Switch to English

వైఎస్‌ జగన్‌ని ఇరకాటంలో పడేసిన కేసీఆర్‌.!

తెలంగాణ నుంచి పెద్దయెత్తున ఆంధ్రప్రదేశ్‌కి తరలి వెళ్ళారు.. పండగ కోసం కాదు, కరోనా వైరస్‌కి భయపడి వెళ్ళారు వాళ్ళంతా. వీళ్ళలో చాలామంది హైద్రాబాద్‌లోని పలు హాస్టళ్ళలో వుండి ఉద్యోగాలు చేసుకోవడం, విద్యనభ్యసించడం చేస్తున్నారు. అయితే, దేశవ్యాప్త లాక్‌డౌన్‌ నేపథ్యంలో హాస్టళ్ళలో వుండలేని పరిస్థితులు రావడంతో, సొంతూళ్ళకు వెళ్ళిపోయేందుకు అనుమతి కోరుతూ పోలీస్‌ స్టేషన్ల వద్ద చిన్నపాటి ఆందోళనలు నిర్వహించారు ఆంధ్రప్రదేశ్‌కి చెందినవారు. దాంతో, పోలీస్‌ ఉన్నతాధికారులు కీలక నిర్ణయం తీసుకుని, వారు సొంతూళ్ళకు వెళ్ళేందుకు అనుమతినిచ్చారు.

అక్కడే అసలు సమస్య మొదలైంది. దాదాపు 8 వేల మంది హైద్రాబాద్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌కి వెళ్ళేందుకు అనుమతి పొందినట్లు తెలుస్తోంది. వీరంతా ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దులకి చేరుకోగానే, అక్కడి పోలీసులు అడ్డుకున్నారు. హైడ్రామా నడిచింది దాదాపు అన్ని చెక్‌పోస్టుల్లోనూ. చివరికి ముఖ్యమంత్రులిద్దరూ రంగంలోకి దిగాల్సి వచ్చింది. వచ్చినవారిని వచ్చినట్లే ఆంధ్రప్రదేశ్‌లోకి అనుమతించేందుకు వైఎస్‌ జగన్‌ ఒప్పుకున్నారు. అయితే, కొత్తగా ఎవర్నీ తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కి పంపొద్దని వైఎస్‌ జగన్‌ విజ్ఞప్తి చేయడంతో, కేసీఆర్‌ అంగీకరించినట్లు తెలుస్తోంది.

నిజానికి, దేశవ్యాప్త లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఎక్కడివారు అక్కడే వుండిపోవాలి. కానీ, ప్రత్యేక పరిస్థితుల కారణంగా, ఏపీ – తెలంగాణ మధ్య భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. వచ్చినవాళ్ళలో ఎంతమందికి కరోనా వైరస్‌ వుందో తెలియని పరిస్థితి. వాళ్ళందర్నీ క్వారంటైన్‌కి పంపారు కూడా. దాంతో, అలా వెళ్ళినవారు కొత్త సమస్యల్ని ఎదుర్కొనే అవకాశం వుంది.

పైగా, గంటల తరబడి జనం గుమికూడ్డంతో.. ఈ వ్యహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. తెలంగాణతో పోల్చితే, ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ కేసులు చాలా తక్కువగానే ఇప్పటిదాకా నమోదయ్యాయి. కానీ, ఇకపై పరిస్థితి భిన్నంగా వుండబోతోందన్న చర్చ సరత్రా జరుగుతోంది.

సినిమా

తన పిరియడ్స్ ఎక్స్ పీరియన్స్ ను చెప్పిన అనసూయ

జబర్దస్త్ ప్రోగ్రామ్ ద్వారా టీవీలో.. రంగస్థలం సినమా ద్వారా సినిమాల్లో చాలా పాపులర్ అయిన నటి అనసూయ. నటిగానే కాకుండా సోషల్ మీడియాలో కూడా అంతే...

‘ఓటీటీ’ దుమ్ము దులిపే ‘సినిమా’ కావాలి

లాక్ డౌన్ కారణంగా రెండు నెలలుగా థియేటర్లు మూతబడ్డాయి. ఇప్పటికీ థియేటర్ల పునఃప్రారంభంపై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ఒకవేళ తెరిచినప్పటికీ ప్రేక్షకులు మునుపటిలా థియేటర్లకు వస్తారో,...

‘కరోనా వైరస్’ సినిమా ఓటీటీ కోసమే..

ప్రపంచమంతా కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ అంటూ కూర్చుంటే వర్మ మాత్రం అదే ‘కరోనా వైరస్’ నేపధ్యంలో సినిమా తీసేసాడు. లాక్ డౌన్ సమయంలో...

జుంబారే ..జుజుంబరే… తాతకి మనవడి బర్త్ డే గిఫ్ట్

అమరరాజా ఎంటర్టైన్మెంట్ పతాకంపై గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ హీరోగా శ్రీరాం ఆదిత్య దర్శకత్వంలో ఒక చితం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో...

పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్న చిరంజీవి ఫ్యామిలీ

మెగాస్టార్ చిరంజీవి తేనెటీగల దాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు. తెలంగాణలోని కామారెడ్డి జిల్లా దోమకొండలో ఈ ఘటన జరిగింది. ఇటివల రామ్ చరణ్ భార్య ఉపాసన...

రాజకీయం

‘సుమోటో’ అంటూ ఈ కెలుకుడేంది ‘రెడ్డి’గారూ.!

సోషల్‌ మీడియాలో వైఎస్సార్సీపీ ముఖ్య నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చాలా యాక్టివ్‌గా వుంటారన్నది అందరికీ తెల్సిన విషయమే. కుప్పలు తెప్పలుగా ట్వీట్స్‌ వేస్తుంటారాయన. ప్రత్యర్థులపై ఎడాపెడా సెటైర్లు వేయడంలో...

జనసేనాని ప్రశ్న: లాక్‌డౌన్‌లో ‘ఇసుక’ మాయమైందెందుకు.?

‘లాక్‌డౌన్‌లోనూ ఇసుక లారీలు తిరిగాయి.. కానీ, డంపింగ్‌ యార్డులకి చేరలేదని భవన నిర్మాణ రంగ కార్మికులు చెబుతున్నారు. మరి, ఇసుక ఏమయినట్లు.? చంద్రబాబు హయాంలో ఎలాగైతే ఇసుక పేరుతో దోపిడీ జరిగిందో.. ఇప్పుడే...

కృష్ణాజిల్లా నందిగామలో చంద్రబాబు పై కేసు నమోదు

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై నందిగామ పోలీస్ స్టేషను లో కేసు నమోదు. కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో హైదరాబాదు నుండి విజయవాడ కు రోడ్డు మార్గాన వస్తూ జగ్గయ్యపేట, నందిగామ,కంచికచర్ల...

సుధాకర్ కు వైద్యం అందిస్తున్న డాక్టర్ మార్పు

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన డా.సుధాకర్ కేసును హైకోర్టు ఆదేశాలతో సీబిఐ విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. రోజురోజుకీ ఈ కేసు కీలక మలుపులు తీసుకుంటోంది. ఇప్పుడు సుధాకర్ విషయంలో మరో అంశం సంచలనమైంది....

కరోనా వైరస్‌.. జనానికి ఇకపై ఆ దేవుడే దిక్కు.!

కరోనా వైరస్‌ విషయంలో కేంద్రం చేతులెత్తేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేయడానికేమీ లేదు. దశలవారీగా లాక్‌డౌన్‌ని ఎత్తేవేసేందుకు ప్రణాళికని కూడా కేంద్రం ప్రకటించేసింది. కేంద్రం నుంచి రాష్ట్రాలకు అందాల్సిన స్థాయిలో ఆర్థిక అండదండలు...

ఎక్కువ చదివినవి

టీడీపీ మహానాడు.. కొత్త నాయకత్వమే దిక్కు.!

తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం వస్తుందా.? ఈ ప్రశ్న ఇప్పుడు మహానాడు సందర్భంగా టీడీపీ కార్యకర్తల్ని వేధిస్తోంది. నిజానికి, 2014 ఎన్నికలకు ముందే తెలుగుదేశం పార్టీ తన ఉనికిని దాదాపుగా కోల్పోయింది. అయితే,...

నిర్మాతల మండలి స్పెషల్ రిక్వెస్ట్ ని సీఎం జగన్ మన్నిస్తాడా.?

చిత్ర పరిశ్రమకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు, స్టూడియోలు, ల్యాబ్స్, అలాగే నిర్మాతలకు, ఆర్టిస్టులకు, ఇతర పరిశ్రమ వర్గాలకు హౌసింగ్ కొరకు అవసరమైన స్ధలాలను కేటాయించాలని తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి...

ముంబైలో కలకలం.. రెండు గంటల్లోనే 7 కరోనా మరణాలు

కేవలం రెండు గంటల్లో కరోనా సోకిన 7గురు రోగులు మరణించడం తీవ్ర కలకలం రేపుతోంది. విస్తుగొలిపే ఈ సంఘటన దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో జరిగింది. స్థానిక జోగేశ్వరి ఆస్పత్రిలో ఈ దారుణం...

ఫ్లాష్ న్యూస్: ఏసీలో మంటలు.. బీజేడీ నేత మృతి

ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లాలో గోషనిన్‌గావ్‌లో నిన్న ఉదయం బీజేడీ నేత అలేఖ్‌ చౌదరి మంటల్లో చిక్కుకుని మృతి చెందాడు. ఆయన్ను కాపాడేందుకు వెళ్లిన మరో ఇద్దరు కూడా మంటల్లో చిక్కుకుని ఊపిరి...

ఫ్లాష్ న్యూస్: వారెవ్వా.. తల్లి కోసం ఐదేళ్ల బాలుడు ఒంటరి ప్రయాణం.!

కరోనా మహమ్మారిని అడ్డుకోవడం కోసం ఇమ్మీడియట్ ఎఫెక్ట్ తో మార్చి లో లాక్ డౌన్ పెట్టడం వలన ఎక్కడి వారు అక్కడే లాక్ అయిపోయారు. చాలా మంది స్వస్థలాలకు వెళ్లాలని ప్రయత్నించి లాభం...