Karuppu: ఇళయరాజాకు క్షమాపణలు చెప్పిన కరుప్పు టీమ్.. కారణమిదే

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

93,288FansLike
57,764FollowersFollow

Karuppu: తమిళ హీరో సూర్య నటించిన సినిమా కరుప్పు. తెలుగులో వీరభద్రుడుగా విడుదలైంది. ఇటివల విడుదలైన సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. సూర్య కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబడుతున్న సినిమాగా దూసుకెళ్తోంది. త్రిష హీరోయిన్ గా నటించిన సినిమాకు ఆర్ జే బాలాజీ దర్శకత్వం వహించారు. అయితే.. సినిమాలోని ఓ డైలాగ్ పై ఇప్పుడు వివాదం నెలకొంది. సంగీత దర్శకుడు ఇళయరాజాను ఉద్దేశిస్తున్న ఓ డైలాగ్ ను టీమ్ తొలగించింది. దీనిపై వివరణ ఇస్తూ.. ఇళయరాజాను కించపరచాలనేది తమ ఉద్దేశంకాదని ఓ ప్రకటన విడుదల చేసింది.

‘కరుప్పులోని ఓ డైలాగ్ పై ఇళయరాజా బాధపడ్డారని మా దృష్టికి వచ్చింది. ఆ డైలాగ్ కావాలని పెట్టింది కాదు. కానీ, ఆయన బాధను అర్ధం చేసుకుంటున్నాం. ఆ డైలాగ్ ను తొలగిస్తున్నాం. సినీ పరిశ్రమకు ఇళయరాజా ఎంతో సేవ చేశారు. అటువంటి సంగీతజ్ఞానిని అవమానించడం మా ఉద్దేశం కాదు. ఆయన ప్రతిష్టకు భంగం కలిగించము. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆయనను ఉద్దేశించి ఉన్న డైలాగులు నేటి నుంచి సినిమా ప్రదర్శనలో ఉండవు. వాటిని తొలగిస్తున్నాం. ఆయనను ఎల్లప్పుడూ గౌరవిస్తూనే ఉంటామ’ని ప్రకటనలో పేర్కొంది.

సినిమా తమిళ వెర్షన్ లోని సెకండాఫ్ లో విజయ్ కాంత్ కు సంబంధించిన సన్నివేశంలో పాటలకు హక్కులపై డైలాగులు ఉండటమే వివాదానికి కారణమైంది. ఈ డైలాగులు ఇళయరాజాను విమర్శిస్తున్నట్టే ఉన్నాయని కామెంట్స్ వచ్చాయి. దీంతో ఇళయరాజాకు క్షమాపణలు చెప్తూ టీమ్ ఓ ప్రకటన విడుదల చేసింది.

సినిమా

Rashmika: నా కెరీర్లోనే క్లిష్టమైన సీక్వెన్స్ ఇది.. సవాల్ గా తీసుకున్నా:...

Rashmika: హీరోయిన్ నుంచి స్టార్ హీరోయిన్ కావడం చిన్న విషయం కాదు. ఏకంగా నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకోవడం అంటే ఎంత హార్డ్ వర్క్, టాలెంట్...

నా వ్యక్తిత్వంపై దుష్ప్రచారం చేస్తే కోర్టులో సమాధానం చెప్పాల్సిందే: చిన్మయి హెచ్చరిక

ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద సోషల్ మీడియాలో తనపై వ్యక్తిగత ఆరోపణలు చేసిన ఓ నెటిజన్‌కు ఘాటుగా స్పందించారు. తన వ్యక్తిగత జీవితం, ఆరోగ్యం, సంతానోత్పత్తి...

Jana Nayagan: ‘జననాయగన్’ వచ్చేస్తోంది..! విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారా..?

Jana Nayagan: తమిళనాడు సీఎం విజయ్ నటించిన‌ చివరి సినిమా 'జన నాయగన్’. హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన సినిమాపై ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్...

12 గంటల యాక్షన్ షూట్‌లో చిరంజీవి.. మెగా స్టార్ డెడికేషన్‌కు టీమ్...

మెగాస్టార్ చిరంజీవి తన అంకితభావం, క్రమశిక్షణతో మరోసారి అభిమానులతో పాటు చిత్రబృందాన్ని కూడా ఆకట్టుకున్నారు. ఆయన హీరోగా తెరకెక్కుతున్న #MEGA158 సినిమా షూటింగ్‌లో అత్యంత క్లిష్టమైన...

ప్రేయసిపైనే కోర్టులో కేసు.. ‘ఒక కోర్టు కేస్’

ప్రేమలో మోసం, బ్రేకప్, ప్రతీకారం వంటి అంశాలపై ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చినా, ప్రేమలో జరిగిన అన్యాయానికి న్యాయం కోసం తన ప్రేయసిపైనే కోర్టులో కేసు...

రాజకీయం

శ్రీసిటీలో మోటివ్ లింక్ పెట్టుబడులకు లోకేష్ ఆహ్వానం.. ఈవీ తయారీ యూనిట్ ఏర్పాటుపై చర్చలు

దక్షిణ కొరియాలో పెట్టుబడుల ఆకర్షణ కోసం పర్యటిస్తున్న రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రముఖ ఆటోమోటివ్ పవర్ ఎలక్ట్రానిక్స్ సంస్థ మోటివ్ లింక్ (MOTIVELINK) ప్రతినిధులతో సమావేశమయ్యారు....

జనసేన నేతలకు పవన్ కళ్యాణ్ కీలక దిశానిర్దేశం.. ప్రజల్లోనే ఉండాలని స్పష్టమైన ఆదేశాలు

జనసేన పార్టీ కార్యక్రమాలను క్షేత్ర స్థాయిలో మరింత ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్టీ ప్రజాప్రతినిధులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. విజయవాడలో జరిగిన జనసేన లెజిస్లేటివ్...

గుట్టుపల్లి రైతులకు గుడ్ న్యూస్.. 22ఏ జాబితా నుంచి 2,074 ఎకరాల విముక్తి

బేతంచెర్ల మండలం గుట్టుపల్లి రైతులకు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న సమస్యకు పరిష్కారం లభించింది. గతంలో వక్ఫ్ ఆస్తులుగా పొరపాటున 22ఏ నిషేధిత జాబితాలో చేర్చిన 2,074 ఎకరాల పట్టా భూములను తొలగించేందుకు ప్రభుత్వం నిర్ణయం...

కొరియాతో లోకేష్ కీలక చర్చలు.. ఏపీకి నాలెడ్జ్ ఎకానమీ లక్ష్యం!

ఆంధ్రప్రదేశ్‌ను నాలెడ్జ్ ఎకానమీగా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్, కొరియా...

కియాకు లోకేష్ ఆహ్వానం.. ఏపీలో ఈవీ హబ్ ఏర్పాటు చేయండి

దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ కియా మోటార్స్ ఉన్నతస్థాయి ప్రతినిధులతో సియోల్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో...

ఎక్కువ చదివినవి

ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో జనసేనలోకి కూకట్‌పల్లి యువత చేరిక

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీకి యువత నుంచి మద్దతు పెరుగుతున్నట్లు మరోసారి కనిపించింది. కేపీహెచ్‌బీ కాలనీ 5వ ఫేజ్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కూకట్‌పల్లి డివిజన్‌కు చెందిన పలువురు...

విశాఖలో ఎల్‌జీ జీసీసీకి లోకేష్ ఆహ్వానం.. శ్రీసిటీలో పెట్టుబడుల విస్తరణపై చర్చ

సియోల్ (సౌత్ కొరియా): ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్ట్రానిక్స్ తయారీ, పరిశోధన, అభివృద్ధి రంగాలను మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దక్షిణ కొరియాలోని ఎల్‌జీ...

జస్ట్ ఆస్కింగ్: జోసెఫ్ రావణ్‌కీ ప్రకాష్ రాజ్‌కీ ‘లింక్’ ఏంటి.?

యూ ట్యూబర్ జోసెఫ్ రావణ్ ఇటీవల అరెస్టయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్ రిమాండ్‌లో వున్నాడు. నాలుగు సార్లు అరెస్ట్.. నాలుగు సార్లూ బెయిల్.. ఐదో సారి మాత్రం, బలమైన చట్టాల...

Mohanlal: వివాదంలో హీరో మోహన్ లాల్..! అటవీశాఖ కీలక నిర్ణయం

Mohanlal: మలయాళ చిత్రసీమ అగ్రకథానాయకుడు మోహన్ లాల్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇప్పటికే ఆయనపై ఏనుగు దంతాలు కలిగి ఉన్నారనే కేసు ఉంది. వన్యప్రాణుల కొమ్ములు, దంతాలతో తయారుచేసిన వస్తువులను అక్రమంగా కలిగి...

Rajendra Prasad: ‘ఇస్తే గౌరవం.. అడిగితే భిక్ష..’ పద్మశ్రీ అవార్డుపై రాజేంద్రప్రసాద్ కామెంట్

Rajendra Prasad: నవ్వులరేడుగా తెలుగు ప్రేక్షకుల మనుసుల్లో ముద్ర వేసుకున్న నటకిరీటి రాజేంద్రప్రసాద్ కు కేంద్ర ప్రభుత్వం ఇటివలే గౌరవ ‘పద్మశ్రీ’ పురస్కారం అందించిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల...