తెలంగాణ లో లాక్ డౌన్ విధించే ఉద్దేశం లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. పరిస్థితి చేయి దాటకుండా ఉండేందుకు బాధతోనే విద్యా సంస్థలను మూసివేశాం కానీ.. లాక్ డౌన్ విధించాలనే ఆలోచన లేదని అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా.. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఆయన మాట్లాడారు.
‘ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కొందరు సినీ పెద్దలు రాష్ట్రంలో లాక్ డౌన్ విధిస్తారా? అని అడిగారు. కరోనా తగ్గుముఖం పట్టడంతో భారీ పెట్టుబడులు పెట్టామన్నారు. చాలా పెద్ద సినిమాలు నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. తొందరపడి లాక్ డౌన్ విధించం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ నిర్ణయం తీసుకోం. ఇప్పటికే లాక్ డౌన్ తో ఎంతో నష్టపోయాం. కరోనా తీవ్ర రూపం తీసుకోకముందే గట్టి చర్యలు తీసుకున్నాం’ అని స్పష్టం చేశారు.
రాష్ట్రంతోపాటు ప్రపంచం మొత్తం మళ్లీ కరోనా తీవ్రత పెరగడం బాధాకరమని సీం అన్నారు. అన్ని రాష్ట్రాలకు కేంద్రం సమానంగా టీకాలు ఇస్తోందని.. వ్యాక్సినేషన్ అంతా కేంద్రం చేతుల్లోనే ఉందని అన్నారు.