Kareena Kapoor Khan: కరీనా కపూర్.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్. కెరీర్ దాటి రెండు దశాబ్దాలు దాటినా అదే క్రేజ్.. అదే ఇమేజ్. పెళ్లై ఇద్దరు పిల్లలున్నా అదే గ్లామర్.. అదే ఫిజిక్. స్క్రీన్ మీద ఒక స్టిల్ ఇచ్చినా.. డ్యాన్స్ మూమెంట్ చేసినా.. కవ్వింపైనా.. కరీనా స్పెషల్ అంతే. గ్లామర్ తో 20ఏళ్లకు పైగా ఫామ్ కోల్పోని అతికొద్దిమంది హీరోయిన్లలో ఆమె ఒకరు. తనతో కెరీర్ స్టార్ట్ చేసినవారు జీవితంలో సెటిలైతే తాను మాత్రం ఇంకా చార్మ్ కాపాడుకుంటూ గ్లామర్ ఒలకబోయడం బెబో స్పెషల్.
ప్రస్తుతం ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది బెబో.. భర్త సైఫ్ ఆలీఖాన్ కలిసి మాల్దీవులకు వెకేషన్ వెళ్లింది. ఇంకేం.. బీచ్ లో ఎంజాయ్ చేసింది. బికినీలో బెబో అందాలు కిక్కెంచేలా ఉన్నాయి. పక్కా నాచురల్ గా దిగినా బెబో సెల్ఫీలు సెక్సీగా ఉండటం ఇక్కడ స్పెషల్. సెలబ్రిటీలు కూడా ఫిదా అయిపోతున్నారు ఆమె అందాలకు. సైఫ్ చెల్లెలు సోహా ఆలీఖాన్ కూడా రెడ్ హార్ట్ ఎమోజీ షేర్ చేసింది. అభిమానులైతే వయసైనా అందాలకు కొదవే లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఈ ఏడాది క్రూ సినిమాలో నటించి ఆకట్టుకుంది కరీనా. టబు, కృతి సనన్ తో కలిసి నటించినా తనకంటూ మంచి మార్కులు కొట్టేసింది. ప్రస్తుతం అజయ్ దేవగన్ తో కలిసి సింగం ఎగైన్ సినిమాలో నటిస్తోంది. మరో పాన్ ఇండియా సినిమాలో కూడా నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నా క్లారిటీ రావాల్సి ఉంది. వయసు నాలుగు పదులు దాటినా బెబో అందానికి ఢోకా లేదు.. గ్లామర్ కు రిటైర్మెంట్ లేదు. కాబట్టి మరిన్ని సినిమాలతో బెబో అందాల కనువిందు ఖాయమే.