బాలీవుడ్ సింగర్ కనిక కపూర్ లండన్‌లో ఒక కార్యక్రమంకు వెళ్లి వస్తూ వస్తూ కరోనాను కూడా మోసుకు వచ్చిన విషయం తెల్సిందే. విదేశాల నుండి వచ్చిన వారు రెండు లేదా మూడు వారాల వరకు పూర్తిగా హోమ్ క్వారెంటైన్లో ఉండాలంటూ ప్రభుత్వాలు హెచ్చరించినా కూడా ఆమె పలు కార్యక్రమాల్లో పాల్గొంది. ఆమె హాజరు అయిన పార్టీలకు ప్రముఖులు హాజరు అవ్వడం, వారు రాష్ట్రపతి వద్దకు కూడా వెళ్లడంతో దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.
కనిక కపూర్ వల్ల కొన్ని వందల మంది హోమ్ క్వారెంటైన్‌కు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఆమె రూల్స్ బ్రేక్ చేసింది అంటూ ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. కరోనా పాజిటివ్ వచ్చిన తర్వాత కూడా ఆమె చికిత్సకు సహకరించలేదు అనే విమర్శలు వచ్చాయి. దాదాపు మూడు వారాల తర్వాత కనిక కపూర్‌కు కరోనా నెగటివ్ వచ్చింది. కరోనా నెగటివ్ వచ్చిన ఆమెను మరో రెండు వారాల పాటు పూర్తిగా హోమ్ క్వారెంటైన్లో ఉండాలంటూ సూచించారు.
డాక్టర్లు సూచించిన విధంగా ఆమె హోమ్ క్వారెంటైన్లో ఉండటం లేదట. లాక్డౌన్ అమలులో ఉన్నా కూడా విఐపీ పాస్‌తో ఈమె బయట తిరుగుతుందని ఆరోపిస్తున్నారు. ఈమె తీరుపై పోలీసులు కూడా తీవ్ర అసహనంతో ఉన్నారు. ఇప్పటికే ఆమెను విచారించేందుకు ఆమె ఇంటికి వెళ్లిన సమయంలో పోలీసులకు ఆమె కలువలేదు. బయటకు వెళ్లిందని కుటుంబ సభ్యులు సమాచారం ఇచ్చారట. దాంతో ఆమెను ఖచ్చితంగా తమ ముందు హాజరు పర్చాలని, గతంలో నమోదు అయిన కేసును విచారించాలంటూ పోలీసులు చెప్పినట్లుగా తెలుస్తోంది. లాక్డౌన్ రూల్స్‌ను ఈమె మళ్లీ మళ్లీ బ్రేక్ చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి.
909637 887190thank you dearly author , I located oneself this internet website extremely beneficial and its full of outstanding healthy selective details ! , I as effectively thank you for the wonderful food program post. 889492
312709 958366I needs to spend some time finding out much more or working out more. Thanks for fantastic info I used to be searching for this information for my mission. 663950
236106 78521I likewise believe thus, perfectly pent post! . 233090