Switch to English

‘దొంగ’ ప్రమాణాలు ‘జైలు పక్షి’కి కొత్తేమీ కాదట..

కాణిపాకం వినాయకుడి సన్నిధిలో ‘సత్య ప్రమాణం’.. అంటూ వైసీపీ ముఖ్య నేత విజయసాయిరెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ మధ్య ‘సవాళ్ళ’ పర్వం కొనసాగుతున్న విషయం విదితమే. ఈ ఎపిసోడ్‌లో ఆసక్తికరమైన ట్విస్ట్‌ ఈ రోజు చోటుచేసుకుంది. ‘ప్రమాణాల గురించి విజయసాయిరెడ్డి మాట్లాడుతోంటే హాస్యాస్పదంగా వుంది.. వారం వారం కోర్టు బోనుల్లో నిల్చుని, భగవద్గీత మీద ప్రమాణం చేసి దొంగ మాటలు చెప్పడం జైలు పక్షికి అలవాటే’ అంటూ కన్నా లక్ష్మినారాయణ చేసిన వ్యాఖ్యలు వైసీపీ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి.

ఇవి కేవలం విజయసాయిరెడ్డిని ఉద్దేశించి మాత్రమే చేసిన వ్యాఖ్యలు కాదనీ, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ని ఉద్దేశించి కూడా చేసినవేనని వైసీపీ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. ‘విజయసాయిరెడ్డి ఏ ఉద్దేశ్యంతో కన్నా లక్ష్మినారాయణపై ఆరోపణలు చేస్తున్నారోగానీ.. అవి, జగన్‌ మోహన్‌ రెడ్డికి కూడా చాలా గట్టిగా తగులుతున్నాయి..’ అన్నది వైసీపీలో అంతర్గతంగా జరుగుతున్న చర్చ.

‘కరోనా వైరస్‌తో రాష్ట్రం తల్లడిల్లుతున్న వేళ, విశాఖ రాజధాని అంశం విజయసాయిరెడ్డి ప్రస్తావించడం అవివేకం..’ అని ఆఫ్‌ ది రికార్డ్‌గా వైసీపీలో చర్చించుకుంటున్నారట. మరోపక్క, ‘అధికారం మీ చేతుల్లోనే వుంది. కన్నా లక్ష్మినారాయణపై 20 కోట్లు దోచేశారంటున్న వైసీపీ, ఈ మేరకు కేసులు పెట్టి విచారణ జరిపించుకోవచ్చు..’ అని బీజేపీ సవాల్‌ విసురుతుండడం వైసీపీకి పెద్ద తలనొప్పిగా మారింది.

నిజానికి, కన్నా లక్ష్మినారాయణను వైసీపీలోకి లాగేందుకు కొన్నాళ్ళ క్రితం వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ చాలా ప్రయత్నాలే చేశారు. ఈ క్రమంలో ‘నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం కన్నా లక్ష్మినారాయణ..’ అంటూ వైసీపీ నేతలే వ్యాఖ్యానించారు. కానీ, ఇప్పుడు సీన్‌ రివర్స్‌ అయ్యింది.

రాజకీయాల్లో ఇవన్నీ మామూలే అయినా, విజయసాయిరెడ్డి ఓవరాక్షన్‌ వైసీపీ నేతలే భరించలేని స్థాయికి పెరగడం ఆశ్చర్యకరమే. కన్నా లక్ష్మినారాయణ అన్నారని కాదుగానీ, వైఎస్‌ జగన్‌ అక్రమాస్తుల కేసులో ఏ2 నిందితుడిగా వున్న విజయసాయిరెడ్డికి ఇతరుల మీద రాజకీయ విమర్శలు చేసే నైతిక హక్కు ఎక్కడిది.? పైగా, డబ్బు లావాదేవీలకు సంబంధించిన విమర్శలు చేయడం అంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకేముంటుంది.?

సినిమా

తన పిరియడ్స్ ఎక్స్ పీరియన్స్ ను చెప్పిన అనసూయ

జబర్దస్త్ ప్రోగ్రామ్ ద్వారా టీవీలో.. రంగస్థలం సినమా ద్వారా సినిమాల్లో చాలా పాపులర్ అయిన నటి అనసూయ. నటిగానే కాకుండా సోషల్ మీడియాలో కూడా అంతే...

‘ఓటీటీ’ దుమ్ము దులిపే ‘సినిమా’ కావాలి

లాక్ డౌన్ కారణంగా రెండు నెలలుగా థియేటర్లు మూతబడ్డాయి. ఇప్పటికీ థియేటర్ల పునఃప్రారంభంపై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ఒకవేళ తెరిచినప్పటికీ ప్రేక్షకులు మునుపటిలా థియేటర్లకు వస్తారో,...

‘కరోనా వైరస్’ సినిమా ఓటీటీ కోసమే..

ప్రపంచమంతా కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ అంటూ కూర్చుంటే వర్మ మాత్రం అదే ‘కరోనా వైరస్’ నేపధ్యంలో సినిమా తీసేసాడు. లాక్ డౌన్ సమయంలో...

జుంబారే ..జుజుంబరే… తాతకి మనవడి బర్త్ డే గిఫ్ట్

అమరరాజా ఎంటర్టైన్మెంట్ పతాకంపై గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ హీరోగా శ్రీరాం ఆదిత్య దర్శకత్వంలో ఒక చితం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో...

పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్న చిరంజీవి ఫ్యామిలీ

మెగాస్టార్ చిరంజీవి తేనెటీగల దాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు. తెలంగాణలోని కామారెడ్డి జిల్లా దోమకొండలో ఈ ఘటన జరిగింది. ఇటివల రామ్ చరణ్ భార్య ఉపాసన...

రాజకీయం

‘సుమోటో’ అంటూ ఈ కెలుకుడేంది ‘రెడ్డి’గారూ.!

సోషల్‌ మీడియాలో వైఎస్సార్సీపీ ముఖ్య నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చాలా యాక్టివ్‌గా వుంటారన్నది అందరికీ తెల్సిన విషయమే. కుప్పలు తెప్పలుగా ట్వీట్స్‌ వేస్తుంటారాయన. ప్రత్యర్థులపై ఎడాపెడా సెటైర్లు వేయడంలో...

జనసేనాని ప్రశ్న: లాక్‌డౌన్‌లో ‘ఇసుక’ మాయమైందెందుకు.?

‘లాక్‌డౌన్‌లోనూ ఇసుక లారీలు తిరిగాయి.. కానీ, డంపింగ్‌ యార్డులకి చేరలేదని భవన నిర్మాణ రంగ కార్మికులు చెబుతున్నారు. మరి, ఇసుక ఏమయినట్లు.? చంద్రబాబు హయాంలో ఎలాగైతే ఇసుక పేరుతో దోపిడీ జరిగిందో.. ఇప్పుడే...

కృష్ణాజిల్లా నందిగామలో చంద్రబాబు పై కేసు నమోదు

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై నందిగామ పోలీస్ స్టేషను లో కేసు నమోదు. కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో హైదరాబాదు నుండి విజయవాడ కు రోడ్డు మార్గాన వస్తూ జగ్గయ్యపేట, నందిగామ,కంచికచర్ల...

సుధాకర్ కు వైద్యం అందిస్తున్న డాక్టర్ మార్పు

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన డా.సుధాకర్ కేసును హైకోర్టు ఆదేశాలతో సీబిఐ విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. రోజురోజుకీ ఈ కేసు కీలక మలుపులు తీసుకుంటోంది. ఇప్పుడు సుధాకర్ విషయంలో మరో అంశం సంచలనమైంది....

కరోనా వైరస్‌.. జనానికి ఇకపై ఆ దేవుడే దిక్కు.!

కరోనా వైరస్‌ విషయంలో కేంద్రం చేతులెత్తేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేయడానికేమీ లేదు. దశలవారీగా లాక్‌డౌన్‌ని ఎత్తేవేసేందుకు ప్రణాళికని కూడా కేంద్రం ప్రకటించేసింది. కేంద్రం నుంచి రాష్ట్రాలకు అందాల్సిన స్థాయిలో ఆర్థిక అండదండలు...

ఎక్కువ చదివినవి

తెలంగాణలో భయపెడ్తున్న ‘కరోనా’ మరణాలు

పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌తో పోల్చితే కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య తెలంగాణలో తక్కువే వుంది. కానీ, ఆంధ్రప్రదేశ్‌తో పోల్చి చూసినప్పుడు తెలంగాణలో కరోనా టెస్టులు తక్కువగా జరుగుతున్నాయి. కరోనా పరీక్షలు తక్కువగా చేస్తుండడంపై...

హ్యాట్సాఫ్: వలస కూలీలకు ఫుడ్ సప్లై చేస్తున్న 99ఏళ్ల బామ్మ.!

లాక్ డౌన్ తో వ్యవస్థలన్నీ నిలిచిపోవడంతో ఎందరో కార్మికులకు పని లేకుండా పోయింది. వీరిలో ఎక్కువగా వలస కార్మికులే ఉన్నారు. వీరి ఉపాధికి కూడా గండి పడింది. దీంతో వీరంతా స్వస్థలాలకు బయలుదేరారు....

ఫ్లాష్ న్యూస్: దున్నపోతును హింసించారు.. ఎలా పగ తీర్చుకుందో తెలుసా..

కర్మ సిద్ధాంతం ప్రకారం.. మనం చేసిన పనులే మనల్ని వెంటాడుతూ మన జీవిత గమనాన్ని నిర్దేశిస్తూ ఉంటాయి. కొంతమంది ఆకతాయిలు చేసిన ఆ తుంటరి పనే వారికి కర్మ రూపంలో జరిగింది. తనను...

కైలాష్ ఖేర్ ‘మ్యాడ్’ మూవీ పాటకి మంచి స్పంద‌న.!

ప్రస్తుత జనరేషన్ ని ప్రతిబింబించేలా పెళ్లి, సహజీవనంలో ఉన్న రెండు జంటల కథతో రాబోతున్న చిత్రం "మ్యాడ్".ఈ మూవీ ఫస్ట్ లుక్ ని రీసెంట్ గా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.ఫ‌స్ట్ లుక్...

బ్రేకింగ్ న్యూస్: 12 గంటల్లో ఢిల్లీలో రెండు భారీ అగ్ని ప్రమాదాలు.!

సోమవారం అర్ధరాత్రి 12 గంటల 50 నిమిషాలకి ఢిల్లీలోని తుగ్లకాబాద్‌ మురికివాడలో మంటలు చెలరేగాయి.ఈ మంటలు సుమారు రెండు ఎకరాల మేర వ్యాపించడంతో అక్కడున్న దాదాపు 1500 గుడిసెలు ఆహుతయ్యాయి. అగ్ని ప్రమాదం...