Switch to English

కన్నప్పను ఆదరించిన వారికి రుణపడి ఉంటా.. థాంక్స్ మీట్‌లో మోహన్ బాబు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,113FansLike
57,764FollowersFollow

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా వచ్చిన కన్నప్ప సినిమా థియేటర్లలో మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా శనివారం మూవీ టీమ్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సినిమాను అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద డా.ఎం.మోహన్ బాబు నిర్మించగా.. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. అక్షయ్ కుమార్, మోహన్‌లాల్, ప్రభాస్ కీలక పాత్రలు చేశారు. అన్ని ఏరియాల్లో మంచి హిట్ టాక్ వచ్చిందని మూవీ టీమ్ చెబుతోంది.

ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ.. ‘ఈ సినిమా నా జీవితంలో చాలా గొప్పది. ఇది డబ్బు కోసం తీసింది కాదు. ఆ భగవంతుడి ఆశీస్సులతోనే దీనికి ఇంత గొప్ప విజయం దక్కింది. నేను నటుడిగా వచ్చి 50 ఏళ్లు అవుతోంది. ఆ నాటి నుంచి ఈనాటి వరకు నా అభిమానులే నాకు అండగా ఉన్నారు. ఇప్పుడు కన్నప్పను ఆదరించిన వారందరికీ రుణపడి ఉంటాను. ఇది ఏ ఒక్కరి సినిమా కాదు. ఇది అందరి మూవీ. అందరి ప్రోత్సాహం వల్లే సినిమా ఇంత పెద్ద హిట్ అయింది. వినయ్ లేకపోతే ఈ సినిమాకు ఇంత ఆదరణ వచ్చేది కాదు. అందరూ సినిమా కోసం కష్టపడ్డారు. వారందరికీ హృదయ పూర్వక అభినందనలు’ అని అన్నారు.

విష్ణు మంచు మాట్లాడుతూ ..‘సినిమా ఇండస్ట్రీలో నటించే వారందరికీ కనిపించే దేవుళ్లు అంటే ప్రేక్షకులే. వారి వల్లే మా సినిమా ఇంత పెద్ద విజయం సాధించింది. ఇది అంతా ఆ శివుడి లీల. ఇంత పెద్ద విజయం చేసిన ప్రేక్షకులకు మనస్ఫూర్తి థాంక్స్ చెబుతున్నాను అని చెప్పారు.

డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమా కోసం మేం చాలా కష్టపడ్డాం. ముఖ్యంగా మంచు విష్ణు, మోహన్ బాబు పదేళ్లుగా దీని మీద పనిచేస్తున్నారు. వారి కష్టానికి ఇంత పెద్ద విజయం దక్కింది. సినిమా మీద అందరూ ప్రేమను కురిపిస్తున్నారు. ఇది ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. చాలా మంది విష్ చేస్తున్నారు. అందరికీ ధన్యవాదాలు’ అని చెప్పారు.

మైత్రి శశి మాట్లాడుతూ .. ‘ఇలాంటి సినిమాలు ఈ రోజుల్లో రావడం నిజంగా అద్భుతమే అని చెప్పుకోవాలి. ‘సలార్’, ‘పుష్ప’ లాంటి సినిమాల తర్వాత ‘కన్నప్ప’కి కల్వకుర్తి లాంటి ఓ మారుమూల ఊరిలో థియేటర్లు నిండాయి. ఇదంతా మీ టీమ్ పడ్డ కష్టమే. ఈ సినిమా అన్ని చోట్లా మంచి హిట్ టాక్ తెచ్చుకుంటోంది. క్లైమాక్స్ చూసి నాకు కన్నీళ్లు వచ్చాయి. విష్ణు గారు అద్భుతంగా నటించారు. ఇలాంటి సినిమాకు మాకు అందించిన మోహన్ బాబు గారికి ధన్యవాదాలు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వినయ్ మహేశ్వరి మాట్లాడుతూ.. ‘మేం ఊహించినట్టే మూవీ మంచి హిట్ అయింది. మేం ఆశించినదానికంటే పెద్ద రెస్పాన్స్ దక్కింది. అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సినిమా కోసం మేం అంతా చాలా కష్టపడ్డాం. విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. అతినికి పెద్ద హిట్ కావాలని అందరం కోరుకున్నాం’ అని చెప్పారు.

సినిమా

సంక్రాంతికి నవ్వుల రాజ్యం… ‘అనగనగా ఒక రాజు’తో క్యూట్ కామెడీ సర్‌ప్రైజ్...

ఈ సంక్రాంతికి ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందించేందుకు ‘అనగనగా ఒక రాజు’ చిత్రం సిద్ధమవుతోంది. స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తున్న ఈ ఫెస్టివల్...

CHIRU-VENKY: 29ఏళ్ళ క్రితం కల.. నేడు నిజం కాబోతున్న వేళ

CHIRANJEEVI-VENKATESH: సినిమాల్లో కొన్ని కొన్ని కాంబినేషన్లు ఊహకే మంచి బజ్ క్రియేట్ చేస్తాయి. స్టార్ హీరోలు, హీరో హీరోయిన్లు, హీరో దర్శకులు, హీరో ప్రొడక్షన్ హౌస్...

MSG: చిరంజీవి సినిమాకి ‘లీగల్ షీల్డ్’.. ఫేక్, నెగటివ్ రివ్యూలకు చెక్

MSG: ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా విషయంలో డిజిటల్ మిస్ యూజ్ కు అడ్డుకట్ట వేసేలా కీలక అడుగు పడింది. సినిమా ఏదైనా కొందరు...

Deepthi Sunaina: పాల రాతి బొమ్మ – ఈ డిజిటల్...

ఈరోజు దీప్తి సునయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమె జీవితం, కెరీర్‌ను తిరిగి చూసుకుంటే… ప్రేమ, పోరాటం, పునర్నిర్మాణం అనే మూడు పదాలు స్పష్టంగా...

గాయని వరుణవికి చిరంజీవి రూ.5 లక్షల ఆర్థిక సాయం

మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. గతంలో ఇచ్చిన మాట ప్రకారం గాయని వరుణవికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందజేసి, నిజ...

రాజకీయం

కెంజుట్సులో పవన్ కళ్యాణ్‌కు అరుదైన ప్రపంచ గౌరవం

సినీ రంగం, రాజకీయాలు మాత్రమే కాకుండా మార్షల్ ఆర్ట్స్‌లోనూ తన ప్రత్యేకతను చాటుకుంటున్న పవన్ కళ్యాణ్ మరో అరుదైన ఘనతను సాధించారు. ప్రాచీన జపనీస్ కత్తిసాము యుద్ధకళ అయిన ‘కెంజుట్సు’లో ఆయనకు అధికారికంగా...

కూకట్ పల్లిలో జనసేనకు బలమైన ఊపు… భారీగా పార్టీలో చేరికలు

తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో కూకట్ పల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీలో భారీగా చేరికలు చోటు చేసుకున్నాయి. పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలపై విశ్వాసంతో ముందుకు సాగాలని...

నెలలో ఒక్కరోజైనా గ్రామాలకు రండి… వైద్యుల సేవలు సమాజానికి కావాలి: పవన్ కళ్యాణ్

వైద్యులు దేవుళ్లతో సమానమని మన సంప్రదాయంలో చెబుతారని, తల్లిదండ్రులు జన్మనిస్తే డాక్టర్లు పునర్జన్మ ఇస్తారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఎంత బిజీ జీవితం ఉన్నప్పటికీ, కనీసం నెలలో ఒక...

వరద ముంపు కష్టాలకు ముగింపు… గొల్లప్రోలు బ్రిడ్జి పరిశీలనలో పవన్ కళ్యాణ్

పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని గొల్లప్రోలు హౌసింగ్ కాలనీ వద్ద సుద్దగడ్డ కాలువపై నూతనంగా నిర్మించిన బ్రిడ్జిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం సందర్శించారు. బ్రిడ్జి మొత్తం తిరిగి నిర్మాణ పనుల...

అమరావతి విషయంలో కూటమి చేతికి ఆయుధాన్నిచ్చిన జగన్.!

ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ రాజకీయ నాయకుడు అయినా, ఏ ప్రజా ప్రతినిథి అయినా.. తన రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా పని చేస్తే, అలాంటివాళ్ళు రాజకీయాల్లో కొనసాగడానికి నైతిక అర్హతను కోల్పోతారు....

ఎక్కువ చదివినవి

గాయని వరుణవికి చిరంజీవి రూ.5 లక్షల ఆర్థిక సాయం

మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. గతంలో ఇచ్చిన మాట ప్రకారం గాయని వరుణవికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందజేసి, నిజ జీవితంలోనూ తాను హీరోనేనని మరోసారి నిరూపించారు....

వరద ముంపు కష్టాలకు ముగింపు… గొల్లప్రోలు బ్రిడ్జి పరిశీలనలో పవన్ కళ్యాణ్

పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని గొల్లప్రోలు హౌసింగ్ కాలనీ వద్ద సుద్దగడ్డ కాలువపై నూతనంగా నిర్మించిన బ్రిడ్జిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం సందర్శించారు. బ్రిడ్జి మొత్తం తిరిగి నిర్మాణ పనుల...

అమరావతి విషయంలో కూటమి చేతికి ఆయుధాన్నిచ్చిన జగన్.!

ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ రాజకీయ నాయకుడు అయినా, ఏ ప్రజా ప్రతినిథి అయినా.. తన రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా పని చేస్తే, అలాంటివాళ్ళు రాజకీయాల్లో కొనసాగడానికి నైతిక అర్హతను కోల్పోతారు....

ఆసియా స్వర్ణ విజేతకు లోకేష్ అండ

ఉండవల్లిలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ను రాష్ట్రానికి చెందిన స్టార్ అథ్లెట్, అర్జున అవార్డు గ్రహీత జ్యోతి యర్రాజీ కుటుంబ సభ్యులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల దక్షిణ...

నెలలో ఒక్కరోజైనా గ్రామాలకు రండి… వైద్యుల సేవలు సమాజానికి కావాలి: పవన్ కళ్యాణ్

వైద్యులు దేవుళ్లతో సమానమని మన సంప్రదాయంలో చెబుతారని, తల్లిదండ్రులు జన్మనిస్తే డాక్టర్లు పునర్జన్మ ఇస్తారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఎంత బిజీ జీవితం ఉన్నప్పటికీ, కనీసం నెలలో ఒక...