సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిన బాలీవుడ్ కామెంట్స్ గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ మీడియా దీనిపై రచ్చ చేస్తూనే ఉంది. మహేష్ తనకు అలాంటి ఉద్దేశం లేదని, తాను అన్ని భాషలను గౌరవిస్తానని తెలిపాడు. అయినా కానీ బాలీవుడ్ మీడియా దీనిపై చర్చలు పెడుతూనే ఉంది.
ఈ నేపథ్యంలో రీసెంట్ గా కంగనా రనౌత్ తన సినిమాల ప్రమోషన్స్ విషయంలో మీడియాను కలిసింది. బాలీవుడ్ మీడియా కంగనాను ఇదే విషయాన్ని ప్రస్తావించింది. అయితే కంగనా మాత్రం క్యాజువల్ గా అందులో తప్పేం ఉందన్నట్లుగా మాట్లాడింది.
మహేష్ కు నిజంగానే చాలా మూవీ ఆఫర్స్ వస్తూ ఉండి ఉండవచ్చు. అతను అన్న మాటల్లో తప్పేంలేదు. తెలుగు ఇండస్ట్రీ గత 10-15 ఏళ్లుగా ఎంతో ఎదిగింది. తమిళ ఇండస్ట్రీని కూడా దాటుకుని వచ్చింది అని మాట్లాడింది.