Switch to English

ఇదీ కేసీఆర్ మార్కు రివెంజ్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,513FansLike
57,764FollowersFollow

కేంద్రంతో తెలంగాణ సీఎం కేసీఆర్ సై అంటున్నారా? మీరు ఒకటేస్తే.. నేను రెండేస్తా అనే రీతిలో వ్యవహరిస్తున్నారా? ప్రస్తుత పరిణామాలు ఔననే అనిపిస్తున్నాయి. రాజకీయాల్లో ఎప్పుడు ఎక్కడ ఎలా వ్యవహరించాలో కేసీఆర్ కు తెలిసినంతగా ఎవరికీ తెలియదనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అవసరాలకు అనుగుణంగా వ్యవహరించి పనులు చేయించుకోవడంలో ఆయన నేర్పరి.

అలాంటి కేసీఆర్, కేంద్ర పెద్దల మధ్య ఇటీవల కాలంలో సంబంధాలు అంతగా బాగోలేదనే ప్రచారం జరుగుతోంది. ఎన్నికల ముందు కొంతకాలం వరకు ప్రధాని మోదీ సహా పలువురితో కేసీఆర్ చక్కని సంబంధాలే కలిగి ఉన్నారు. అయితే, అనంతర కాలంలో వారి మధ్య గ్యాప్ పెరుగుతూ వచ్చింది. ఎన్నికల సందర్భంగా ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు చేసిన కేసీఆర్.. మోదీపైనా విమర్శలు గుప్పించారు. దీంతో సహజంగానే ఇరువురి మధ్య దూరం పెరిగింది.

ఇక కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మోదీ.. కేసీఆర్ ను పెద్దగా పట్టించుకోలేదు. ఆయన కోరినా అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని కేసీఆర్ ఆహ్వానించలేదు. మరోవైపు తెలంగాణ సచివాలయం నిర్మాణానికి రక్షణశాఖ ఆధీనంలో ఉన్న బైసన్ పోలో మైదానం తమకు ఇవ్వాలని కోరుతూ కేసీఆర్ చేసిన ప్రతిపాదనకు తొలుత సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిన కేంద్రం.. తర్వాతి పరిణామాల నేపథ్యంలో అందుకు విముఖత వ్యక్తంచేసింది.

దీంతో ఈ వ్యవహారంపై ఒకటి రెండుసార్లు ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోవడంతో ఇక ప్రస్తుత సచివాలయం ఉన్నచోటనే కొత్త సెక్రటేరియట్ నిర్మించాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. బైసన్ పోలో మైదానం ఇవ్వకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ప్రస్తుతం ఆయన వంతు వచ్చింది.

వికారాబాద్ వద్ద 2,934 ఎకరాల భూమిని రక్షణశాఖకు ఇస్తామని గతంలో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. అయితే, ప్రస్తుతం ఆ నిర్ణయాన్ని పెండింగ్ లో పెట్టింది. బైసన్ పోలో మైదానం ఇవ్వనందుకు నిరసనగానే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. బైసన్ పోలో మైదానం ఇస్తేనే ఆ భూమి ఇస్తామని స్పష్టంచేసినట్టుగా తెలుస్తోంది. అలాగే కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఇతర విభాగాలు చేపట్టిన భూసేకరణకు కూడా మోకాలడ్డినట్టు సమాచారం. బైసన్ పోలో విషయంలో కేంద్రం అనుసరించిన వైఖరికి ఇది కేసీఆర్ మార్కు రివెంజ్ అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Tillu Square: ”100 కోట్లు వసూలు చేస్తుంది’ టిల్లు స్క్వేర్ పై...

Tillu Square: సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), అనుపమ (Anupama) హీరోహరోయిన్లుగా మల్లిక్‌ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'టిల్లు స్క్వేర్' (Tillu Square) నేడు విడుదలై...

Sreeranganeethulu: ‘శ్రీరంగనీతులు’ ట్రైలర్ విడుదల..

Sriranga Neethulu: సుహాస్‌, కార్తీక్‌ర‌త్నం, రుహానిశ‌ర్మ‌, విరాజ్ అశ్విన్‌ ముఖ్యపాత్రల్లో నటించిన సినిమా ‘శ్రీ‌రంగనీతులు' (Sriranga Neethulu). రాధావి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ పై వెంక‌టేశ్వ‌ర‌రావు బ‌ల్మూరి నిర్మించగా.....

Vijay Devarakonda: పార్టీ కావాలన్న రష్మిక..! విజయ్ దేవరకొండ రిప్లై ఇదే..

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)-మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) జంటగా తెరకెక్కిన కొత్త సినిమా ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star). పరశురామ్ దర్శకత్వంలో...

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

రాజకీయం

Tdp: పెండింగ్ అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ

Tdp: త్వరలో జరుగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ (Tdp) 144 స్థానాల్లో పోటి చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అభ్యర్ధులను ప్రకటించగా 9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్ధులను...

టీడీపీ వెకిలి వేషాలకు బాధ్యత ఎవరిది.?

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించడాన్ని తెలుగు దేశం పార్టీ మద్దతుదారులు జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్వయంగా, ఈ పంపకాలను డిజైన్ చేసి, ఆమోద ముద్ర...

అన్న జగన్‌కి పక్కలో బల్లెంలా తయారైన చెల్లెలు సునీత.!

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వ్యవహారానికి సంబంధించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు, స్వయానా ఆ వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి కౌంటర్ ఎటాక్...

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

ఎక్కువ చదివినవి

Janasena: జనసేనలో నిరసనలు.. తిరుగుబాట్లు..

Janasena: జనసేన (Janasena)లో అంతర్గపోరు తప్పేలాలేదా అంటే ప్రస్తుత పరిణామాలు ఇవే సూచిస్తున్నాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు ఆశిస్తున్న జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్, స్థానిక కార్యకర్తలు, ఆయన మద్దతుదారులు...

Nara Lokesh: ‘సీఎం ఇంటికెళ్లిన కంటెయినర్ కథేంటి..’ లోకేశ్ ప్రశ్నలు

Nara Lokesh: సీఎం జగన్ (CM Jagan) ఇంటికి వెళ్లిన కంటెయనర్ అంశం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇది ఎన్నికల నిబంధనను ఉల్లంఘించడమేనంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ (Nara...

Ram Charan Birthday special: మిస్టర్ కూల్.. ‘రామ్ చరణ్’

Ram Charan: రంగం ఏదైనా రాణించేందుకు ప్రతిభతోపాటు నడవడిక, క్రమశిక్షణ, నిబద్దత మరీ ముఖ్యం. ఇవే ఒక వ్యక్తిని కొలిచే కొలమానాలు. ప్రతిభతో రాణించొచ్చు కానీ గౌరవం దక్కించుకోలేం. ఇవన్నీ ఉంటే అతడు...

Chiranjeevi: హీరో శ్రీకాంత్ కి మెగా సర్ ప్రైజ్..

Chiranjeevi: శంకర్ దాదా ఎంబీబీఎస్ లో.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తిని శంకర్ (చిరంజీవి) కౌగిలించుకోవాలని భావిస్తే అతను తటపటాయిస్తాడు. ‘అరె వెళ్లరా భాయ్.. ఈ అవకాశం కోసం ఎంతమంది ఎదురు చూస్తుండ్రు’...

రాముడి విగ్రహం తల నరికినోళ్ళకి.. అర్చకులు ఓ లెక్కా.?

అంతర్వేది రథం తగలబడితే.. దోషులెవరో దొరకలేదు. వైసీపీ పాలనలో వ్యవస్థలు ఎలా తగలడ్డాయో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేముంటుంది.? తేనెపట్టుని తీసే ప్రయత్నంలో ఆకతాయిలెవరో మంట పెడితే, అంతర్వేది రథం తగలబెట్టారంటూ వైసీపీ...