Switch to English

కేంద్రంతో అమీ తుమీ.. తగ్గేదే లేదంటున్న కేసీఆర్‌

ప్రధాన మంత్రిని ఎలా గౌరవించాలో.. అదే ప్రధాన మంత్రిని ఎలా ప్రశ్నించాలో బాగా తెలుసు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకి. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఆయన సొంతం. తెలంగాణ ఉద్యమాన్ని నడపడమే కాదు, విజయ తీరాలకు చేర్చిన ఘనుడాయన. ఉద్యమంలో కేంద్రాన్ని నిలదీశారు.. అదే సమయంలో కేంద్రాన్ని దార్లోకి తెచ్చుకున్నారు. ఆ నేర్పరితనం ఆయన సొంతం. ఇప్పుడూ కేసీఆర్‌, అదే తరహా రాజకీయ వ్యూహాన్ని అమలు చేస్తున్నారు.

అయితే, అప్పుడు ప్రధానిగా మన్మోహన్‌సింగ్‌ వున్నారు. ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రధాని. అప్పటికీ ఇప్పటికీ చాలా తేడా. కేసీఆర్‌ పప్పులు కేంద్రం వద్ద ఉడికే పరిస్థితి వుందా.? అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. కరోనా వైరస్‌ నేపథ్యంలో కేంద్రానికి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తున్నారు కేసీఆర్‌. అదే సమయంలో, కేంద్రాన్ని నిలదీస్తున్నారు కూడా.

రాష్ట్రాలకు ఆర్థిక స్వేచ్చ కల్పించకపోతే రానున్న రోజుల్లో దేశం ఇబ్బందుల్లో పడుతుందని కేసీఆర్‌ పదే పదే చెబుతున్నారు. ‘ఈ విషయాన్ని మీరు ప్రత్యేకంగా ప్రస్తావించాలి.. ఇది కేంద్రం దృష్టికి వెళ్ళాలి..’ అంటూ నేషనల్‌ మీడియాని ఉద్దేశించి చెబుతున్న కేసీఆర్‌, కేంద్రానికి తాను చెప్పదలచుకున్నది అరటిపండు తొక్క ఒలిచి పెట్టినట్లుగానే చెప్పేస్తున్నారు.

‘హెలికాప్టర్‌ మనీ కాకపోతే.. ఎయిర్‌ క్రాఫ్ట్‌ మనీ అని పేరు పెట్టండి.. కానీ, ప్రజల్ని ఆదుకోండి..’ అన్నది కేసీఆర్‌ సూచన. అయితే, కేంద్రం ఈ విషయంలో సానుకూలంగా స్పందించడంలేదు. కరోనా వైరస్‌ నేపథ్యంలో దేశంలో ఆర్థిక పరిస్థితి అత్యంత అధ్వాన్నంగా తయారైంది. రాష్ట్రాలు కుదేలవుతున్నాయి. రాష్ట్రాలు ఆర్థికంగా కుదురుకోవాలంటే, అది కేంద్రం కల్పించే వెసులుబాట్లతోనే సాధ్యమవుతుందన్నది కేసీఆర్‌ వాదన.

‘మీరు ఇవ్వరు, మేం అప్పు తెచ్చుకునే పరిస్థితీ కల్పించరు. ఇలాగైతే ఎలా.?’ అన్ని నిన్న కేసీఆర్‌ ఒకింత ఘాటుగా ప్రశ్నించారు. ‘కేంద్రం తప్పులు చేస్తోంది.. అది దేశానికి ప్రమాదకరంగా మారబోతోంది..’ అంటూ కేసీఆర్‌ తన మనసులో భావాల్ని స్పష్టం చేసేశారు. మొత్తంగా చూస్తే, మోడీని కరోనా విషయంలో సమర్థిస్తూనే, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో, దేశ ప్రయోజనాల విషయంలో కేంద్రంతో అమీ తుమీకి కేసీఆర్‌ సిద్ధమవుతున్నారన్నమాట.

సినిమా

ప్రభాస్ మూవీతో తెలుగులో ఏఆర్ రెహమాన్ రీ ఎంట్రీ.!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాతో ఏఆర్ రెహమాన్ రీ ఎంట్రీ ఏంటి, ఎప్పటికప్పుడు ఆయన పాటలు తెలుగులో వింటూనే ఉన్నాం కదా అని ఆలోచిస్తున్నారా.?...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా...

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

రాజకీయం

హైకోర్టుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు.. 49 మందికి నోటీసులు!

డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారం... వంటి విషయాలపై న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన దరిమిలా, అధికార పార్టీకి చెందిన నేతలు న్యాయస్థానం తీర్పుపై అసహనం వ్యక్తం...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది సినీ-టీవీ కార్మికులు రోడ్డున...

2021కి పోలవరం.. పోతిరెడ్డిపాడుతో ఎవరికీ నష్టం లేదు.. సీఎం జగన్

అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఎక్కువగా కట్టడం వల్ల రాష్ట్రానికి నీరు అందని పరిస్థితి ఉందని.. ఈ సమయంలో రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై వివాదాలు సృష్టించడం తగదని ఏపీ సీఎం జగన్ మోహన్...

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

ఎక్కువ చదివినవి

వైసీపీ పైత్యం: హైకోర్టుకీ దురుద్దేశాలు ఆపాదిస్తారా.?

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం గడచిన ఏడాది కాలంలో 60 సార్లకు పైగా న్యాయస్థానాల నుంచి మొట్టికాయలేయించుకోవడాన్ని వైసీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. పరిపాలన అన్నాక ఇలాంటివి సహజమే. ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలకు న్యాయస్థానాలు చీవాట్లు...

మరో విషాదం: ది గ్రేట్ మిమిక్రీ ఆర్టిస్ట్ హరి కిషన్ ఇకలేరు.!

అలనాటి తెలుగు హీరోలు ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబుల నుంచి చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లతో పాటు నేటి తరం హీరోలైన ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్...

బాలీవుడ్ సూపర్ స్టార్ తో పూరి జగన్నాథ్?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తో డేరింగ్ అండ్ డాషింగ్ దర్శకుడు పూరి జగన్నాథ్ సినిమా చేసే అవకాశాలు ఉన్నాయా అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. జెట్ స్పీడ్ లో...

ఇన్‌సైడ్‌ స్టోరీ: తెలంగాణలో కరోనా టెస్టులు పెరగాల్సిందే.!

దేశంలోని ప్రముఖ నగరాల్లో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. వాటన్నిటితో పోల్చి చూస్తే, హైద్రాబాద్‌ పరిస్థితి కాస్త బెటర్‌. తెలంగాణలో గ్రేటర్‌ హైద్రాబాద్‌ పరిధిలోనే ఎక్కువగా కరోనా పాజిటివ్‌ కేసులు వెలుగు చూస్తున్నాయి. మిగతా...

బిగ్‌ బ్రేకింగ్‌: ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ ఎత్తివేత

టీడీపీ హయాంలో ఇంటెలిజెన్స్‌ హెడ్‌గా బాధ్యతలు నిర్వహించిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకి హైకోర్టు ఊరటనిచ్చింది. వైసీపీ రాజకీయ ఆరోపణల నేపథ్యంలో ఎన్నికల సమయంలోనే ఏబీ వెంకటేశ్వరరావుని కేంద్ర ఎన్నికల సంఘం...