Kangana Ranaut: చంద్రముఖి-2 (Chandramukhi 2) సినిమా ప్రమోషన్లలో భాగంగా స్టార్ హీరోయిన్ కంగన రనౌత్ (Kangana Ranaut) పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చింది. ‘నాలో నటి ఉందని గుర్తించింది పూరి జగన్నాధ్ (Puri Jagannadh). హీరోయిన్ కాకముందే స్టార్ హీరోయిన్ అవుతానని చెప్పారు. పోకిరితో నన్ను తెలుగులో పరిచయం చేయాలని భావించారు. అదే సమయంలో నాకు హిందీలో గ్యాంగ్ స్టర్ అవకాశం వచ్చింది’.
‘రెండు సినిమాల షూటింగ్స్ అక్టోబర్లోనే ఉండటంతో నేను గ్యాంగ్ స్టర్ సెలక్ట్ చేసుకున్నా. దీంతో పోకిరి అవకాశం పోయింది. పోకిరిలో నటించనందుకు ఇప్పటికీ బాధ ఉంటుంది. కానీ.. జరిగిపోయింది. అయినా.. నన్ను మళ్లీ పిలిచి ఏక్ నిరంజన్ లో అవకాశం ఇచ్చారు. అప్పటినుంచి ప్రభాస్, నేను స్నేహితులం అయ్యాం’.
మరో ఇంటర్వ్యూలో.. ‘నాకు రామ్ చరణ్ (Ram Charan) తో కలిసి నటించాలని ఉంది. దర్శకుడు రాజమౌళి (Rajamouli) సినిమాలో కూడా నటించాలని ఉంద’ని అన్నారు. దీంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. లారెన్స్, కంగనా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చంద్రముఖి సెప్టెంబర్ 28న విడుదల కానుంది.