కోలీవుడ్ స్టార్ కార్తి లీడ్ రోల్ లో లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఖైదీ. 2019 లో రిలీజైన ఈ సినిమా తమిళ ఆడియన్స్ ని మాత్రమే కాదు తెలుగు ప్రేక్షకులను కూడా మెప్పించింది. కార్తిలోని మాస్ ని పూర్తిగా వాడేసుకున్న లోకేష్ ఆ సినిమాతోనే తన సినిమాటిక్ యూనివర్స్ అంటూ ఒక కొత్త సంచలనానికి నాంది పలికాడు.
ఖైదీ తర్వాత కమల్ హాసన్ తో తీసిన విక్రమ్ బ్లాక్ బస్టర్ హిట్ సాధించి లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ కి క్రేజ్ తీసుకొచ్చింది. విక్రమ్ లో ఢిల్లీ, రోలేక్స్ పాత్రలను ప్రస్తావించి నెక్స్ట్ సినిమాలకు హింట్ ఇచ్చాడు. ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ సూపర్ స్టార్ రజినీకాంత్ తో కూలీ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తి కాగానే నెక్స్ట్ ఖైదీ 2 ని మొదలు పెడతారని తెలుస్తుంది.
ఖైదీ సినిమా లవర్స్ అందరు ఈ సీక్వెల్ కోసం చాలా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఖైదీ 2 కచ్చితంగా సంథింగ్ స్పెషల్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నాడట కార్తి. ఐతే ఈ సినిమాలో కార్తితో పాటు ఉలగనాయకన్ కమల్ హాసన్ కూడా నటిస్తారని టాక్. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగానే ఖైదీ 2 లో కమల్ ని తీసుకొస్తున్నారని తెలుస్తుంది. మరి ఖైదీ 2 ఎలా ఉంటుంది లోకేష్ అందులో ఇంకెన్ని సర్ ప్రైజ్ లు ప్లాన్ చేస్తున్నారన్నది తెలియాల్సి ఉంది.