భారతీయుడు శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన ఐకానిక్ చిత్రం. ఈ సినిమా అప్పట్లో పెద్ద సెన్సేషన్. మళ్ళీ ఇన్ని దశాబ్దాల తర్వాత భారతీయుడుకి సీక్వెల్ వస్తోంది. భారతీయుడు 2 త్వరలోనే విడుదల కాబోతోంది. అయితే ఈ చిత్రంపై అంచనాలు మరీ భారీ స్థాయిలో అయితే లేవు. బజ్ కొంచెం తక్కువగానే ఉంది.
ఇక ఈ చిత్రంకు సంబంధించి మరో ఆసక్తికర సమాచారం బయటకు వచ్చింది. భారతీయుడు 2లో కమల్ హాసన్ కనిపించేది కాసేపే అని అంటున్నారు. భారతీయుడు 2 మొత్తం సిద్ధార్థ్ పాత్ర చుట్టూ తిరుగుతుందిట. ముసలి కమల్ హాసన్ కేవలం సెకండ్ హాఫ్ లో చివర్లో వస్తాడని అంటున్నారు.
ఇక కమల్ హాసన్ విశ్వరూపం మొత్తం భారతీయుడు 3 లోనే చూడాలి అని సమాచారం. నిజానికి శంకర్ మొదట భారతీయుడు 3 అనుకోలేదు. అయితే కథా విస్తరణలో భాగంగా సెకండ్ పార్ట్ అంతకంతకూ పెరుగుతుండడంతో మూడో భాగం కూడా షూటింగ్ చేస్తున్నారు.