Keeravani: తెలుగువారికి ఆస్కార్ కలను నిజం చేసాడు ఎంఎం కీరవాణి. ఆర్ ఆర్ ఆర్ లోని నాటు నాటు సాంగ్ కు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ వరించిన విషయం తెల్సిందే. ఇక కీరవాణి తన ఆస్కార్ విన్నింగ్ స్పీచ్ అందరినీ ఆశ్చర్యపరిచింది.
తాను చిన్నప్పటి నుండి కార్పెంటర్ మ్యూజిక్ ను వింటూ పెరిగానని, ఆయన కంపోజ్ చేసిన ఆల్బమ్ “ఆన్ టాప్ ఆఫ్ ది వరల్డ్” ను తనదైన స్టైల్ లో మార్చి ఆలపించాడు. దీనికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
ఇప్పుడు స్వయంగా రిచర్డ్ కార్పెంటర్, ఎంఎం కీరవాణికి, రచయిత చంద్రబోస్ కు తనదైన శైలిలో శుభాకాంక్షలు తెలిపాడు. తన కుటుంబంతో కలిసి ఒక రీజిగ్ వెర్షన్ ను కంపోజ్ చేసిన రీల్ ను పోస్ట్ చేసాడు. ఇది తనను ఎమోషనల్ చేసిందని, ధన్యవాదాలని తెలిపాడు కీరవాణి.