Switch to English

ఐ వన్నా ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ..

పలు అంశాల్లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి సాగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఏపీలో తొలిసారిగా జగన్, తెలంగాణలో రెండోసారి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగు రాష్ట్రాల మధ్య మంచి వాతావరణం నెలకొంది. ఎన్నికల ముందు నుంచే పలు విషయాల్లో జగన్ కు కేసీఆర్ పలు సలహాలు, సూచనలు చేశారని.. జగన్ సైతం కేసీఆర్ చెప్పిన విషయాలు వినేవారని సమాచారం.

అనంతరం జగన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కేసీఆర్ వెళ్లడం.. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి జగన్ హాజరు కావడం.. ఇరువురు పలు సందర్భాల్లో భేటీ కావడం జరిగాయి. ఇక చాలా విషయాల్లో కేసీఆర్ బాటలోనే జగన్ సాగుతున్నారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో దానికి పారాసిటమాల్ చాలంటూ అసెంబ్లీ వేదికగా కేసీఆర్ చెప్పగా.. జగన్ సైతం కరోనాను ఎదుర్కొనేందుకు పారాసిటమాల్, బ్లీచింగ్ పౌడర్ సరిపోతుందని చెప్పి విమర్శలపాలయ్యారు.

కరోనా నేపథ్యంలో రాష్ట్రంలోని పేదలకు ఉచితంగా రేషన్, రూ.1500 నగదు ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించగా.. జగన్ కూడా ఉచితంగా రేషన్, రూ.1000 నగదు ఇస్తామని ప్రకటించారు. ఇక కరోనా ఉధృతమవుతున్న తరుణంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడంతో ప్రజాప్రతినిధులు, ఉద్యోగుల జీతాల్లో కోత విధించాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అప్పటివరకు అలాంటి ఆలోచన లేని జగన్ సైతం అదే బాటలో వెళ్లారు.

జీతాలు ఇవ్వడానికి ఒక రోజు ముందు ప్రజా ప్రతినిధుల జీతాలను పూర్తిగా, ఉద్యోగుల వేతనాలను 10 శాతం నుంచి 50 శాతం మేర తగ్గించి ఇవ్వనున్నట్టు ప్రకటించారు. తొలుత ఉద్యోగుల అందరి వేతనాల్లో కోత విధించాలని నిర్ణయించిన కేసీఆర్.. అంతలోనే మనసు మార్చుకుని వైద్య ఆరోగ్య, పోలీసు సిబ్బందికి మాత్రం పూర్తి వేతనాలు ఇవ్వాలని, అంతేకాకుండా నగదు ప్రోత్సాహకం చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు శుక్రవారం ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. దీంతో జగన్ కూడా అదే బాటలో వెళ్లాలని భావించారు.

వైద్య ఆరోగ్య, పోలీసు, శానిటేషన్ సిబ్బందికి పూర్తి వేతనాలు ఇవ్వనున్నట్టు శనివారం ప్రకటించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకున్నా, మూడు కేటగిరీల సిబ్బంది వేతనాలు పూర్తిగా చెల్లించాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. మొత్తానికి ఇలా ప్రతి విషయంలోనూ కేసీఆర్ నే జగన్ ఫాలో అవుతున్నారు.

సినిమా

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా...

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

రాజకీయం

హైకోర్టుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు.. 49 మందికి నోటీసులు!

డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారం... వంటి విషయాలపై న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన దరిమిలా, అధికార పార్టీకి చెందిన నేతలు న్యాయస్థానం తీర్పుపై అసహనం వ్యక్తం...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది సినీ-టీవీ కార్మికులు రోడ్డున...

2021కి పోలవరం.. పోతిరెడ్డిపాడుతో ఎవరికీ నష్టం లేదు.. సీఎం జగన్

అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఎక్కువగా కట్టడం వల్ల రాష్ట్రానికి నీరు అందని పరిస్థితి ఉందని.. ఈ సమయంలో రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై వివాదాలు సృష్టించడం తగదని ఏపీ సీఎం జగన్ మోహన్...

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

ఎక్కువ చదివినవి

50 రోజుల యాక్షన్, ఒక్క ఫైట్ కి 6 కోట్లు @ మంచు మనోజ్.!

కలెక్షన్ కింగ్ మోహన బాబు నట వారసుడిగా తెలుగు తెరకి పరిచయమైన మంచు మనోజ్ పలు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు. మనోజ్ కేవలం హీరోగానే కాకుండా తన సినిమాల మ్యూజిక్ విషయంలో,...

క్రైమ్ న్యూస్: ప్రియురాలిని ఎర వేసి చెల్లి ప్రియుడిని చంపేసిన..

తన చెల్లిని ప్రేమించాడు అంటూ 19 యేళ్ల దినేశ్‌ను వంశీ చంపేశాడు. ప్రకాశం జిల్లా చీరాలలో ఈ సంఘటన జరిగింది. హరీష్‌ పేటకు చెందిన దినేశ్‌ కొన్నాళ్లుగా సంధ్యను ప్రేమిస్తున్నాడు. ఆమె కుటుంబ...

జనసేనానీ.. ఈ డోస్‌ సరిపోదు సుమీ.!

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఈ మధ్య సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా వుంటున్నారు. అయితే, ఎక్కువగా రీ-ట్వీట్లు చేస్తున్నారనే విమర్శలూ పవన్‌ కళ్యాణ్‌ మీద లేకపోలేదనుకోండి.. అది వేరే విషయం. బీజేపీ...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల డిస్ట్రిబ్యూషన్ చేస్తారు, అలాగే రానున్న ఏడాది...

టిక్ టాక్ అతి : అరెస్టైన నర్స్

టిక్ టాక్ లో పాపులర్ అవ్వడం కోసం కొందరు చేసే పనులు తలుచుకుంటేనే అమ్మో అనిపిస్తుంది. ఏదేమైనా, ఏం చేసినా పాపులర్ కావాలని వాళ్ళు పడే తాపత్రయం వాళ్ళను ఇబ్బందుల్లోకి నెడుతోంది. అయినా...