పవన కళ్యాణ్ ఎదుర్కొన్న అవమానాలు, హేళన, ద్వారంపూడి, మిథున రెడ్డి, ముద్రగడల చిల్లర రాజకీయం, పిఠాపురం పై జగన్ ప్రత్యేక దృష్టి , మహాజన రాజేష్ లాంటి వాళ్ళ ఉడత ఊపులు, దిలీప్ సుంకర లాంటి వాళ్ళ వెన్నుపోట్లు, అల్లు అర్జున్ అతిశయం లాంటివి రాష్ట్ర వ్యాప్తం గా వున్న కాపు యువత లో ఒక రకమైన ఊపు తెచ్చింది.
ఆ సామాజిక వర్గం లో రాజకీయాలు అంటే పెద్ద ఆసక్తి చూపని వారిలో కూడా పవన్ కళ్యాణ్ పట్ల సానుభూతి వెల్లువయింది. K.K సర్వేస్ అధినేత శ్రీ కిరణ్ కొండేటి కూడా చెప్పాడు.. పిఠాపురం మీద రాయలసీమ రెడ్ల రాజకీయం, రాష్ట్ర వ్యాప్తంగా వున్న జనసేన అభిమానుల్లో ఒక రకమైన కసిని పెంచాయి, అది కూడా వైస్సార్సీపీ కుప్పకూలటానికి వున్న ఎన్నో కారణాల్లో ఒకటి అని.
ఈ కింద మెజారిటీస్ చూస్తే తేటతెల్లమవుతుంది.. మొదట 20 అత్యధిక మెజారిటీస్ వచ్చిన స్థానాలు అందులో 11 మంది కాపులే. జనసేన పార్టీ గా చూస్తే 8 సీట్లు.
దీన్నిబట్టి కాపు యువత లో కసి రావటానికి జగన్ అనుసరించిన వ్యూహమే చాలావరకు కారణంగా చెప్పుకోవచ్చు.. అంతేగాక అందరూ చెబుతున్నట్టు.. కూటమి విజయంలో కాపుల ఓట్లే ప్రధాన ప్రభావం చూపాయని చెప్పవచ్చు.