ఒక్క సినిమాతోనే ‘ప్రామిసింగ్ హీరో’ అన్పించేసుకున్నాడు యంగ్ హీరో కార్తికేయ. అదే ‘ఆర్‌ఎక్స్100’ సినిమా. అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్‌ఎక్స్ 100’ అప్పట్లో సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. ప్రధానంగా ఈ సినిమాలో ఏమాత్రం మొహమాటపడకుండా ఎక్స్‌పోజింగ్ చేసేసిన పాయల్ రాజ్‌పుత్.. ఆ తర్వాత కార్తికేయ సిక్స్ ప్యాక్ ఫిజిక్.. అన్నిటికీ మించి రస్టిక్ అండ్ కల్ట్ లవ్ స్టోరీ ఈ సినిమాని ఓ రేంజ్‌లో హిట్ చేసేశాయి.
కానీ, ఆ తర్వాత కార్తికేయ హీరోగా తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి తంటాలు పడాల్సి వస్తోంది. ‘హిప్పీ’ సినిమాతో ఘోరమైన పరాజయాన్ని చవిచూసేశాడు కార్తికేయ. ఆ వెంటనే వచ్చిన ‘గుణ 369’ ఏదో అలా ‘మమ’ అన్పించిందంతే. హిట్టు కోసం పరితపిస్తోన్న కార్తికేయ నుంచి ఎవరూ ఊహించని ఓ టైటిల్ వచ్చింది. అదే ’90 ఎంఎల్’. అంతలా అందరికీ ఈ టైటిల్ ఎందుకు షాకిచ్చిందంటే, ఇది ఆల్రెడీ మనకి తెలిసిన టైటిలే.
Also Read: ‘హిప్పీ’ కోసం పచ్చి బూతులు వాడేశారా.?
తమిళ నటి ఒవియా చేసిన సినిమా అప్పట్లో తెలుగులోనూ బాగానే సౌండ్ చేసింది. తమిళ హీరో శింబు ఈ సినిమాకి మ్యూజిక్ అందించాడు. బోల్డ్ అండ్ హాట్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా అప్పట్లో వార్తల్లోకెక్కింది. అంతలా జనం నోళ్ళలో నానిపోయిన టైటిల్‌ని కార్తికేయ ఎందుకు కాపీ కొట్టినట్లు.? ఏమోగానీ, ఈ మధ్య టైటిల్స్ కోసం హీరోలు నానా తంటాలూ పడాల్సి వస్తోంది.
ఆ టైటిల్ సమస్య కారణంగానే నిఖిల్ సిద్దార్ధ తన ‘ముద్ర’ సినిమాని ‘అర్జున్ సురవరం’గా మార్చుకున్నాడుగానీ, అది ఇప్పటికీ విడుదల కాలేదు. నాని కొత్త సినిమా ‘గ్యాంగ్ లీడర్’కి కొన్ని అనివార్య కారణాలతో ‘నానీస్ గ్యాంగ్ లీడర్’గా మార్పులు చేయాల్సి వచ్చింది. ‘గుణ’ సినిమా విషయంలోనూ కార్తికేయ ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. మరి, ’90 ఎంఎల్’ సినిమా పరిస్థితేంటో.!
