశ్చిత్త దీక్షను పవన్ కల్యాణ్ చేపట్టిన సంగతి తెలిసిందే కదా. అయితే
అయితే జనసేనానికి మద్దతుగా జనసేన పార్టీ కార్యకర్తలు, వీర మహిళలు యజ్ఞాలు, హోమాలు, భజనలు చేస్తున్నారు. వారంతా కూడా ఓం నమో నారాయణాయ మంత్రాన్ని పఠిస్తున్నారు. అయితే ఈ నారాయణాయ మంత్రాన్ని సంగీత దర్శకుడు కీరవాణి ఆడియో రికార్డు చేశాడు. ఈ ఆడియో చాలా వినసొంపుగా ఉంది. దీనిపై పవన్ కల్యాణ్ చాలా స్పెషల్ గా ఓ లేఖ విడుదల చేశాడు. కీరవాణికి చాలా స్పెషల్ థాంక్స్ అంటూ తెలిపాడు. తమకు మద్దతుగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలిపాడు. తిరుపతి లడ్డూ కల్తీ జరిగిందనే విషయం ప్రతి ఒక్క హిందువుల మనోభావాలను దెబ్బ తీసిందని వివరించారు పవన్.
వారందరిలో భక్తి భావాలను పెంచే దిశగా తాము చేస్తున్న దీక్షలకు ఇలా ఆడియో రికార్డు చేయడం చాలా బాగుందని తెలిపాడు పవన్ కల్యాణ్. ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుందని.. ఇందులో మనమంతా కలిసికట్టుగా ముందుకు వెళ్లడం చాలా అవసరం అంటూ కీరవాణికి మరోసారి థాంక్స్ చెప్పాడు.
ధర్మో రక్షతి రక్షితః
धर्मो रक्षति रक्षितः pic.twitter.com/Obv6m2wvbw
— Pawan Kalyan (@PawanKalyan) September 28, 2024