Switch to English

‘సర్కారు సాగు’ సమంజసమేనా?

తాను బతికున్నంత వరకు రైతుబంధు సాయం ఆగదని పలుమార్లు కుండ బద్దలు కొట్టిన తెలంగాణ సీఎం కేసీఆర్.. తాజాగా సాగుకు సంబంధించిన విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎవరు ఏది పడితే అది పండించే పద్ధతి పోవాలని, మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలే పండించాలని స్పష్టంచేస్తున్నారు.

రైతులు ఏయే ప్రాంతాల్లో ఎంత మేర ఏ పంటలు పండించాలో ప్రభుత్వమే చెబుతుందని, ఈ ప్రకారమే రైతన్నలు నడుచుకోవాలని పేర్కొన్నారు. సర్కారు చెప్పిన పంటలు పండించిన రైతులకే రైతుబంధు సాయం అందుతుందని, వారి పంటలే మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని ప్రకటించారు. దీంతో ఈ నియంత్రిత సాగుపై చర్చ మొదలైంది. ఇది కరెక్టా, కాదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

సరైన ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే ఇది మంచిదే అని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. రైతులు ఇప్పటివరకు కొన్ని అంచనాలు, పరిస్థితుల ఆధారంగా పంటలు పండిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కోసారి ఎక్కువ మంది ఒకే పంట పడించడం వల్ల మార్కెట్లోకి అది ఎక్కువ రావడంతో ధర తగ్గుతోంది. అదే సమయంలో మరికొన్ని పంటలు అవసరానికన్నా తక్కువ పండిస్తుండటంతో వాటి ధర పెరుగుతోంది. ఒక్కోసారి కిలో టమాటాకి రూపాయి కూడా ధర రాదు. అదే ఒక్కోసారి మాత్రం ఏకంగా రూ.50 పెట్టాల్సిన పరిస్థితి. ఉల్లి విషయంలోనూ ఇలాంటి పరిస్థితే కనిపిస్తుంది.

ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని రైతులందరినీ ఏకతాటిపైకి తెచ్చి, ఎవరు ఏ పంట పండించాలో నిర్ణయిస్తే.. ఎవరూ నష్టపోయే అవకాశం ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే, ఇది అంత ఆషామాషీ కాదని.. దీనిని అమల్లోకి తెచ్చే ముందు పెద్ద కసరత్తు చేయాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. తొలుత రాష్ట్ర ఆహార అవసరాలు ఏమిటి అనే విషయాన్ని పక్కాగా లెక్కించడంతోపాటు ఎగుమతులు, భవిష్యత్తు అవసరాలకు తగిన నిల్వలు ఉండేలా చూసుకుని ఆ మేరకు ఏయే పంటలు ఎంత పండించాలో నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. అనంతరం ఆ మేరకు కార్యాచరణ రూపొందించుకుని, రైతులకు అవగాహన కల్పించి ముందుకు సాగాలి.

దీంతో ఏ పంట ఎంత అవసరమో అంతే పండించే వీలు కలుగుతుంది. తద్వారా ధరలు కూడా స్థిరంగా ఉంటాయి. అటు రైతులతోపాటు ఇటు ప్రభుత్వం, ప్రజలు కూడా నష్టపోయే అవకాశం ఉండదని వ్యవసాయరంగ నిపుణులు చెబుతున్నారు. ఈ విషయంలో తెలంగాణ ఇప్పటికే సర్వే కూడా పూర్తి చేసింది. రాష్ట్రంలో 77 శాతం మంది ఆహారం బియ్యమే అని తేల్చింది. ఈ నేపథ్యంలో ఈ వర్షాకాలం సీజన్ లో 50 లక్షల ఎకరాల్లో వరి, మరో 50 లక్షల ఎకరాల్లో పత్తి పండించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విధానం విజయవంతమైతే మిగిలిన రాష్ట్రాలు ఇదే పద్ధతి అనుసరించే అవకాశం ఉంది.

సినిమా

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

రాజకీయం

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

లబ్ధిదారుల ఎంపికలో చెప్పేదొకటి.. జరుగుతోంది మరొకటి

‘‘ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అవకతవలకు ఆస్కారమివ్వం. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి పారదర్శకంగా జరుగుతుంది. వాలంటీర్లే నిబంధనల ప్రకారం అర్హులను ఎంపిక చేస్తారు. నాకు ఓటేయనివారికి కూడా మా ప్రభుత్వ...

ఏపీలో బలవంతపు మత మార్పిడులపై ఏకిపారేసిన నేషనల్ మీడియా

రఘురామకృష్ణంరాజు.. భారతీయ జనతా పార్టీ సానుభూతిపరుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ. ఇంగ్లీషు మీడియం విషయంలోనూ, ఇతరత్రా అనేక విషయాల్లోనూ అధికార పార్టీకి కొరకరాని కొయ్యిలా తయారయ్యారు ఈ ఎంపీ. నిజానికి, రఘురామకృష్ణంరాజు...

కేసీఆర్‌పై పోరాటంలో జనసేనాని, బీజేపీతో కలిసొస్తారా.?

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి వ్యతిరేకంగా నినదిస్తారా.? అదే జరిగితే, పవన్‌ కళ్యాణ్‌ సినిమాల పరిస్థితి తెలంగాణలో ఏమవుతుంది.? ఈ చర్చ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ...

ఎక్కువ చదివినవి

క్రైమ్ న్యూస్: భార్యను చంపేందుకు ఆ భర్త చేసిన ప్లాన్‌కు ఎవరైనా నోరు వెళ్లబెట్టాల్సిందే

రెండు సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్న సూరజ్‌కు అప్పుడే భార్య అంటే విరక్తి పుట్టింది. మరో పెళ్లి చేసుకుంటే కట్నం వస్తుందని భావించిన సూరజ్‌ ఆమెను చంపేందుకు మాస్టర్‌ ప్లాన్‌ వేశాడు. అద్బుతమైన...

త్వరలోనే విజయవాడకు జనసేనాని – దూకుడుగా వెళ్లడమే మంత్రం.!

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ లాక్ డౌన్ సమయంలో ఇంట్లో ఉంటూనే ఎక్కడ ఎవరికి ఏ అవసరం వచ్చినా తనదైన తరహాలో సాయం చేస్తున్నారు. ఇక జనసైనికులైతే గ్రామ స్థాయిలో...

ప్చ్.. జగన్ ఏడాది ఆనందం అలా ఆవిరైపోయింది.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏపీలో గెలుపొంది శనివారం నాటికి సరిగ్గా ఏడాది పూర్తయింది. అయితే, ఏడాది ఆనందం ప్రస్తుతం ఆ పార్టీకి అంతగా లేదు. అది ఏ కరోనా కారణంగా అనుకుంటే పొరపాటే....

ఫ్లాష్ న్యూస్: ఇంట్లోకి పాములు వస్తున్నాయని ఊరు వదిలి పెట్టారట

కంప్యూటర్ కాలంలో కూడా కొందరు మూఢ నమ్మకాలు పాటిస్తూ, వాటిని నమ్ముతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ భీందు జిల్లాలో జరిగిన సంఘటన అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇంట్లో దాదాపుగా 120...

రంజాన్‌ స్పెషల్‌: ఇండియాలో ఈద్‌ అల్‌ ఫితర్‌ ఎప్పుడంటే..

పవిత్ర రమదాన్‌ మాసం కొనసాగుతోంది. గతంలో కన్పించిన సందడి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడా రమదాన్‌ సందర్భంగా కన్పించడంలేదంటే దానికి కారణం కరోనా వైరస్‌. ప్రపంచంలో చాలా దేశాలు లాక్‌ డౌన్‌ని పాటిస్తున్న...