దిగ్గజ సంగీత దర్శకులు ఒక పాట కోసం కలిశారు. మ్యూజికల్ మ్యాస్ట్రో అయిన ఇళయరాజా సంగీతంలో ఆస్కార్ అవార్డు విన్నర్ కీరవాణి ఓ పాటను రాశారు. బహుషా పెద్ద సినిమాలకు కూడా ఇలాంటి కలయిక సాధ్యం కాలేదు. కానీ రూపేష్, ఆకాంక్ష సింగ్ జంటగా వస్తున్న షష్టిపూర్తి సినిమాకు ఇది సాధ్యం అయింది. రాజేంద్ర ప్రసాద్, అర్చన ఇందులో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. పవన్ ప్రభ దర్శకుడిగా వస్తున్న ఈ సినిమాను ఆయి ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాలో ‘ఏదో ఏ జన్మలోదో’ అంటూ సాగే పాటను కీరవాణి రాయగా.. దాన్ని ఇళయరాజా అద్భుతంగా మలిచారు. ఈ పాటను రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా మూవీ డైరెక్టర్ పవన్ ప్రభ మాట్లాడుతూ ఈ పాట రెగ్యులర్ ట్రాక్ లో ఉండదని.. అందుకే కీరవాణి గారు దీన్ని కాస్త చమత్కారంగా అర్థవంతంగా రాశారని చెప్పారు. ఆయన రాస్తే అందరికీ అర్థమయ్యేలా ఉంటుందని తెలిపారు. కీరవాణి రాసిన మొదటి పాట ఇదేనని.. ఈ పాట అద్భుతంగా వచ్చిందని చెప్పుకొచ్చారు. రాజేంద్ర ప్రసాద్ లాంటి దిగ్గజ నటులు ఉండటం వల్ల సినిమాకు మంచి వెయిల్ పెరిగిందన్నారు. ఈ సినిమా మనిషి జీవితంలో రెగ్యులర్ గా జరిగే సంఘటనలు, పరిస్థితుల అనుగుణంగా ఉంటుందన్నారు. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే కూడా పవన్ ప్రభనే అందిస్తున్నారు.