Switch to English

కేసీఆర్‌ హెలికాప్టర్‌.. ఈసారైనా ఎగిరేనా.?

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (కేసీఆర్‌) ఈ మధ్య పదే పదే హెలికాప్టర్‌ గురించి మాట్లాడుతున్నారు. నిజానికి ఆయన మాట్లాడుతున్నది హెలికాప్టర్‌ మనీ గురించి. ఆర్థిక విపత్తుల నేపథ్యంలో ఈ హెలికాప్టర్‌ మనీ అనే అంశం చర్చకు వస్తుంది. దేశంలో కరోనా మహమ్మారితోపాటు, ఆర్థిక విపత్తు కూడా విజృంభిస్తోంది.

లాక్‌డౌన్‌ నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ పరిస్థితుల్లో హెలికాప్టర్‌ మనీ ఒక్కటే బెస్ట్‌ ఆప్షన్‌ అన్నది కేసీఆర్‌ మాట. అయితే, కేసీఆర్‌ ఆలోచనని కేంద్రం ఇప్పటికే పలుమార్లు తిరస్కరించింది. ‘హెలికాప్టర్‌ మనీ కాకపోతే ఏరోప్లేన్‌ మనీ అనే పేరు పెట్టండి.. కానీ, ఆ హెలికాప్టర్‌ మనీలోని అసలు విషయాన్ని గ్రహించండి.. రాష్ట్రాల్ని ఆదుకోండి..’ అంటూ కేసీఆర్‌ పదే పదే కేంద్రానికి మొరపెట్టుకుంటున్నారు.

ఇదిలా వుంటే, మరోమారు కేసీఆర్‌, హెలికాప్టర్‌ మనీ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్ళబోతున్నారట ప్రధాని నిర్వహించబోయే టెలికాన్ఫరెన్స్‌ సందర్భంగా. ‘రాష్ట్రాలకు ఆర్థిక వెసులుబాట్లు తప్పనిసరి. రాష్ట్రాలు బావుంటేనే, కేంద్రం బావుంటుంది..’ అంటూ మొన్నీమధ్యనే ప్రెస్‌మీట్‌ సందర్భంగా కేసీఆర్‌, తన అభిప్రాయాన్ని కుండబద్దలుగొడుతూ, కేంద్రానికి విషయం చేరేలా మాట్లాడారు. అయినాగానీ, కేంద్రం నుంచి సానుకూలమైన రెస్పాన్స్‌ రాలేదు.

అయితే, మారిన పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం, రాష్ట్రాల్ని ఆదుకునేందుకు ‘భారీ ఆర్థిక ప్యాకేజీ’ ప్రకటించక తప్పని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రాలు అదనంగా అప్పులు చేసుకునే అవకాశాల్ని కల్పించడమే కాదు, కేంద్రం కూడా తనవంతు సాయం చేయాల్సి వుంది రాష్ట్రాలకి. ఈ రెండూ జరగకపోతే, కరోనా వైరస్‌ మాటేమోగానీ, ఆర్థిక విపత్తుతో ఎక్కువమంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుందన్నది నిర్వివాదాంశం.

సినిమా

తన పిరియడ్స్ ఎక్స్ పీరియన్స్ ను చెప్పిన అనసూయ

జబర్దస్త్ ప్రోగ్రామ్ ద్వారా టీవీలో.. రంగస్థలం సినమా ద్వారా సినిమాల్లో చాలా పాపులర్ అయిన నటి అనసూయ. నటిగానే కాకుండా సోషల్ మీడియాలో కూడా అంతే...

‘ఓటీటీ’ దుమ్ము దులిపే ‘సినిమా’ కావాలి

లాక్ డౌన్ కారణంగా రెండు నెలలుగా థియేటర్లు మూతబడ్డాయి. ఇప్పటికీ థియేటర్ల పునఃప్రారంభంపై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ఒకవేళ తెరిచినప్పటికీ ప్రేక్షకులు మునుపటిలా థియేటర్లకు వస్తారో,...

‘కరోనా వైరస్’ సినిమా ఓటీటీ కోసమే..

ప్రపంచమంతా కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ అంటూ కూర్చుంటే వర్మ మాత్రం అదే ‘కరోనా వైరస్’ నేపధ్యంలో సినిమా తీసేసాడు. లాక్ డౌన్ సమయంలో...

జుంబారే ..జుజుంబరే… తాతకి మనవడి బర్త్ డే గిఫ్ట్

అమరరాజా ఎంటర్టైన్మెంట్ పతాకంపై గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ హీరోగా శ్రీరాం ఆదిత్య దర్శకత్వంలో ఒక చితం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో...

పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్న చిరంజీవి ఫ్యామిలీ

మెగాస్టార్ చిరంజీవి తేనెటీగల దాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు. తెలంగాణలోని కామారెడ్డి జిల్లా దోమకొండలో ఈ ఘటన జరిగింది. ఇటివల రామ్ చరణ్ భార్య ఉపాసన...

రాజకీయం

‘సుమోటో’ అంటూ ఈ కెలుకుడేంది ‘రెడ్డి’గారూ.!

సోషల్‌ మీడియాలో వైఎస్సార్సీపీ ముఖ్య నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చాలా యాక్టివ్‌గా వుంటారన్నది అందరికీ తెల్సిన విషయమే. కుప్పలు తెప్పలుగా ట్వీట్స్‌ వేస్తుంటారాయన. ప్రత్యర్థులపై ఎడాపెడా సెటైర్లు వేయడంలో...

జనసేనాని ప్రశ్న: లాక్‌డౌన్‌లో ‘ఇసుక’ మాయమైందెందుకు.?

‘లాక్‌డౌన్‌లోనూ ఇసుక లారీలు తిరిగాయి.. కానీ, డంపింగ్‌ యార్డులకి చేరలేదని భవన నిర్మాణ రంగ కార్మికులు చెబుతున్నారు. మరి, ఇసుక ఏమయినట్లు.? చంద్రబాబు హయాంలో ఎలాగైతే ఇసుక పేరుతో దోపిడీ జరిగిందో.. ఇప్పుడే...

కృష్ణాజిల్లా నందిగామలో చంద్రబాబు పై కేసు నమోదు

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై నందిగామ పోలీస్ స్టేషను లో కేసు నమోదు. కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో హైదరాబాదు నుండి విజయవాడ కు రోడ్డు మార్గాన వస్తూ జగ్గయ్యపేట, నందిగామ,కంచికచర్ల...

సుధాకర్ కు వైద్యం అందిస్తున్న డాక్టర్ మార్పు

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన డా.సుధాకర్ కేసును హైకోర్టు ఆదేశాలతో సీబిఐ విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. రోజురోజుకీ ఈ కేసు కీలక మలుపులు తీసుకుంటోంది. ఇప్పుడు సుధాకర్ విషయంలో మరో అంశం సంచలనమైంది....

కరోనా వైరస్‌.. జనానికి ఇకపై ఆ దేవుడే దిక్కు.!

కరోనా వైరస్‌ విషయంలో కేంద్రం చేతులెత్తేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేయడానికేమీ లేదు. దశలవారీగా లాక్‌డౌన్‌ని ఎత్తేవేసేందుకు ప్రణాళికని కూడా కేంద్రం ప్రకటించేసింది. కేంద్రం నుంచి రాష్ట్రాలకు అందాల్సిన స్థాయిలో ఆర్థిక అండదండలు...

ఎక్కువ చదివినవి

నిశ్శబ్దం హడావిడి సెన్సార్ వెనుక కారణమేంటి?

నిన్న విడుదలైన ఒక న్యూస్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అదే అనుష్క ప్రధాన పాత్రలో హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కిన నిశ్శబ్దం సినిమా సెన్సార్ ను పూర్తి చేసుకుందని, దానికి సెన్సార్...

జగన్ కీలక నిర్ణయం.. సజ్జలకు పార్టీ బాధ్యతలు?

పార్టీ బాధ్యతల విషయంలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారా? అటు సీఎంగా పాలనా వ్యవహారాలు, ఇటు అధినేతగా పార్టీ కార్యకలాపాలు ఒకేసారి చూడటం కాస్త...

టీటీడీ వివాదంపై జగన్ కి విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సూచనలు.!

టీటీడీ భక్తులు ఇచ్చిన భూములు విక్రయించాలి అని నోటీసులు జారీ చేసినప్పటి నుంచీ ఆ విషయంపై నానా రచ్చ నడుస్తోంది. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తున్నారు. కానీ టీటీడీ...

టాలీవుడ్‌కి తీపి కబురు సరే.. సోషల్‌ డిస్టెన్సింగ్‌ ఎలా.?

తెలుగు సినీ పరిశ్రమకు తీపి కబురు అందబోతోంది. త్వరలో షూటింగులకు అనుమతి లభించబోతోంది. రాష్ట్ర ప్రభుత్వం పెద్ద మనసు చేసుకుని, తమ ఇబ్బందుల్ని పరిష్కరించేందుకు ముందుకొచ్చిందంటూ ఈ రోజు ప్రభుత్వ పెద్దలను కలిసిన...

శ్రీశైలంలో కోట్లు స్వాహా చేసిన అక్రమార్కులు

అవినీతి అనేది అక్కడ ఇక్కడ అని లేకుండా ఎక్కడ పడితే అక్కడే జరుగుతుంది అనేందుకు మరో ప్రత్యేక్ష ఉదాహరణగా శ్రీశైలం నిలిచింది. ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన అక్కడ కోట్లాది రూపాయల...