ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఎందుకు ‘కంస మామ’లా మారిపోయినట్టు.? మెగాభిమానుల సూటి ప్రశ్న ఇది. ఔను, నిర్మాత అల్లు అరవింద్‌ని మెగాభిమానులు ‘కంస మామ’గా అభివర్ణిస్తున్నారు. దానికి కారణం లేకపోలేదు. రామ్ చరణ్ తొలి సినిమా ‘చిరుత’ని యావరేజ్ సినిమాగా అల్లు అరవింద్ అభివర్ణించారు మరి.
దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. అల్లు అరవింద్ వ్యాఖ్యల్ని తప్పు పడుతూ, చిరుత’ సినిమా సాధించిన రికార్డుల్ని మెగాభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. డెబ్యూ హీరోకి అప్పట్లో వచ్చిన రికార్డు వసూళ్ళు.. ‘చిరుత’ సినిమా సాధించిన ఘనతగా మెగాభిమానులు చెబుతున్నారంటే.. అది నిజమే మరి.
అప్పట్లో దాదాపు 25 కోట్ల షేర్‌ని ‘చిరుత’ సాధించడం ఆషామాషీ వ్యవహారం కాదు. ఆ ఏడాది విడుదలైన సినిమాల్లో కమర్షియల్‌గా రెండో హిట్ సినిమా ‘చిరుత’. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘చిరుత’ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే.
‘తండేల్’ సినిమా ఈవెంట్‌లో అల్లు అరవింద్, పరోక్షంగా ‘గేమ్ ఛేంజర్’ ఫెయిల్యూర్‌ని ప్రస్తావించడంతో ఈ మొత్తం రచ్చ షురూ అయ్యింది. వివాదాస్పద వ్యాఖ్యల విషయమై స్పందించాలని తాజాగా మీడియా కోరితే, ‘నో కామెంట్’ అనేశారు అల్లు అరవింద్.
మరోపక్క, ‘చిరుత’ యావరేజ్ కావడంతో, పెద్ద హిట్ ఇవ్వడం కోసం తానే రాజమౌళిని రామ్ చరణ్ కోసం సంప్రదించినట్లు అల్లు అరవింద్ చెప్పుకున్నారు. అయితే, ‘మగధీర’ సినిమా విషయంలో రాజమౌళి స్వయంగా అల్లు అరవింద్‌తో సినిమా చేయాలనుకున్నారు, చేశారు. ఇది అందరికీ తెలిసిన విషయమే.
వాస్తవానికి ‘మగధీర’ ప్రాజెక్టులోకి అల్లు అరవింద్ ఎంట్రీ కూడా నాటకీయంగా సాగిందనీ, చిరంజీవిని బతిమాలుకుని ఆ ప్రాజెక్టులో అరవింద్ భాగమయ్యారనీ అంటుంటారు.
అయినా, చిరంజీవి కొడుక్కి హిట్ ఇవ్వాలని అనుకోవడమేంటి.? చిరంజీవి కొడుకుని తక్కువ చేసి అల్లు అర్జున్ అభిమానులు ట్రోల్ చేస్తోంటే, మేనల్లుడు రామ్ చరణ్ విషయంలో అల్లు అరవింద్ ఎందుకు స్పందించడంలేదు.? స్పందించడంలేదు సరికదా, ట్రోల్ మెటీరియల్‌ని స్వయంగా అల్లు అరవింద్ ఎందుకు ఇస్తున్నట్లు.?
ఇందుకే, ఈ కారణాలతోనే అల్లు అరవింద్‌ని ‘కంసమామ’గా మెగాభిమానులు అభివర్ణిస్తున్నారు.
అన్నట్టు, ‘గంగోత్రి’ సినిమాతో రామ్ చరణ్‌ని పరిచయం చేయాల్సి వుండగా, మెగాస్టార్ చిరంజీవి మాత్రం, ఆ సినిమా అల్లు అర్జున్‌కి ఇవ్వాలని చిరంజీవి స్వయంగా ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు, ప్రముఖ నిర్మాత అశ్వనీదత్‌లను ఒప్పించారు. ఇది అశ్వనీదత్ స్వయంగా ఓ సందర్భంలో చెప్పారు.
అల్లు అర్జున్ విషయంలో చిరంజీవి ఎంత బాధ్యతగా వ్యవహరించారన్నది అందరికీ తెలిసిన విషయమే. అల్లు అర్జున్‌కి ‘స్టైలిష్ స్టార్’ అనే బిరుదు ఇచ్చింది కూడా స్వయంగా మెగాస్టార్ చిరంజీవే.
ఇవన్నీ అల్లు అరవింద్‌కి తెలియవా.? తెలిసీ, మెగా కాంపౌండ్ మీద విషం చిమ్మే ప్రయత్నం అల్లు అరవింద్ కూడా తన కొడుకు అల్లు అర్జున్‌తో కలిసి ఎందుకు చేస్తున్నారు.?
అల్లు అర్జున్ విషయంలో లైట్ తీసుకున్నా, అరవింద్ కూడా అదే బాటలో నడుస్తుండడం పట్ల మెగా కాంపౌండ్ ఒకింత ఆశ్చర్యపోయినట్లు తెలుస్తోంది. ‘గేమ్ ఛేంజర్’ రిజల్ట్ విషయమై అరవింద్ ‘తేలిక’ వ్యాఖ్యలు చేయడం సబబు కాదని, మెగా కాంపౌండ్‌లో చర్చ జరుగుతోంది.