రాయలసీమ లిఫ్ట్.. ఆర్డీఎస్ కుడి కాలువ నిర్మాణాలతో ఆంధ్రపదేశ్ రాష్ట్రానికి అదనంగా ఒరిగేదేంటి.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి. ఇది కేవలం కాంట్రాక్టర్ల జేబు నింపే వ్యవహారం తప్ప, వీటి వల్ల ఆంధ్రపదేశ్ రాష్ట్రానికి అస్సలేమాత్రం లాభం లేదని విపక్షాలు గగ్గోలు పెడుతున్న విషయం విదితమే.
ఏపీలో రాజకీయం ఇలా వుంటే, తెలంగాణ ప్రభుత్వం అత్యంత వ్యూహాత్మకంగా కృష్ణా నది మీద, శ్రీశైలం డ్యామ్ ఎగువన తెలంగాణలో ఓ ‘ఆనకట్ట’ నిర్మించబోతోంది. జూరాల ప్రాజెక్టుకీ, శ్రీశైలం ప్రాజెక్టుకీ మధ్యలో ఈ ఆనకట్ట నిర్మించబోతున్నారు కృష్ణా నది మీద. ఈ విషయాన్ని నిన్నటి తెలంగాణ క్యాబినెట్ తేటతెల్లం చేసింది.
తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఈ తరహా ప్రాజెక్టుల్ని నిర్మించడంలో ఎంత వేగం చూపిస్తుందో చెప్పడానికి కాళేశ్వరం ప్రాజెక్టు ప్రత్యక్ష నిదర్శనం. నిజానికి, కాళేశ్వరం ప్రాజెక్టుపైనే ఆంధ్రపదేశ్ రాష్ట్రానికి చాలా అభ్యంతరాలున్నాయి. కానీ, ఆ ప్రాజెక్టు పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభ్యంతరం చెప్పలేదు సరికదా.. తెలంగాణ ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకు, కాళేశ్వరం ప్రాజెక్టుని సందర్శించారు.. కూడా. ఇక, ఇప్పుడు ఏం జరగబోతోంది.?
55 నుంచి 65 టీఎంసీల సామర్థ్యంతో శ్రీశైలం ప్రాజెక్టు ఎగువన కృష్ణా నదిపై తెలంగాణ ప్రభుత్వం ‘ఆనకట్ట’ కడితే, ఆంధ్రపదేశ్ భవిష్యత్తు ఏమవుతుంది.? చిత్రమేంటంటే, తెలంగాణలో ఆంధ్రపదేశ్ రాష్ట్రం అభ్యంతరం తెలుపుతున్నా ప్రాజెక్టులు నిర్మితమవుతూనే వున్నాయి.. ఎలాంటి ఆటంకాలూ లేకుండా. కానీ, ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం మాత్రం పూర్తవడంలేదు. ఇది ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాల వైఫల్యమా.? ప్రభుత్వాల్ని నడుపుతున్న రాజకీయ పార్టీలకు రాష్ట్రం పట్ల శ్రద్ధ లేకపోవడం వల్లే ఇదంతా జరుగుతోందా.?
ఒక్కటి మాత్రం నిజం.. ఆంధ్రపదేశ్ ప్రతిసారీ నష్టపోతోంది. అధికారంలో ఎవరున్నా.. అంతిమంగా ఆంధ్రపదేశ్ తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. పాలకులు మాత్రం పబ్లిసిటీ స్టంట్స్ చేయడానికే పరిమితమవుతున్నారు.
806614 262338Wonderful blog, Im going to spend more time reading about this subject 755632
971467 973149oh effectively, Alicia silverstone is matured nowadays but when she was nonetheless younger, she may be the sex symbol of hollywood` 673407
392540 543434The next time I just read a weblog, I truly hope which it doesnt disappoint me up to this 1. Get real, Yes, it was my choice to read, but I personally thought youd have something interesting to convey. All I hear can be a handful of whining about something you could fix within the event you werent too busy trying to locate attention. 119925
507893 542717I believe 1 of your commercials caused my internet browser to resize, you might properly want to put that on your blacklist. 509661
129233 818117I really like your writing style, very good data, appreciate it for posting : D. 443453
379962 261799Hey there! Nice stuff, please maintain us posted when you post once again something like that! 565283