Switch to English

కేసీయార్ స్వయంకృతాపరాధం.! డ్యామిట్.. కథ అడ్డం తిరిగింది.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,560FansLike
57,764FollowersFollow

రాజకీయాల్లో హత్యలుండవ్.. ఆత్మహత్యలే.. అని తలపండిన రాజకీయ నాయకులు చెబుతుంటారు.! తెలంగాణలో గులాబీ పార్టీకి ఇప్పుడు అదే పరిస్థితి వచ్చింది. ఒక్క ఎన్నికల్లో ఓడిపోతే, గులాబీ పార్టీ కాలగర్భంలో కలిసిపోతుందని ఎలా అనుకోగలం.? కానీ, రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే సుమీ.!

రాజకీయాలంటేనే అంత.! భారత్ రాష్ట్ర సమితిగా మారిన తెలంగాణ రాష్ట్ర సమితికి.. ఇది ఊహించని దెబ్బ.! పార్టీ నుంచి తెలంగాణ పేరుని కేసీయార్ తొలగించడంతో, తెలంగాణ సమాజం కూడా పునరాలోచనలో పడింది. ‘తెలంగాణ’కి పేటెంట్ గులాబీ పార్టీ కాదేమోనన్న అనుమానాల్ని జనంలోనే కలగజేశారు కేసీయార్.

ఎన్నికల ప్రచారం సందర్భంగా, బహిరంగ సభల్లో అల్లరి చేస్తోన్న కొందర్ని ఉద్దేశించి అసహనానికి గురవడం, అంతకు ముందు అభ్యర్థుల్ని ప్రకటించే క్రమంలో చేసిన అతి.. ఇలా చెప్పుకుంటూ పోతే, ఒకటా.? రెండా.? కర్ణుడి చావుకి ఎన్ని కారణాలున్నాయోగానీ.. దాదాపు అన్ని కారణాలున్నాయి గులాబీ పార్టీ ఓటమికి.

మరీ దారుణమైన ఓటమేమీ కాదు.! అయితే, కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఫోకస్ పెడితే, త్వరలో జరిగే పార్లమెంటు ఎన్నికల నాటికి, తెలంగాణలో గులాబీ పార్టీ మొత్తం ఖాళీ అయిపోవచ్చు. కేసీయార్ నేర్పిన పార్టీ ఫిరాయింపుల అస్త్రాన్ని కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తే.. ఇంకేమన్నా వుందా.?

లిక్కర్ కేసులో కవిత ఆరోపణలు ఎదుర్కోవడం, ఆంధ్రప్రదేశ్ మీద కేటీయార్, కేసీయార్ వెటకారాలు, వైఎస్ జగన్‌తో గులాబీ పార్టీ సఖ్యత.. వెనక్కి తిరిగి చూసుకుంటే, కేసీయార్‌కి ఈ విషయాలన్నీ ఘోర తప్పిదాలుగానే కనిపిస్తాయ్.! జగన్ సన్నిహితుడైన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడమేంటి.? వైఎస్సార్ తెలంగాణ పార్టీని తెలంగాణ ఎన్నికల బరిలోంచి వైఎస్ షర్మిల తప్పించడమేంటి.? ఇవన్నీ సరిగ్గా చూసుకోవద్దూ.!

పరీక్ష పేపర్ల లీక్ దగ్గర్నుంచి, ఇంటర్ పరీక్షా పత్రాల విషయంలో గలాటా వరకూ.. ఇవన్నీ పాలనా వైఫల్యాలే. ఇవన్నీ స్వయంకృతాపరాధాలే.! తీర్పు, గూబ గుయ్యిమనేట్టు.! గులాబీ పార్టీ ఇప్పట్లో కోలుకోవడం కష్టమే.! కాంగ్రెస్ కూడా స్వీయ తప్పిదాలకు పాల్పడి, గులాబీ పార్టీకి ఊపిరి పోస్తుందా.? వేచి చూడాలిక.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Krishna Vamsi: ప్రముఖ నటితో ‘రాఖీ’లాంటి సినిమా తీస్తా: కృష్ణవంశీ

Krishna Vamsi: జూనియర్ ఎన్టీఆర్ (Jr Ntr) హీరోగా కృష్ణవంశీ (Krishna Vamsi) దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘రాఖీ’. అదే తరహాలో మరో సినిమాకు శ్రీకారం...

Bollywood: బంగారపు కేక్ రూ.3కోట్లు.. బర్త్ డేకి కట్ చేసిన నటి.....

Urvashirautela: గతేడాది మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ‘వాల్తేరు వీరయ్య’లో బాలీవుడ్ (Bollywood) భామ ఊర్వశి రౌతేలా (Urvashirautela) బాసూ వేరీజ్ ది పార్టీ.. అంటూ సందడి...

Mohan Babu: ‘నా పేరు వాడితే చర్యలు తప్పవు’.. మోహన్ బాబు...

Mohan Babu: ‘ఇటివల కొందరు నా పేరు రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారు. అటువంటి చర్యలను ఇకపై ఉపేక్షించను. న్యాయపరమైన చర్యలు తీసుకంటా’నని నటుడు, నిర్మాత మంచు మోహన్...

Kalki: ‘కల్కి 2898 AD’ టైటిల్ అందుకే పెట్టాం.. నాగ్ అశ్విన్...

Kalki: ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘కల్కి 2898 ఏడీ’ (Kalki: 2898 AD). సైన్స్, ఫిక్షన్...

Teja Sajja : తేజా సజ్జా తదుపరి సినిమా ఏంటో…?

Teja Sajja : యంగ్‌ హీరో తేజ సజ్జా బ్యాక్ టు బ్యాక్ మంచి కమర్షియల్‌ హిట్స్ అందుకుంటూ కెరీర్‌ లో దూసుకు పోతున్నాడు. బాల...

రాజకీయం

Janasena: ఇంకో పదిహేను సీట్లు జనసేనకి.. సాధ్యాసాధ్యాలు ఏంటి.?

జనసేన పార్టీకి పొత్తులో భాగంగా టీడీపీ కేటాయించిన సీట్లు ఏమాత్రం సరిపోవన్నది అంతటా వినిపిస్తున్నమాట. వైసీపీ ఎగతాళి చేస్తుండడం, టీడీపీ తెరవెనుక వికటాట్టహాసం.. ఇవన్నీ పక్కన పెడితే, జనసేన శ్రేణులు అయితే అస్సలేమాత్రం...

TDP: టీడీపీ సొంతంగా అధికారంలోకి వస్తుందా.?

‘గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరి సహకారం లేకుండా, అన్నీ గెలిచాం.. వైసీపీని ఓడించగలిగాం.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 151 సీట్లలోనూ గెలిచి తీరతాం.. కనీసం 120 సీట్లలో గెలుస్తాం.. జనసేన మద్దతు అవసరమే...

ఆ నాలుగు నియోజకవర్గాలు.! జనసైనికుల ఆవేదనలు.!

మహా సేన రాజేష్‌కి టీడీపీ నుంచి టిక్కెట్ దక్కినప్పుడు.. కళ్యాణ్ దిలీప్ సుంకరకి ఎందుకు టిక్కెట్ జనసేన నుంచి దక్కలేదు.? ఈ ప్రశ్న సోషల్ మీడియా వేదికగా జనసైనికుల నుంచి వస్తోంది. కొత్తపేట,...

PM Modi: ‘ద్వారక’ను వీక్షించిన ప్రధాని మోదీ.. సముద్రంలో స్కూబా డైవింగ్

PM Modi: నెలల వ్యవధిలోనే ప్రధాని మోదీ (PM Modi) అరేబియా సముద్రంలో స్కూబా డైవింగ్ చేశారు. ఈసారి శ్రీకృష్ణుడు పరిపాలించాడని హిందువులు బలంగా విశ్వసించే ‘ద్వారక’ (Dwaraka) నగరాన్ని వీక్షించారు. అవసరమైన...

అవమానాల్ని దాటుకుని.. జనసేన భవిష్యత్ ప్రయాణమెలా.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి బలం అభిమానులు.. బలహీనత కూడా అభిమానులే.! ఫలానా వ్యక్తిని పార్టీలోకి తీసుకుంటే తప్పు.! ఫలానా వ్యక్తి పార్టీలోంచి వెళ్ళిపోతే తప్పు.! ఫలానా రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకుంటే...

ఎక్కువ చదివినవి

Janasenani: జీరో బడ్జెట్ రాజకీయం.! మారిన జనసేనాని స్వరం.!

‘మనం అందమైన అబద్ధంలో బతుకుతున్నాం. జీరో బడ్జెట్ రాజకీయం అంటే కుదరడంలేదిక్కడ. ఇంకో ఐదేళ్ళకో, పదేళ్ళకో అయినా మార్పు రావాలని ఆశిద్దాం. కార్యకర్తలకు భోజనాలైనా సరిగ్గా పెట్టాలి కదా. ఎన్నికల కమిషన్ నిబంధనల...

పవన్ కళ్యాణ్‌కి భీమవరంలో ఎంత మెజార్టీ వస్తుంది.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, భీమవరం నియోజకవర్గం నుంచి పోటీ చేయడం దాదాపుగా ఖాయమైపోయింది. అధికారిక ప్రకటన రావడమే తరువాయి. త్వరలోనే ఇంకోసారి భీమవరంలో జనసేనాని పర్యటించే అవకాశాలున్నాయి. ఇటీవల భీమవరంలో పర్యటించినప్పుడు, జనసేన...

Hanu-Man: ‘హను-మాన్’ వండర్.. ఆ ఘనత సాధించిన 2వ సినిమాగా రికార్డు

Hanu-Man: 'సంక్రాంతికి చిన్న సినిమాగా విడుదలై భారీ విజయం సాధించిన ‘హను-మాన్’ ఇంకా ధియేటర్ల వద్ద సందడి చేస్తోంది. పోటీలో పెద్ద సినిమాలు ఉన్నా కూడా కంటెంట్ పై నమ్మకంతో సంక్రాంతి సీజన్...

YS Sharmila: వైఎస్ షర్మిల అరెస్ట్.! ఈసారి ‘షో’ ఆంధ్ర ప్రదేశ్‌‌లో.!

తెలంగాణలో వైఎస్ షర్మిల అరెస్టయ్యారు.. ఒకసారి కాదు, పలుమార్లు అరెస్టయ్యారు.! కొన్ని సందర్భాల్లో కుమార్తె కోసం వైఎస్ విజయమ్మ మీడియా ముందుకొచ్చారు. తెలంగాణ పోలీసులపై గుస్సా అయ్యారు. కుమార్తె షర్మిలకు మద్దతుగా ఆందోళన...

Dadasaheb Phalke awards: అట్టహాసంగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్-2024

Dadasaheb Phalke awards: భారతదేశ సినీ పరిశ్రమలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘దాదాసాహెబ్ ఫాల్కే’ (Dadasaheb Phalke awards) అవార్డుల కార్యక్రమం 2024కు సంబంధించిన వేడుక అట్టహాసంగా ముంబైలో జరిగింది. మంగళవారం రాత్రి జరిగిన...